MLA Chittem Ram Mohan Reddy
-
‘అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ’
ఊట్కూర్ : అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో మిషన్ భగీరథ ట్యాంకుల శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కె దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 500 పై ఓటర్లు కలిగిని గ్రామాలను పంచాయతీలు గుర్తించామన్నారు. తండాను గ్రామ పంచాయతీగా ఎన్నుకున్నందుకు తాండ వాసులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. వివిధ పార్టీల నాయకులు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంగా జెడ్పీటీసీ సూర్య ప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్, సర్పంచ్ విజయ భాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయసింహారెడ్డి, ఎంపీటీసీ కృష్ణర్జున్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కండి
అమరచింత : గ్రామాల అభివృద్ధికి సమష్టిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో సీడీసీ నిధులు రూ.5లక్షల వ్యయంతో బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఆ యన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే ఏడాది పాంరెడ్డిపల్లికి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ మార్క సరోజ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా అమరచింత పంచాయతీ పరిధిలోని దీప్లానాయక్ తండాకు రూ.58లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. Aటీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్ఎ.రాజు , మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ రాజేందర్‌సింగ్, ఆత్మకూర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు జ యసింహారెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్ పాల్గొన్నారు. -
దమ్ముంటే రాజీనామా చేసి గెలువు
సోదరుడు చిట్టెంకు డీకే అరుణ సవాల్ మక్తల్ : తన సోదరుడు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టమేమి జరగదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆదివారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోదరుడిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘ మేం గెలిపిస్తే నీవు ఎమ్మెల్యే అయ్యావ్.. లేకుంటే నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో’ అని పేర్కొన్నారు. తమ తండ్రి నర్సిరెడ్డి ఆశయ సాధనకు పార్టీ మారానని చెప్పుకోవడం సిగ్గుచేటని, వచ్చే ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరాలే.. కార్యకర్తలు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.