రిసార్టులో ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పోలీసులు
శశికళ - పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న కుర్చీలాటలో భాగంగా రిసార్టులో దాచిపెట్టిన ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు ఎట్టకేలకు చేరుకున్నారు. మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్లో గల రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. సుమారు 120 మంది వరకు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు సమాచారం రావడంతో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఉదయం అక్కడకు భారీ పోలీసు బలగాలతో వెళ్లిన విషయం తెలిసిందే. అదనపు డీఎస్పీ తమిళ్ సెల్వన్, డీఆర్వో రామచంద్రన్ల నేతృత్వంలోని అధికారుల బృందం ఉదయం 6.30 గంటలకే అక్కడకు చేరుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడటం మొదలుపెట్టింది.
రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా లేక ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి అక్కడ ఉంచారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా చెప్పాలని కూడా పోలీసులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను నిజంగానే నిర్బంధిస్తే అది చాలా పెద్ద నేరం అవుతుందని మద్రాస్ హైకోర్టు మండిపడింది. సోమవారానికల్లా ఎమ్మెల్యేల విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని చెప్పింది. దాంతో పోలీసులు చురుగ్గా కదిలారు. అక్కడకు వెళ్లిన పోలీసులు, మీడియా ప్రతినిధులపై స్థానికులు, రిసార్టుల వద్ద ఉన్న ప్రైవేటు గార్డులు రాళ్లతో దాడులు చేశారు. కొంతమంది బౌన్సర్లను కూడా అక్కడ పెట్టి మరీ ఎమ్మెల్యేలను బయటకు కదలకుండా ఆపుతున్నట్లు కథనాలు వచ్చాయి.
సంబంధిత వార్తలు చదవండి
అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే..
సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన
గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
పోయెస్ గార్డెన్ వెలవెల
పన్నీర్కే 95 శాతం మద్దతు!
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఎత్తుకు పైఎత్తు
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం