మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : కానిస్టేబుల్, జైల్ వార్డెన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ ఎంఎ.షరీఫ్, టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇగ్బాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఉద్యోగాల్లో 4 శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఉందని వారికి వయోపరిమితి కూడా 5 సంవత్సరాల సడలింపు ఇచ్చినట్టు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్ అధికారి కార్యాలయంలో మైనార్టీ అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుని ఉచిత శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు .