గుజరాత్ అల్లర్లు మోడీకి ఆపాదించడం అన్యాయం
2002, గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల వెనక కాంగ్రెస్, మరికొన్ని పార్టీల హస్తం ఉందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ పాలకుల నుంచి విభజించి, పాలించు సిద్దాంతాన్ని ఒంట పట్టించుకుందని ఆయన ఎద్దేవా చేశారు. మతం ప్రాతిపదికగా దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీలు చేసిన కుటిల యత్నంలో భాగంగా ఆ అల్లర్లు చోటు చేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఆదివారం ఆయన బీజేపీ మైనారటీ మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నాయి. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వ పాలన ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అలాంటి సంఘ విద్రోహ ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ హేయమైన ఆ ఘటనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆపాదించడం అన్యామని పేర్కొన్నారు. నరేంద్రమోడీతో సమవేశమై గుజరాత్ అల్లర్ల అంశంపై చర్చించగా ఆయన తీవ్ర విచారం వక్త్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ అల్లర్లు వెనక మోడీ హస్తం ఉందని ప్రచారాన్ని రాజనాథ్ తీవ్రంగా ఖండించారు. మోడీ పాలనలో గుజరాత్ రాష్ట్రంలో మీకు ఏమైన అవమానాలు ఎదురవుతున్నాయా అని ఆ సభకు హాజరైన మైనారీటీలను ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ ప్రశ్నించారు.