minorities communities
-
‘అమెరికాలా భారత్ పరిపూర్ణ దేశం కాకపోవచ్చు’
న్యూయార్క్: భారత ప్రధాని మోదీ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే టైంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. ఇలా పలువురు ఒబామాపై మండిపడ్డారు. ఈ క్రమంలో.. అమెరికాకే చెందిన ఓ మాజీ ఉన్నతాధికారి ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒబామా తన శక్తినంతా భారత్‌ను విమర్శించడానికి బదులు పొగడడానికి ఉపయోగించాలంటూ సూచించారు యూఎస్సీఐఆర్ఎఫ్(అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థ) మాజీ కమిషనర్ జానీ మూర్. భారత్‌ను విమర్శించడం కంటే.. పొగడడం కోసం తన శాయశక్తులా ఆయన(ఒబామాను ఉద్దేశించి..) కృషి చేయడం మంచిదని నేను అనుకుంటున్నా. మానవ చరిత్రలోనే అత్యంత వైవిధ్యం ఉన్న దేశం భారత్. అది అమెరికాలాగా అది పరిపూర్ణ దేశం కాకపోవచ్చు. కానీ, భిన్నత్వం ఆ దేశానికి ఉన్న అతిపెద్ద బలం. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వీలైనప్పుడల్లా పొగడాలే తప్పా.. ఇలా విమర్శించకూడదు’’ అని ఒమామాకు సలహా ఇచ్చారు జానీ మూర్. మోదీ అమెరికా పర్యటన చారిత్రాకమైందన్న ఆయన.. మిత్రదేశాల పట్ల ప్రజాసామ్య యుతంగానే ముందుకు వెళ్లాలని, సాధ్యమైనంత వరకు బహిరంగ విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారాయన. #WATCH | Reacting to former US President Barack Obama's remarks about the rights of Indian Muslims, Johnnie Moore, former Commissioner of US Commission on International Religious Freedom, says, "I think the former president (Barack Obama) should spend his energy complimenting… pic.twitter.com/227e1p17Ll — ANI (@ANI) June 26, 2023 ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే.. ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ ఆ ఇంటర్వ్యూలో ఒబామా అభిప్రాయపడ్డారు. అలాగే.. మోదీ-బైడెన్ చర్చల్లో మైనార్టీల హక్కుల పరిరక్షణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. యూఎస్సీఐఆర్ఎఫ్ అనేది.. 1998 ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ద్వారా అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్లను అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు సెనేట్, హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఉభయ సభల్లోని లీడర్లు ఎన్నుకుంటారు. ఇక జానీ మూర్ గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఆధ్యాత్మిక సలహాదారుగా పని చేశారు కూడా. ఇదీ చదవండి: ఆ విషయంలో అమెరికా కంటే ఆంధ్రానే మేలు -
పాక్ మైనార్టీలపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
సాక్షి, ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలతో ఇక్కడి మైనార్టీల భద్రత గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, తన దేశంలో ఉన్న మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఆర్టికల్ 370, 35ఏ, పౌరసత్వ సవరణ బిల్లులపై సత్వరం ట్విటర్లో స్పందించే ఇమ్రాన్, పాక్‌లోని మైనార్టీల సంరక్షణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయంలో పాక్ వైఖరిని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితిలోని కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ వుమెన్ అనే విభాగం ఈ నెలలో వెలువరించిన నివేదికలో పాకిస్తాన్‌లోని మైనార్టీల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది. 2017 నుంచి మతపర మైనార్టీల పిల్లలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన 47 పేజీల నివేదికలో హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులపై జరుగుతున్న హింసను కమిషన్ ప్రధానంగా ప్రస్తావించింది. వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, బలవంతపు మత మార్పిడిలు, బాల్య వివాహాలు, యువతుల అపహరణ వంటివి యధేచ్ఛగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాటిని నిరోధించడంలో ఇమ్రాన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించింది. మైనార్టీలపై మతపరమైన దాడులు చేయడానికి వివక్షతో కూడిన చట్టాలు రూపొందించి, తీవ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం అధికారమిచ్చిందని మండిపడింది. