missing AN-32 aircraft
-
విమానంలో భర్త.. ఏటీసీలో భార్య!
న్యూఢిల్లీ/ఇటానగర్: 12 మందితో ప్రయాణిస్తున్న ఆ విమానానికి భర్త పైలెట్ కాగా, భార్య ఏటీసీలో విధి నిర్వహణలో ఉన్నారు. ఆ విమానం(ఏఎన్–32) ఆచూకీ తెలియకుండా పోయిన విషయం మొదటగా తెలుసుకుంది ఆమెనే. వివాహమైన ఏడాదికే భర్త అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం..అందుకు భార్య ప్రత్యక్ష సాక్షి కావడం విధి ఆడిన వింత నాటకం! సోమవారం భారత్, చైనా సరిహద్దుల్లో ఆచూకీ తెలియకుండా పోయిన ఏఎన్–32 విమానం పైలెట్ ఆశిష్ తన్వర్(29)కాగా ఆయన భార్య సంధ్యా తన్వర్ ఆరోజు ఏటీసీ విధుల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్–32 రకం విమానం 12 మందితో బయలుదేరింది. ఒంటి గంట సమయంలో కంట్రోల్ రూంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. భర్త నడుపుతున్న విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని అందరికంటే ముందుగా జోర్హాట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారిగా ఉన్న సంధ్య గ్రహించారు. మిగతా వారిని అప్రమత్తం చేశారు. ఆశిష్ తన్వర్, సంధ్య వివాహం 2018లో కాగా, ఇద్దరూ ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదా అధికారులే. పెళ్లయిన ఏడాదికే ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్యా కలలోనైనా ఊహించి ఉండకపోవచ్చు. విమానంతోపాటు ఆశిష్, తదితరుల జాడ తెలియక పోవడంతో వారి కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. హరియాణా రాష్ట్రంలోని పల్వాల్‌లోని దీఘోట్ గ్రామానికి చెందిన ఆశిష్ బీటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఆశిష్ 2013లో భారత వాయుసేనలో చేరారు. దట్టమైన పొగ చూశాం: గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం వైమానిక దళం విమానం కూలిన సమయంలో తమ సమీపంలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడం గమనించినట్లు గ్రామీణులు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సియాంగ్, పశ్చిమ సియాంగ్ జిల్లాల్లోని ఎత్తైన పర్వత శ్రేణుల్లో అన్వేషణ ముమ్మరం చేశారు. సియాంగ్ జిల్లా తుంబిన్ గ్రామస్తులు చెప్పిన దానిని బట్టి ఆ ప్రాంతంలో గాలింపు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సీఎం పెమా ఖండు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం షి–యోమి, సియాంగ్ జిల్లాల పరిధిలో విమానం జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
విమానం జాడపై తొలగని ఉత్కంఠ
ఈటానగర్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్–32 విమానం అస్సాంలోని జోర్హత్ నుంచి టేకాఫ్ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్ఎస్ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు. ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అస్సాంకు చేరిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబసభ్యులు పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్ లెఫ్లినెంట్ మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్ తండ్రి సురీందర్ గార్గ్, అంకుల్ రిషీ గార్గ్ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్ తెలిపారు. మోహిత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం. -
'విమానం గల్లంతు విద్రోహచర్య కాదేమో'
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32 అదృశ్యం వెనుక విద్రోహుల హస్తం ఉండకపోవచ్చని, అలా జరిగే అవకాశాలు చాలాచాలా తక్కువని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన గల్లంతైన విమానం ఆచూకీ కోసం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలను సభ్యులకు తెలిపారు. (ఆపరేషన్ తలాష్) ''ఆపరేషన్ తలాష్'ను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. ఇది విద్రోహ చర్య అయ్యే అవకాశాలు చాలా తక్కువ. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మందికి చెందిన కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం' అని పరీకర్ తెలిపారు. ఈ నెల 22న గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతై ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు దాని జాడ తెలియక పోవడంతో అందులో ప్రయాణించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. (భగవంతుడా మాకేంటీ కష్టం..!) విమానం గాలింపులో రోబోలు ఇప్పటికే వివిధ శాఖలు విమానం ఆచూకీ కోసం తలపెట్టిన 'ఆపరేషన్ తలాష్' లో నిమగ్నమయ్యాయి. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. (చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం) బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. (విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం)