mla r.krishnaiah
-
‘బీసీలకు 400 హాస్టళ్లను మంజూరు చేయాలి’
హైదరాబాద్: మైనార్టీలు, క్రైస్తవులు, బుద్ధులు, జైన మతస్తులకు మంజూరు చేస్తున్న మాదిరిగానే హిందువులకూ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అదనంగా 400 కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 వేల కాలేజీల్లో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు చదువుతుంటే.. వారిలో 250 కాలేజీ హాస్టళ్లలో 26 వేల మందే హాస్టల్ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ అధ్యక్షుడు ఎర్ర సత్యం, యూత్ రాష్ట్ర నాయకుడు నీల వెంకటేశ్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీపీకి కృష్ణయ్య రాంరాం!
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా తన విషయంలో, ఏపీలోని బీసీల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్న కృష్ణయ్య ఇక టీడీపీకి రాంరాం చెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకే ఆ పార్టీని వదిలిపెట్టాలని తాను భావిస్తున్నానని సన్నిహితులకు చెబుతున్నారు. ముఖ్యంగా తాను గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి ఏపీలో అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతోపాటు.. తనను ఆ పదవి నుంచి తొలగిస్తేనే గుర్తింపు ఇస్తామని మెలిక పెట్టడంపై కృష్ణయ్య తీవ్రంగా మండిపడుతున్నారు. నాలుగేళ్లుగా నిశ్శబ్ద యుద్ధం తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తర్వాత ఆయనకు కనీసం పార్టీ శాసనసభాపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. ఏ ముఖ్య పదవుల్లో కూడా ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో బాబు వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎల్బీనగర్లో కానీ, ఇతరత్రా సమావేశాల్లో పాల్గొన్నా టీడీపీ కండువా ధరించకుండా, కేవలం బీసీల కండువా కప్పుకుంటూనే వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన పలు సమస్యలపై మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం ప్రస్తావన తీసుకురాకుండా స్వతంత్రంగానే ఉండేందుకు ప్రయత్నించారు. ఇలా టీడీపీ, కృష్ణయ్యల మధ్య నిశ్శబ్ద యుద్ధం నాలుగేళ్లుగా నడుస్తోంది. బాబు వ్యాఖ్యలతో ముదిరిన వివాదం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బీసీలపై అనుసరిస్తున్న వైఖరి కూడా కృష్ణయ్యకు నచ్చడం లేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, నాలుగేళ్లలో బీసీలకు ఉపయోగకరమైన ఒక్క పథకం చేపట్టకపోవడంపై అక్కడి బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగినా ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏపీలోని బీసీలకు ఏమీ చేయకపోగా.. న్యాయమూర్తులుగా ఎంపికైన బీసీ న్యాయవాదులు పనికిరారని ఆయన ఓ నివేదిక ఇవ్వడం కృష్ణయ్యను ఆత్మరక్షణలో పడేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. ‘గుర్తింపు’విషయంలోనూ అంతే మరోవైపు ఏపీలోని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు తీరు కృష్ణయ్య ఆగ్రహానికి కారణమైంది. కృష్ణయ్య గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంఘానికి గుర్తింపు ఇవ్వకుండా వేరే సంఘానికి ఇవ్వడం.. కృష్ణయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తే గుర్తింపు ఇస్తామంటూ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించడం వివాదం ముదిరిపాకాన పడేలా చేసింది. ‘మన సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు. మన ప్రజల కోసం మేనిఫెస్టోలో పెట్టిన 18 అంశాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. పైగా బీసీలను అణచివేయ్.. తొక్కేయ్, చీల్చేయ్ అనే సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా నాకూ గౌరవం లేదు. కోట్లాది మంది బీసీల పక్షాన నిలబడాల్సిన నేను టీడీపీలో ఉండాలనుకోవడం లేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటా’అని కృష్ణయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. -
నోట్ల రద్దుకు మద్దతుగా బీసీ సంఘం ప్రదర్శన
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నల్లధనం, దొంగ నోట్లు, అవినీతిని అరికట్టాలని, దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని యువత నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న చర్య విప్లవాత్మకమన్నారు. దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనాన్ని అరికట్టే చర్యకు మద్దతు ఇవ్వకుండా రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం తగదని హితవు పలికారు. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. కొత్త నోట్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని, వ్యవస్థను ప్రక్షాళన చేసే సమయంలో తాత్కాలిక ఇబ్బందులు తప్పవని చెప్పారు. నోట్ల మార్పిడి వల్ల ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంగా వచ్చే మొత్తాన్ని ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాసు, నర్సింహగౌడ్, రాజేందర్, కృష్ణయాదవ్, అనంతయ్య, జైపాల్, వినయ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ శ్రద్ధ అభివృద్ధిపై లేదు'
హస్తినాపురం : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు ఇచ్చిన ప్రాధాన్యం కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు ఇవ్వడం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. నందనవనం కాలనీలోని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. శుక్రవారం ఆయన కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలోని నందనవనం, దేవీనగర్‌కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యుద్ధం: ఆర్.కృష్ణయ్య
వినాయక్‌నగర్ (నిజామాబాద్): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణం విడుదల చేయకపోతే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా గత ఏడాదితోపాటు, ఈ విద్యాసంవత్సరం ఫీజులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో 'బీసీ విద్యార్థి శంఖరావం' పేరుతో సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ.850 కోట్ల ఫీజు రీయిం బర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే రకరకాల అంక్షలు పెట్టి విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి బీసీ విద్యార్థికి మొత్తం ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా జారీ చేసిన జీఓ నం.18, 50కి తూట్లు పొడుస్తున్నారన్నారు. గతంలో తాను చేసిన నిరాహార దీక్షల ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో దొరల రాజ్యాన్ని తలపిస్తూ, పేద పిల్లలు చదువుకోకుండా చేస్తోందని విమర్శించారు. అవసరం లేని వాటికి కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు.