mla Kalavit
-
ఐటీడీఏలో బదిలీలు ఉండవా?
కీలకమైన పోస్టుల్లో ఇన్‌చార్జిలేనా? కొరవడిన జవాబుదారీ తనం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే కళావతి సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో జవాబుదారీ తనం కొరవడిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని జీరో అవర్‌లో నిలదీశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీతంపేట ఐటీడీఏలో ముఖ్యమైన పోస్టుల్లో ఇన్చార్జిలు కొనసాగడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్ పోస్టును డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. ఆయనకు ఏటీడ బ్ల్యూవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారని తెలిపారు. ఐటీడీఏ మేనేజరుకు పరిపాలనాధికారిగా పదోన్నతి కల్పించి ఏడేళ్లుగా అక్క డే కొనసాగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐటీడీఏ ఉద్యోగులకు బదిలీలు ఉండావా? అని ప్రశ్నించారు. హౌసింగ్, ఎస్ఎంఐ వం టి శాఖల్లో అక్రమాలు పేరుకుపోయినట్టు గతంలో మంత్రు ల వద్ద ప్రస్తావించినా... పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా? లేదా అనే విషయమై ఆయా మంత్రులు ఏనాడైనా ఆరా తీశారని ప్రశ్నించారు. అప్‌గ్రేడ్ చేసిన ఆశ్రమ పాఠశాలలకు సిబ్బందిని నియమించాలని, గిరిజన గురుకుల కళాశాలల్లో సీఈసీ గ్రూపులు ఏర్పాటు చేసి సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. -
మీ ఎమ్మెల్యే సూపర్
- మీ అభ్యున్నతి కోసమే ఆమె తపన - ఎమ్మెల్యే కళావతి పనితీరుపై ప్రశంసలు - దోనుబాయి గిరిజనులతో కలెక్టర్ సీతంపేట: ‘మీ ఎమ్మెల్యే నిత్యం మీ కష్టాల గురించే ఆలోచిస్తుంటారు. వాటి పరిష్కారం గురించే ఎప్పుడూ నాతో మాట్లాడుతుంటారు’.. అని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ దోనుబాయిలో గిరిజనుల వద్ద వ్యాఖానించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినుద్దేశించిన ఆయన ఈ వ్యాఖలు చేశారు. ఆమె కోరిక మేరకే ఇక్కడికి వచ్చానని కూడా చెప్పారు. శుక్రవారం సీతంపేట మండలం దోనుబాయిలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కళావతి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘ఆమె మీ పట్ల ఎంతో పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. ఎప్పటికపుడు ఇక్కడి సమస్యలపై నాతో ఫోన్లో మాట్లాడుతుంటారని చెప్పారు. ‘మా ఏజెన్సీకి ఒకసారి రావాలండి.. మా గిరిజనుల సమస్యలు చూడాలి, వారి కష్టాలు వినాలంటూ పదేపదే నాతో అంటుంటారని, అందుకే దోనుబాయి వచ్చానని’ వివరించారు. మీ సమస్యలు ఏవైనా ఉంటే చెప్పాలని కోరారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి ఇంకా పరిహారం అందకపోతే అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జన్‌ధన్ బ్యాంకు ఖాతాప్రారంభించాలన్నారు. అందరికీ ఆధార్ నంబర్లు ఉండాలన్నారు. చాలా మందికి పింఛన్లు రేషన్‌కార్డులు అందడం లేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ వయస్సు తప్పుగా నమోదవడం, ఇతరత్రా కారణాలతో కొందరికి ఆగాయని త్వరలో వారందరికి మంజూరు చేస్తామన్నారు. పీటీజీలతో పాటు నాన్పీటీజీలకు కూడా 50 ఏళ్ల వయస్సు దాటితే వృద్ధాప్య పింఛన్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. దోనుబాయి వంటి చోట్ల మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్పీటీసీ పాలక రాజబాబు, సర్పంచ్‌లు కోటేశ్వరరావు, సాయికుమార్, కోఆప్టెడ్ సభ్యుడు ఎం. మోహనరావు, ఎంపీటీసీ బి.జయలక్ష్మి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు ఎన్.సోమయ్య, ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో గార రవణమ్మ, పీఏవో జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే సత్తా ఉంది
పాలకొండ రూరల్, న్యూస్‌లైన్: ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పోరాడే సత్తా తనకుందని, తాను ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు వస్తున్న వదంతులు అసత్యమని, తాను వైఎస్సార్సీపీలోనే కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నాని పాలకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విస్వాసరాయి కళావతి అన్నారు. శనివారం ఆ పార్టీ సీజేసీ సభ్యుడి నివాసగృహంలో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పాలకొండలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను ప్రజలెవ్వరూ నమ్మెద్దని ఆమె సూచించారు. పాలకొండలో ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంతో పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు మేరకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి ఇక్కడి సమస్యలను విన్నవించామని, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా మాట ఇవ్వడంతో రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రుణమాఫీ అమలు జరిగితే తొలుత ఆనందించేది తామేనన్నారు. పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాలవలస విక్రాంత్, మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశరావు, పాలవలస ధవళేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.