పాంరెడ్డిపల్లెలో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి
అమరచింత : గ్రామాల అభివృద్ధికి సమష్టిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో సీడీసీ నిధులు రూ.5లక్షల వ్యయంతో బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఆ యన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే ఏడాది పాంరెడ్డిపల్లికి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ మార్క సరోజ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సత్కరించారు.
అదేవిధంగా అమరచింత పంచాయతీ పరిధిలోని దీప్లానాయక్ తండాకు రూ.58లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. Aటీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎస్‌ఎ.రాజు , మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ రాజేందర్‌సింగ్, ఆత్మకూర్ టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు జ యసింహారెడ్డి, టీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment