Missing Mystery
-
మిస్సింగ్ మిస్టరీ
-
మూడు నెలలు దాటినా దొరకని జవాన్ నవీన్ ఆచూకీ
-
సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..
మనిషి మేధస్సుకి అందని ఈ సృష్టి.. ఓ అస్పష్టమైన అధ్యాయం. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటూ ప్రయాణించడమే మనకి తెలిసిన తర్కం. అయితే ఊహలను సైతం వణికించే కొన్ని విషయాలను విశ్లేషించే కంటే విస్మరించడమే మేలంటారు అనుభవజ్ఞులు. ఏలియన్స్, టైమ్ ట్రావెల్, పునర్జన్మలు, ఆత్మలు ఇవన్నీ అలాంటివే. ‘గ్రహాంతరవాసుల రాక, చనిపోయినవారు తిరిగి జన్మించడం, ఆత్మకు మరణం లేదనుకోవడం వంటివాటికి అంతో ఇంతో ఆధారాలు కనిపించినా టైమ్ ట్రావెల్ మాత్రం కంప్లీట్‌గా íఫిక్షన్‌కి, సినిమాలకు మాత్రమే పరిమితం’ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే దాన్ని నిర్ధారించే కొన్నిపేజీలను నూటా డెబ్భై ఆరేళ్ల కిందటే చరిత్ర భద్రపరచింది. ‘ఆదిత్య 369’ సినిమా చూసే ఉంటారుగా? ప్రస్తుతం నుంచి గతానికి, గతం నుంచి భవిష్యత్‌కి వెళ్లడమే ఆ కథసారాంశం. అలాంటిదే ఇటలీలో సరిగ్గా నూట పదేళ్ల కిందట జరిగింది. అది కథ కాదు నిజం! ఇంతకుముందే నూట డెబ్భైఆరేళ్లు అని, ఇప్పుడు నూట పదేళ్లు అంటారేంటీ? అని డౌటనుమానం వద్దు. ఈ కథనాన్ని పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. ట్రైన్ మిస్సింగ్ నూట పదేళ్ల కిందట అంటే 1911లో ఇటలీలోని జనెటి అనే కంపెనీ.. మూడు బోగీల న్యూ మోడల్ ట్రైన్‌ను ప్రవేశపెట్టి, ‘ఉచిత ప్రయాణం చేసేవాళ్లకు ఇదే అరుదైన అవకాశం’ అంటూ ప్రకటించింది. ఉత్సాహవంతులు ఎగబడ్డారు. వంద మంది ప్రయాణికులు.. ఆరుగురు రైల్వే సిబ్బందితో మొత్తం నూటారు మంది రోమ్ నగరం నుంచి ఆ ట్రైన్లో బయలుదేరారు. దారిలో ఓ పర్వత ప్రాంతం మీదుగా పోతున్న ఆ ట్రైన్.. ఒక కిలోమీటరు పొడవున్న సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ తర్వాత ఆ ట్రైన్ మరో స్టేషన్‌ని చేరుకోలేదు. కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన రైల్వే అధికారులు సొరంగాన్ని చేరి, కిలోమీటరు పొడవునా అణువణువూ గాలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. పోనీ ఆ సొరంగానికి మరో మార్గం ఉందా అంటే, అదీ లేదు. ‘అయినా ఏదో కుక్కపిల్ల మిస్ అయినట్లు నూటారు మంది ఉన్న ట్రైన్ ఎలా మిస్ అవుతుంది? కనిపించకుండా పోవడానికి చిన్న వస్తువేం కాదు కదా?’ ఇవే ప్రశ్నలు నాటి పత్రికలను, అక్కడి మహా మహా మేధావులను, ఉన్నతాధికారులను తలలు పట్టుకునేలా చేశాయి. సరిగ్గా అప్పుడే ఆ ట్రైన్ నుంచి బయటపడిన ఇద్దరు ప్రయాణికుల సమాచారం తెలిసింది. ఆ ఇద్దరూ భయంతో రైలు నుంచి దూకేశారని తేలింది. మరి మిగిలిన నూట నాలుగు మంది ఏమయ్యారు? మూడు బోగీల ట్రైన్ ఎక్కడికి వెళ్లింది? రైలు నుంచి దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆసుపత్రిలో చేరారు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చికిత్స అనంతరం ఆ ఇద్దరిలో ఒకతను నోరు విప్పాడు. అసలు విషయం బయటపెట్టాడు. ఆ రోజు రైలు సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ కమ్మేసిందని, రైల్లో ఉన్నవాళ్లంతా పెద్దపెద్దగా అరవడం విని భయంతో బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలు ఏమైందో తెలియదని చెప్పాడు. అతడు చెప్పింది విని చిన్నపాటి ఆశతో మరోసారి ఆ సొరంగాన్ని శోధించారు అధికారులు. ఫలితం లేదు. అరవై ఆరేళ్లు వెనక్కి.. 