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాలికలను బలవంతపు మత మార్పిడిలు చేయడం, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటనలపై మైనార్టీలు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, పోలీసుల అలసత్వం, లోపభూయిష్ట న్యాయవ్యవస్థ వల్ల బాధితులకు న్యాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని వివరించింది. చాలా సందర్భాల్లో కిడ్నాప్‌కు గురైన వారు తిరిగి వస్తారనే నమ్మకుం కూడా ఆయా కుటుంబ సభ్యులకు లేదని వెల్లడించింది. అలాగే దైవ దూషణ కేసులు పెరిగిపోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ప్రయోగించి మైనార్టీలను చంపడమో లేక బలవంతపు మతమార్పిడి చేయడమో చేస్తున్నారని వివరించింది. మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం, నిరక్షరాస్యత వంటి కారణాలతో మెజార్టీ ప్రజలకు సులువుగా లక్ష్యంగా మారుతున్నారని స్పష్టం చేసింది. ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లో మైనార్టీల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణగా సింధ్ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్‌ఖాస్‌లో జరిగిన ఉదంతాన్ని చూపించింది. హిందూ మతానికి చెందిన పశు వైద్యుడు రమేష్ కుమార్ మల్హి అనే వ్యక్తి ఖురాన్ శ్లోకాలు ఉన్న పేపర్లో మందులు చుట్టి ఇచ్చాడని అతని ఆస్పత్రిని నిరసనకారులు తగులబెట్టారు. అంతేకాక, చుట్టుపక్కల హిందువులకు చెందిన వ్యాపార దుకాణాలను తగులబెట్టారని పేర్కొంది. ఇలాంటి ధోరణి పాఠశాలలకు కూడా పాకిందని, మైనార్టీ విద్యార్థుల పట్ల తోటి విద్యార్థులు బెదిరించడం, ఆట పట్టించడం, అవమానపరచడం, వేరుగా కూర్చోబెట్టడం వంటివి చేస్తున్నారని తెలిపింది. వారు శారీరకంగా, మానసికంగా అనేక వేధింపులకు గురవుతున్నారని నివేదికలో పొందుపరిచింది. గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఉగ్రవాదం పెరగడం, చట్టాల దుర్వినియోగం, తప్పుడు కేసుల వల్ల మతహింస దారుణంగా పెరిగిపోయిందని నొక్కిచెప్పింది. దైవ దూషణ చట్టం, అహ్మదీయ వ్యతిరేక చట్టం లాంటివి మతపరమైన మైనార్టీలను హింసించడానికే కాకుండా రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా కూడా ఉపయోగపడుతున్నాయని వివరించింది. వీటిని అడ్డుకోవడానికి మానవ హక్కుల నేతలు ఎవరైనా కలుగజేసుకుంటే వారికీ తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేస్తున్నారని వివరించింది. ఇలాంటి ధోరణుల వల్ల సమాజంలో అసమతౌల్యత అసాధారణంగా పెరిగిపోయిందని, దీన్ని నివారించడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించాలని సూచించింది. చదవండి (‘భారత్‌లాగే పాక్‌లో పౌరసత్వ బిల్లు పెట్టాలి’) -
ఆ ఉత్తర్వులపై మైనారిటీ కమిషన్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ స్కూల్స్‌లో గాయత్రి మంత్రం పఠించాలనే నిబంధన దుమారం రేపింది. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులచే గాయత్రి మంత్రం పఠించాలని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఢిల్లీ మైనారిటీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు సంస్థకు మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల అసెంబ్లీలో ఉదయాన్నే గాయత్రి మంత్రం జపించాలని ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారో వివరణ ఇవ్వాలని కోరామని ఢిల్లీ మైనారిటీ కమిషన్ చీఫ్ జఫరుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. ఎన్డీఎంసీ ఉత్తర్వులు లౌకిక స్ఫూర్తికి విఘాతమని, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఓ మతానికి చెందిన మంత్రాలను పఠించేందుకు ఇష్టపడరని చెప్పారు. కాగా, గాయత్రి మంత్రం జపించాలనే ఉత్తర్వులను ఎన్డీఎంసీ అధికారులు సమర్ధించుకున్నారు. స్కూళ్లలో గాయత్రి మంత్రం పఠించాలనే ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాల్సినవి కాదని స్పష్టం చేశారు. ఎన్డీఎంసీ పరిధిలో 765 పాఠశాలలు నిర్వహిస్తున్నక్రమంలో 2.2 లక్షల మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. -
బలహీన వర్గాల అణిచివేతకు ప్రభుత్వ కుట్ర
బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట కార్యదర్శి జగన్ జహీరాబాద్ టౌన్: రాష్ర్ట ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రపన్నుతోందని బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొండాపూర్ జగన్ ఆరోపించారు. బుధవారం ఆయన జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను విలీనం చేయాలని, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను ఒకే గొడుగు కిందని తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పొద్దుటూరి శ్రీనివాస్‌గుప్తా, మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్‌బండారీ, ఐటీ సెల్ కన్వీనర్ ఆశోక్‌బెల్కేరి తదితరులు పాల్గొన్నారు.