రాజకీయాలను అవినీతిమయం చేసిందే బాబు
సాక్షి, హైదరాబాద్: ఏ కేసులో అయినా బెయిల్ రావడం సహజమని కానీ, పట్టపగలు దొరికిన దొంగకు బొట్టుపెట్టి చంద్రబాబు స్వాగతం పలుకుతున్నాడని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నిత్యం అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు వెలివేయలేదని ప్రశ్నించారు.
మరో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథ కానికి అడ్డం పడుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖరాసిన సంగతి మరిచి రేవంత్‌రెడ్డి డబ్బు సంచుల కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. రాజకీయాలను అవినీతిమయం చేసింది చంద్రబాబు అని మంత్రి ల క్ష్మారెడ్డి ఆరోపించారు.