1911లో మిస్సయిన నూట నాలుగు మంది ప్రయాణికులు.. 1845 సంవత్సరానికి చేరుకున్నారనే ఓ రిపోర్ట్ 1926లో అంటే ట్రైన్ మిస్ అయిన పదిహేనేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది విన్న యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం 1845 సంవత్సరంలో ఆ నూట నాలుగు మంది ప్రయాణికులు.. ‘మేమంతా ఇటలీలోని రోమ్ నుంచి జనెటి ట్రైన్లో ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. అయితే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో–ఇటలీల మధ్య రైల్వే మార్గం లేదు. సముద్రయానం తప్ప మరో దారే లేదు. అలాంటిది.. ‘మేమంతా ఇటలీ నుంచి రైల్లో వచ్చాం’ అని చెప్పడంతో అక్కడ అధికారులు వాళ్లని పిచ్చివాళ్లుగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మెక్సికో అధికారులు.. ఇటలీ అధికారులని సంప్రదించారు. అయితే, అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ‘1911 ట్రైన్ మిస్సింగ్’ ఘటన ఇటలీలో చోటుచేసుకోలేదు. దాంతో ఆ నూట నాలుగు మంది తమ దేశం వాళ్లు కాదని, అలాంటి ట్రైన్ తమ వద్ద లేనే లేదని తేల్చేసింది ఇటలీ. ఆ నూట నాలుగు మందిలో ఒక వ్యక్తి దగ్గర ‘డన్హిల్’ కంపెనీకి చెందిన సిగార్ పెట్టె దొరికింది. దాని మీద ‘1907’ సంవత్సరం ప్రింట్ అయ్యి ఉండటం ఆశ్చర్యం. అయితే ఈ ట్రైన్ రష్యా, జర్మనీ, రుమేనియా, ఇటలీతో పాటు ఇండియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ మాయమవుతూ ఉందని, 1991లో ఉక్రేయి¯Œ లోని పోల్టావాలోనూ ఈ రైలు కనిపించిందని, ఆత్మలపై పరిశోధనలు చేసే ఓ వ్యక్తి ఈ రైలులోకి దూకాడని, ఆ తర్వాత మళ్లీ అతడు కనిపించలేదని, ఇదో ఘోస్ట్ ట్రైన్ అని హడలెత్తించే పలు కథనాలు పుకారులుగా నేటికీ షికార్లు చేస్తున్నాయి. అయితే 1911లో ఇటలీలో ట్రైన్‌తో సహా మిస్ అయిన నూట నాలుగు మంది.. అరవై ఆరేళ్లు వెనక్కి వెళ్లి, 1845లో మెక్సికోలో ప్రత్యక్షం కావడమేంటీ? పైగా వారి దగ్గర 1907 సంవత్సరం నాటి సిగార్ ప్యాకెట్ దొరకడమేంటి? అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన జనెటి ట్రైన్‌ని మాయం చేసిన ఆ సొరంగం.. ప్రపంచయుద్ధ సమయంలోని వైమానిక దాడుల్లో నాశనం అయింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికీ ఆ ట్రైన్ మోడల్ ప్రదర్శనకు ఉంది. ఇక ఆ ట్రైన్లో లభించిన 1907 నాటి సిగార్ ప్యాకెట్‌ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారు. -
పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ
సాక్షి,నెన్నెల(ఆదిలాబాద్): అక్కాతమ్ముడు..అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. అనుబంధమే పదేళ్ల తర్వాత అక్కాతమ్ముడిని మళ్లీ కలిపింది. కుటుంబానికి దగ్గర చేసింది. చనిపోయిందేమో.. అనుకున్న మహిళ శనివారం తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, మధునక్క దంపతులకు కుమారులు శ్రీనివాస్, పవన్, కూతురు రజిత ఉన్నారు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండేవారు. ఈ ప్రాంతం నుంచి కూలీలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. అలా పనుల కోసం పదేళ్ల క్రితం వెళ్లిన రజిత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జమ్మికుంటలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హనీగావుకు చెందిన రాజు అనే యువకుడు రజితకు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్క డే రాజును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తల్లి దండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంతకాలం నెన్నెలకు రాలేదు. రజిత ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా చనిపోయిందేమోనని భావించారు. రెండేళ్ల క్రితం ఆమె అన్న శ్రీనివాస్ చనిపోయినా సమాచారం తెలియకపోవడంతో రాలేదు. ఇటీవల రాఖీ పండుగకు రజిత భర్త రాజుకు రాఖీ కట్టేందుకు అతడి చెల్లెళ్లు రావడం, రాఖీ కట్టడం తన తమ్ముడిని, కుటుంబాన్ని గుర్తు చేసింది. ‘‘మా ఆయనకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెళ్లను చూసి నాకు నా తమ్ముడు పవన్ గుర్తుకు వచ్చాడు. వాడికి రాఖీ కడతానని మూడు రోజుల క్రితం నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం నెన్నెలకు వచ్చాను.. నాకు ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పదేళ్ల తర్వాత మా అమ్మానాన్నలు, నా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది..’’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. మహారాష్ట్రలో జీవనంతో ఆమె కట్టు, బొట్టు మారింది. మరాఠీ, హిందీ భాషా మాట్లాడుతోంది. ఆమెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. శనివారం తమ్ముడు పవన్‌కు రాఖీ కట్టింది. అన్నను గుర్తు చేసుకుంటూ విలపించింది. చదవండి: సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా? -
అక్రమ సంబంధంతోనే హత్య
♦ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు భార్య పథకం ♦ దారుణానికి ఒడిగట్టిన తిర్మలాపూర్ సర్పంచ్ యాదవరెడ్డి ♦ పోలీసుల అదుపులో నిందితులు వీడిన మిస్సింగ్ మిస్టరీ ♦ తిర్మలాపూర్‌లో శవం వెలికితీత దౌల్తాబాద్: అక్రమ సంబంధం చివరకు హత్యకు దారితీసింది. ప్రియురాలి భర్త తమ వ్యవహారానికి అడ్డుగా నిలుస్తాడని భావించిన ప్రియుడు అతడిని హతమార్చేందుకు పన్నాగం పన్నాడు. ఆమె సాయంతో వెన్నంటే వెళ్లి అంతమొందించాడు. ఏమీ తెలియనట్టుగా మూడు నెలలపాటు జనంలో సంచరించిన వారు కటకటాలపాలయ్యారు. సెల్‌ఫోన్ సంభాషణలు వారి గుట్టురట్టు చేశాయి. మిస్సింగ్ మిస్టరీ వీడింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గజ్వేల్ పట్టణంలో టీవీ మెకానిక్‌గా పనిచేసే మాస అచ్చారావు(40)కు జగదేవ్‌పూర్ మండలవాసి కవితతో 18 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కవిత గజ్వేల్‌లోనే ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించేది. కాగా సుమారు రెండు, మూడేళ్ల క్రితం దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ సర్పంచ్ సర్వుగారి యాదవరెడ్డితో కవితకు పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం కొంతకాలానికి ఆమె భర్త అచ్చారావుకు తెలిసింది. పలుమార్లు ఆమెను మందలించినా బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే అచ్చారావు ఏడాది క్రితం గజ్వేల్‌లో టీవీ మెకానిక్ దుకాణం తీసేశాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ టీవీ షోరూంలో ఎలక్ట్రీషియన్‌గా పనికి కుది రాడు. నిత్యం బస్సులో జూబ్లీ బస్టేషన్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి తన ద్విచక్రవాహనంలో