Miss India USA
-
కాబోయే డాక్టర్‌కు ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటం (ఫొటోలు)
-
Miss India USA 2023: కాబోయే డాక్టరమ్మకు అందాల కిరీటం
‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్ మైని మిచిగాన్ (యూఎస్)లో మెడికల్ స్టూడెంట్. ఈ ఇండో– అమెరికన్ స్టూడెంట్ ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది... ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు. ‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్ ఇండియా యూఎస్ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్ మైని. ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ రిజుల్ మైని తనను తాను మెడికల్ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ‘హ్యుమన్ సైకాలజీ’లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్... ఇలా ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం. ‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం. -
Miss India USA 2022: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ): అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్‌గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను శుక్రవారం పెనుగొండ మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు. (క్లిక్: ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ) చదవండి: (Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త) -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట)