‘చల్లా’ చేరికకు ముహూర్తం ఖరారు
నవంబర్ 2న కారెక్కనున్న పరకాల ఎమ్మెల్యే
కార్యకర్తల సమావేశంలో వెల్లడించిన ధర్మారెడ్డి
పరకాల: టీడీపీకి చెందిన పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో పరకాల నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన టీఆర్‌ఎస్, టీడీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన ఉన్నప్పటి కీ... అభివృద్ధి పనుల రూపకల్పనలో సీఎం బిజీగా ఉన్నారని చెప్పారు. దీంతో హైదరాబాద్‌కు తరలివెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 2న 15వేల మంది కార్యకర్తలతో తరలివెళతామన్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో తాను సైతం కేసీఆర్ వెంట నడువడం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఒకటి రెం డు నెలల్లో అందరూ ఒక్కతాటిపైకి వచ్చే విధంగా బాధ్యత తీసుకుంటానన్నారు. అనంతరం ముఖ్య నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశంలో నాయకులు భీముడి నాగిరెడ్డి, దగ్గు విజేందర్‌రావు, ఎన్కతాళ్ల రవీందర్, కొంపెల్లి ధర్మారాజు, కోల్పుల కట్టయ్య, చింతం సదానందం, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, పులి సాగర్‌రెడ్డి, పరకాల, సంగెం జడ్పీటీసీలు పాడి కల్పనాదేవి, వీరమ్మ, నగర పంచాయతి చైర్మన్ రాజభద్రయ్య, విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.