విధులకు వెళ్లేవాడు. మూడు నెలలుగా అదృశ్యం కాగా అచ్చారావు 3 నెలల క్రితం అదృశ్యమయ్యాడు. జనవరి 13 నుంచి అతను ఇంటికి రాలేదు. తన భర్త ఇంటికి రాలేదని కవిత ఇచ్చిన సమాచారం మేరకు ఆమె సోదరుడు మహిపాల్‌రెడ్డి 14న సికింద్రాబాద్ వెళ్లి వాకబు చేశాడు. బంధువులనూ ఆరా తీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రోజు సాయంత్రం మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అచ్చారావు కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారం.. కాగా సినీ పక్కీలో అచ్చారావు హత్యచేసేందుకు నిందితులు పథకం రూపొం దించారు. నిత్యం బస్సులో వచ్చే అచ్చారావును అతడి భార్య కవితతో ఫోన్ చేయించి ద్విచక్రవాహనంపై వచ్చే విధంగా పథకం పన్నారు. తను జూబ్లీ బస్టాండు నుంచి బైక్‌పై బయల్దేరానని ఫోన్లో చెప్పగానే కవిత ఈ విషయాన్ని యాదవరెడ్డికి చేరవేసింది. దీంతో అప్పటికే తిర్మలాపూర్‌కు చెందిన కన్నారెడ్డి, ఆంజనేయులు గౌడ్లతో కలిసి రహదారిపై మాటువేసిన యాదవరెడ్డి.. తుర్కపల్లి సమీపంలోకి రాగానే బైక్ వెనుక నుంచి అదే గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన మాక్స్ వాహనంతో ఢీకొట్టారు. కిందపడిన అచ్చారావును అందరూ కలి సి వెనక చేతులు కట్టేసి అదే వాహనంలో వేసుకుని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ యాదవరెడ్డికి చెందిన పౌల్ట్రీఫారాల సమీపంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. చేతులకు కట్టిన తాడుతోనే మెడకు బిగించి హతమార్చారు. అక్కడ అప్పటికే తీసిన జేసీబీ గుంతలోకి తోసేసి మట్టిపోశారు. సెల్‌ఫోన్‌తో గుట్టురట్టు.. కేసు దర్యాప్తులో భాగంగా ఈస్ట్‌మారేడ్‌పల్లి పోలీసులు సెల్‌ఫోన్ ట్యాపింగ్‌తో గుట్టురట్టు చేశారు. 3 నెలల నుంచి యా దవరెడ్డి, కవిత ఫోన్ నంబర్లను ట్యాప్చేశారు. వారి సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు కొంతకాలంగా తిర్మలాపూర్‌లో రెక్కీ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. మాక్స్ డ్రైవర్ కృష్ణను ముందుగా అదుపులోకి తీ సుకుని విచారించి నిందుతులను గుర్తిం చారు. కృష్ణతోపాటు యాదవరెడ్డి, ఆంజ నేయులుగౌడ్, కన్నారెడ్డి, కవితలను అ దుపులోకి తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం యాదవరెడ్డిని తిర్మలాపూర్‌కు తీసుకువచ్చి అచ్చారావును పాతిపెట్టిన చోటును గుర్తించారు. అహ్మద్‌నగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలను సేకరించారు. అనంతరం జేసీబీతో 10 అడుగుల లోతులో నుంచి శవాన్ని వెలికితీశారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి నుం చి వచ్చిన డాక్టర్ కళాధర్ సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. ఈస్ట్‌మారేడ్‌పల్లి సీఐ ఉమామహేశ్వర్రావు, తొగుట సీఐ వెంకటయ్య, ఎస్ఐలు పరుశురాం, కృష్ణలు వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. టీఆర్ఎస్ నుంచి యాదవరెడ్డి సస్పెన్షన్ తిర్మలాపూర్ సర్పంచి యాదవరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రకటించారు. ఆయన శనివారం సాక్షితో ఫోన్లో మాట్లాడారు. మేకవన్నె పులిలా తిరిగిన యాదవరెడ్డి తీరును ఉపేక్షించబోమన్నారు. గజ్వేల్‌లో కలకలం... ఇదిలా ఉంటే అచ్చారావు హత్యోదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో కలకలం రేగింది.