వాళ్లను తోసెయ్యండి
గట్టిగా మాట్లాడితే ఈడ్చేయండి
జన్మభూమి సభలో గోరంట్ల చిందులు
వైఎస్సార్సీపీ నేతలపై ఖాకీల జులుం
విచారణ పేరుతో అర్హులను తొలగిస్తే ఎలా..?
బుచ్చయ్యపై మండిపడ్డ కందుల దుర్గేష్
పలు జన్మభూమి సభల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు నో మైక్
సమస్యలు చెప్పనీయని సభలెందుకని విపక్షాల బహిష్కరణ
సాక్షి, రాజమహేంద్రవరం :
జనం కోసమే జన్మభూములంటూ ఊదరగొడుతున్న దేశం నేత లు అవే సభల్లో ప్రశ్నిస్తుంటే పోలీసులతో దౌర్యన్యకాండకు దిగుతున్నారు శనివారం ధవళేశ్వరంలో జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ‘ప్రతిపక్ష పార్టీ వాళ్లు మాట్లాడేందుకు వీలులేదు.వాళ్లను తోసేయండం’టూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులను ఆదేశిం చారు. ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం పోలీసులు మాజీ ఎమ్మె ల్సీ కందుల దుర్గేష్, రూరల్ కో ఆర్డినేటర్లలో ఒకరైన ఆకుల వీర్రాజు(బాబు), వైఎస్సార్సీపీ కార్యకర్తలను సభా ప్రాం గణం నుంచి నెట్టేశారు. స్థానికంగా ఉన్న అర్హులైన పేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు చేయగా విచారణ పేరుతో ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించడమే వీరు చేసిన నేరమా అని లబ్ధిదారులు కూడా వాగ్వివాదానికి దిగారు.
∙రంపచోడవరంలో జరిగిన జన్మభూమి సభలో స్థానిక జెడ్పిటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచి వై.నిరంజనీదేవి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్థి కార్యక్రమాలు చేస్తుందని సర్పంచి సభలో చెప్పడంతో జెడ్పీటీసీ గ్రామాల్లో రేష¯ŒSకార్డులు, పింఛన్లు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం తెలియడంలేదా అని నిలదీశారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో జరిగిన జన్మభూమి సభలో పిఠాపురం ఎమ్మెల్యే వర్మను గతంలో ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదని లబ్థిదారులు నిలదీశారు.
అయోమయంలో పోలవరం నిర్వాసితులు
చింతూరులో జరిగిన జన్మభూమి సభలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే జన్మభూమిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను ఏం అడిగినా ఆయా శాఖల రికార్డులు తెలంగాణలో ఉన్నాయని చెప్పడంపై అధికారులపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో జరిగిన జన్మభూమి స«భ రసాభసగా మారింది.