మారువేషంలో బయటపడ్డా
ఎమ్మెల్యే శరవణన్
తమిళసినిమా: శశికళ ఎంత పకడ్బందీగా నిర్బంధించినా ఓ ఎమ్మెల్యే తప్పించుకుని వచ్చారు. పన్నీరుకు మద్దతు ప్రకటించారు. పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ఏడుగురు శాసనసభ్యులు ఉండగా ఆదివారం ఆ సంఖ్య 11కు చేరింది. సోమవారం మరో ఎంపీ రావడంతో సంఖ్య 12కు చేరింది. అదే సమయంలో కూవత్తురు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరైన శరవణన్ మారువేషంలో తప్పించుకుని పన్నీరు గూటికి చేరారు. మధురై ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలిసి ఎమ్మెల్యే శరవణన్ పన్నీర్ గూటికి చేరారు.
ఈ సందర్భంగా శాసన సభ్యుడు శరవణన్ మాట్లాడుతూ తాను కూవత్తూర్ నుంచి మారువేషంలో తప్పించుకుని వచ్చినట్టు తెలిపారు. అక్కడ మరెందరో పన్నీరుకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. నిర్బంధంలో ఉన్నవాళ్లు బయటకు వస్తే, పన్నీరు సంపూర్ణ మెజారిటీతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అని తెలిపారు. అందరూ పన్నీరుసెల్వం సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారన్నారు. అందరూ వచ్చేశాక, చివరకు శశికళ పన్నీరు గొడుగు నీడన చేరాల్సిందేనని ఎద్దేవా చేశారు.
మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..
శశికళ జాతకంపై నేడే తీర్పు
నేనెవరికి మద్దతివ్వాలి?
శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు
సరైన సమయంలో కీలక నిర్ణయం
శశికళకు కారాగారమా? అధికారమా?
వారంలోగా బలపరీక్ష!
ప్రజాక్షేత్రంలోకి శశికళ
మారువేషంలో బయటపడ్డా
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