mk sasikala
-
శశికళ కాన్వాయ్ పై దాడి
-
ఖైదీ నంబర్ 10711
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడిన అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ ఖైదీగా మారారు. అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె మరోసారి కటకటాల పాలయ్యారు. బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టులో లొంగిపోయిన ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ కూడా లొంగిపోయారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చడంతో ఆమె సాధారణ ఖైదీగా జైలు జీవితం గడపనున్నారు. శశికళకు జైలు అధికారులు 10711 నంబరు కేటాయించారు. ఇదే కేసులో శిక్ష పడిన ఇళవరసికి 10712 నంబరు ఇచ్చారు. శశికళ మూడున్నరేళ్లు శిక్ష అనుభవించనున్నారు. ఇప్పటికే ఆమె 6 నెలలు జైలులో గడిపారు. -
శశికళ కాన్వాయ్ పై దాడి
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు. మరోవైపు కోర్టులో లొంగిపోయిన శశికళ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..! సీఎం కుర్చీ కోసం నువ్వా-నేనా? చీలిక దిశగా అన్నాడీఎంకే! పన్నీర్ వర్సెస్ పళని జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?