MLA Challa Dharma reddy
-
నన్నపునేని నరేందర్‌కు షాక్.. కేటీఆర్ ఎందుకలా మాట్లాడారు!
సాక్షి , వరంగల్: వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఆసక్తికర రాజకీయ చర్చకు దారి తీసింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మరో మారు భారీ మెజారిటీతో గెలిపించి మూడోసారికి అసెంబ్లీకి పంపాలంటూ సభికుల సాక్షిగా మాట్లాడిన కేటీఆర్... అదే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్‌పై మాత్రం అంతే క్లారిటీగా మాట్లాడలేకపోయారు. ఆయా సభల్లో స్థానిక ఎమ్మెల్యేలను మరోసారి ఆశీర్వదించాలని చెబుతూ వస్తున్న మంత్రి కేటీఆర్ శనివారం వేర్వేరుగా జరిగిన సభల్లో రెండు రకాలుగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. గీసుకొండ మండలం కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘పరకాలలో ధర్మారెడ్డికి ఎదురు లేదు.. మళ్లీ ఆయననే గెలిపించాలి’ అని పిలుపునిచ్చిన కేటీఆర్.. వరంగల్ సభలో మాత్రం కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాట్లాడారు. ఈ మాటలతో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‌కు ‘టికెట్’ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బహిరంగ సభ వేదిక మీద తన పేరును ప్రకటిస్తారని భావించిన నరేందర్, ఆయన అనుచరులు కేటీఆర్ మాటలతో సందిగ్ధంలో పడినట్లయ్యింది. . ఆసక్తి రేపుతున్న ఎర్రబెల్లి వ్యాఖ్యలు... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్‌ల ఆశీర్వాదంతో వరంగల్ పట్టణం బాగుపడిందని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పొగిడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంకోవైపు ఆయన పేరు ప్రస్తావించకుండా వరంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చేసిన వ్యాఖ్యలు నరేందర్ అనుచరుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పులో వర్గ పోరు ఉండడం.. కేటీఆర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో నరేందర్ అభ్యర్థిత్వం చర్చనీయాంశంగా మారింది. -
ఓరుగల్లు ప్రచార క్షేత్రంలోకి టీడీపీ!
♦ టీడీపీ - బీజేపీ ఉమ్మడి{పచార వ్యూహం ఖరారు ♦ ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయిన ఇరు పార్టీల నేతలు ♦ నేటినుంచి ఉమ్మడి ప్రచారం! సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అధికారపార్టీపై ప్రజల్లో గూడుక ట్టుకున్న వ్యతిరేకతను వరంగల్ ఉప ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థి విజయానికి మెట్లుగా మలుచుకోవాలి..’ అని టీడీపీ-బీజేపీ నేతలు తీర్మానించుకున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో రెండు పార్టీల నేతలు సమావేశమై వరంగల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి ఇరు పార్టీల నేతలు కలసి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీల ఉమ్మడి అభ్యర్ధిగా డాక్టర్ దేవయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాము టికెట్ ఆశించినా దక్కలేదనే అసంతృప్తితో టీడీపీ నేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో తమకు టీడీపీ నేతలపై నమ్మకం లేదనే అభిప్రాయం కూడా బీజేపీ నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన తెలంగాణ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో వరంగల్ ఉప ఎన్నికలపై అధినేత చంద్రబాబుతో సమీక్ష జరిగింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలసి ప్రచారానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆదివారం టీడీపీ, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయ్యారని, వరంగల్ ఉప ఎన్నికల్లో ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రచారంపై వ్యూహాన్ని ఖరారు చే శారని తెలిసింది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరకాల, పాలకుర్తి సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. అయితే, పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. కాగా, ఉమ్మడి ప్రచారంలో భాగంగా ప్రతి పది పోలింగ్‌బూత్‌లకు ఒక సభ నిర్వహించనున్నారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలను క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రచారంలో దృష్టిపెట్టాలని తీర్మానించారు. -
'టీఆర్ఎస్లో చేరాలని ఎర్రబెల్లే చెప్పారు'
-
'టీఆర్ఎస్లో చేరాలని ఎర్రబెల్లే చెప్పారు'
హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావుపై పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్లో చేరాల్సిందిగా చెప్పింది ఎర్రబెల్లి దయాకర రావేనని ధర్మారెడ్డి వెల్లడించారు. ఎర్రబెల్లి, మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పరకాల నుంచి పోటిచేసేందుకు ఎర్రబెల్లి సిద్ధమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడతానని ధర్మారెడ్డి చెప్పారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ప్యాకేజీలు తీసుకుని సంస్కృతి ఎర్రబెల్లిదేనని ధర్మారెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. -
ఇద్దరం రాజీనామా చేద్దాం..
ఎర్రబెల్లికి ఎమ్మెల్యే చల్లా సవాల్ హన్మకొండ: ఎమ్మెల్యే పదవులకు ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామని, ఎవరు ఓడిపోయిన రాజకీయ సన్యాసం తీసుకుందామని.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. హన్మకొండలో శుక్రవారం ఎమ్మెల్యే చల్లా విలేకరులతో మాట్లాడుతూ టీడీపీని వీడిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని ఎర్రబెల్లి అంటున్నారనీ, తాను రాజీనామా చేస్తే, తనపై కానీ, సొంత నియోజకవర్గంలోకానీ పోటీ చేసి గెలిచే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. తాను ఒక్క రూపాయి తీసుకుని టీఆర్ఎస్లో చేరినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ కేసీఆర్ వద్దకు ఎర్రబెల్లి అర్ధరాత్రి వెళ్లింది నిజం కాదా? అని ప్రశ్నించారు. -
‘చల్లా’ చేరికకు ముహూర్తం ఖరారు
నవంబర్ 2న కారెక్కనున్న పరకాల ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశంలో వెల్లడించిన ధర్మారెడ్డి పరకాల: టీడీపీకి చెందిన పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో పరకాల నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన టీఆర్ఎస్, టీడీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన ఉన్నప్పటి కీ... అభివృద్ధి పనుల రూపకల్పనలో సీఎం బిజీగా ఉన్నారని చెప్పారు. దీంతో హైదరాబాద్‌కు తరలివెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 2న 15వేల మంది కార్యకర్తలతో తరలివెళతామన్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో తాను సైతం కేసీఆర్ వెంట నడువడం కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఒకటి రెం డు నెలల్లో అందరూ ఒక్కతాటిపైకి వచ్చే విధంగా బాధ్యత తీసుకుంటానన్నారు. అనంతరం ముఖ్య నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశంలో నాయకులు భీముడి నాగిరెడ్డి, దగ్గు విజేందర్‌రావు, ఎన్కతాళ్ల రవీందర్, కొంపెల్లి ధర్మారాజు, కోల్పుల కట్టయ్య, చింతం సదానందం, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, పులి సాగర్‌రెడ్డి, పరకాల, సంగెం జడ్పీటీసీలు పాడి కల్పనాదేవి, వీరమ్మ, నగర పంచాయతి చైర్మన్ రాజభద్రయ్య, విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.