'టీఆర్ఎస్లో చేరాలని ఎర్రబెల్లే చెప్పారు'
హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావుపై పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్లో చేరాల్సిందిగా చెప్పింది ఎర్రబెల్లి దయాకర రావేనని ధర్మారెడ్డి వెల్లడించారు. ఎర్రబెల్లి, మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పరకాల నుంచి పోటిచేసేందుకు ఎర్రబెల్లి సిద్ధమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడతానని ధర్మారెడ్డి చెప్పారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ప్యాకేజీలు తీసుకుని సంస్కృతి ఎర్రబెల్లిదేనని ధర్మారెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేరారు.