
హైదరాబాద్: మైనార్టీలు, క్రైస్తవులు, బుద్ధులు, జైన మతస్తులకు మంజూరు చేస్తున్న మాదిరిగానే హిందువులకూ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అదనంగా 400 కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 వేల కాలేజీల్లో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు చదువుతుంటే.. వారిలో 250 కాలేజీ హాస్టళ్లలో 26 వేల మందే హాస్టల్ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు.
కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ అధ్యక్షుడు ఎర్ర సత్యం, యూత్ రాష్ట్ర నాయకుడు నీల వెంకటేశ్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment