
టీఆర్‌ఎస్ లో చేరిన తండావాసులు
ఊట్కూర్ : అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో మిషన్ భగీరథ ట్యాంకుల శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కె దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 500 పై ఓటర్లు కలిగిని గ్రామాలను పంచాయతీలు గుర్తించామన్నారు.
తండాను గ్రామ పంచాయతీగా ఎన్నుకున్నందుకు తాండ వాసులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. వివిధ పార్టీల నాయకులు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. కార్యక్రమంగా జెడ్పీటీసీ సూర్య ప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్, సర్పంచ్ విజయ భాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయసింహారెడ్డి, ఎంపీటీసీ కృష్ణర్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment