Minority Morchas National Executive
-
ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశంలో ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మైనార్టీల అభివృద్ధికి కృషి జరుగుతోందని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ, కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు హనీఫ్ అలీ పేర్కొన్నారు. నగరానికి చెందిన బీజేపీ సీనియర్ మైనార్టీ నేత అబ్దుల్ రహీంకు మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవి లభించడంతో నిర్వహించిన అభినందన సభలో పాల్గొనేందుకు మంగళవారం నగరానికి వచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని మైనార్టీలకు బీజేపీని శత్రువుగా చూపి దూరం చేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించే బీజేపీ ముస్లింల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీయలేదని చెప్పారు. గత సీఎం చంద్రబాబు ఫొటోలు మార్చి వారి పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు అస్తులను గుర్తించి అన్యాక్రాంతం కాకుండా వాటిని పరిరక్షిస్తామని ప్రకటించారు. అనంతరం అబ్దుల్‌రహీం దంపతులను సత్కరించారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ్, రాష్ట్ర నాయకులు ఖలీబుతుల్లా, సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, శ్రీనివాసులు, చాంద్‌బాషా, షఫీపుల్లా, సుమేరా, యాస్మిన్, తాజుద్దీన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నగరాధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, జిల్లా నాయకులు ఫిరోజ్, అజారుద్దీన్, షబ్బీర్, తాహీర్, మహబూబ్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్ అల్లర్లు మోడీకి ఆపాదించడం అన్యాయం
2002, గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల వెనక కాంగ్రెస్, మరికొన్ని పార్టీల హస్తం ఉందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ పాలకుల నుంచి విభజించి, పాలించు సిద్దాంతాన్ని ఒంట పట్టించుకుందని ఆయన ఎద్దేవా చేశారు. మతం ప్రాతిపదికగా దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీలు చేసిన కుటిల యత్నంలో భాగంగా ఆ అల్లర్లు చోటు చేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన బీజేపీ మైనారటీ మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నాయి. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వ పాలన ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అలాంటి సంఘ విద్రోహ ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ హేయమైన ఆ ఘటనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆపాదించడం అన్యామని పేర్కొన్నారు. నరేంద్రమోడీతో సమవేశమై గుజరాత్ అల్లర్ల అంశంపై చర్చించగా ఆయన తీవ్ర విచారం వక్త్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ అల్లర్లు వెనక మోడీ హస్తం ఉందని ప్రచారాన్ని రాజనాథ్ తీవ్రంగా ఖండించారు. మోడీ పాలనలో గుజరాత్ రాష్ట్రంలో మీకు ఏమైన అవమానాలు ఎదురవుతున్నాయా అని ఆ సభకు హాజరైన మైనారీటీలను ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ ప్రశ్నించారు.