MLRIT College
-
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
-
'సాక్షి ప్రీమియర్ లీగ్' విజేతలకు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’(ఎస్పీఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎస్పీఎల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫైనల్లో విజేతలుగా నిలిచిన ఎంఎల్ఆర్ఐటి(సీనియర్స్ విభాగం) , గౌతమ్ జూనియర్ కాళాశాల(జూనియర్స్ విభాగం) జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌గా నిలిచిన వాగ్దేవి, కెఎల్ఎన్ జట్లకు రూ. 15 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అదే విధంగా జూనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రిషబ్ బిమల్, సీనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ దక్షిత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సూర్యతేజలను మెమెంటోలతో సత్కరించారు.కాగా సాక్షి మీడియా గ్రూఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్పీఎల్ నిర్వహణపై పలువురు ప్రశంసల జల్లు కుపించారు. 'విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చాలని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమంగా రాణిస్తారు. ఎస్పీఎల్ లీగ్ నిర్వహించడం అభినందనీయం' -ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 'ఎస్పీఎల్ అభినందనీయం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 649 జట్లతో రాష్ట్ర స్థాయిలో ఎస్పీఎల్ నిర్వహించడం గొప్ప విషయం. అందుకు మా కాలేజీ ఆతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియా గ్రూఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్థతలు' - మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి కళాశాలల సెక్రటరీ -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎంఎల్ఆర్ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఆర్ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. -
SPL: ఎస్పీఎల్ విజేతలు వీరే!
Sakshi Premier League 2022- ఇబ్రహీంపట్నం: సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు సోమవారం సందడిగా ముగిశాయి. గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ విజేతలుగా సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాల, జూనియర్స్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాల జట్లు నిలిచాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రొత్సహించేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 3వ సీజన్ క్రికెట్ టోర్నీ శేరిగూడలోని శ్రీఇందు విద్యాసంస్థల మైదానంలో గత నెల 19న ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లాస్థాయి విజేతలతో సోమవారం గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించారు. విజయం సాధించిన జట్లకు శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావు, సుధాకర్ పీవీసీ పైప్స్ రీజినల్ మేనేజర్ రంగారావు, సంస్థ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. సాక్షి మీడియా గ్రూపు క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్ముందు ఇలాంటి టోర్నీలు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. టోర్నీకి స్పానర్స్గా వ్యవహరించిన సుధాకర్ పీవీసీ పైప్స్ సంస్థతోపాటు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుధాకర్ పీవీసీ సంస్థ రీజినల్ మేనేజర్ రంగారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు ఈవిషయంలో ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో సుధాకర్ పైప్స్ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్కుమార్ మాట్లాడుతూ.. టీర్నీని విజయవంతం చేసిన సాక్షి మీడియాకు అయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌పీఎల్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజినల్ స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. ఫైనల్స్‌లో ఇలా.. రీజినల్ జూనియర్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాలతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు తలపడింది. మొదట గౌతమ్ కళాశాల 105 పరుగులు సాధించింది. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 81 పరుగులు సాధించి ఓటమిపాలైంది. గౌతమ్ కాలేజీ ఆడగాడు అశ్లేష్ 30 బాల్స్‌లో 44 పరుగులు సాధించి ఉత్తమ ప్రతిభ చాటాడు. రీజినల్ సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్టు, మహబూబ్‌నగర్ వాసవీ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు పోటీపడింది. ఎంఎల్ఆర్ఐటీ జట్టు 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్‌నగర్ వాసవీ కాలేజీ టీం 69 పరుగులు సాధించి ఓటమిపాలైంది. ఎంఎల్ఆర్ఐటీ జట్టు విజయ్ 17 బాల్స్‌లో 34 పరుగులను సాధించి ప్రతిభచాటాడు. ఉత్సాహంగా బహుమతుల ప్రదానం బహుమతుల ప్రదానోత్సవం ఉత్సాహంగా సా గింది. జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.జూనియర్ విభాగంలో ఈసీఐఎ ల్ గౌతమ్ కాలేజీ, సీనియర్ విభాగంలో దుండిగ ల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచాయి. రన్నర్స్‌గా సైనిక్‌పురి భవన్స్ కళాశాల జ ట్లు నిలిచాయి. జూనియర్ విభాగంలో గౌతమ్ కాలేజీ జట్టు, దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్లు విజయం సాధించారు. విన్నర్స్, రన్నర్స్‌కు షీల్డ్‌లను, సర్టిఫికెట్లను ముఖ్యఅతిథులు అందజేశారు. ఇందు కాలేజీ తరఫున పాల్గొన్న రెండు జట్లను చెర్మన్ వెంకట్రావ్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. రీజినల్ స్థాయిలో విజేతలైన జట్లు 10 తర్వాత జరిగే రాష్ట్ర స్థాయి ఎస్పీఎల్ పోటీల్లో తలపడుతాయి. కార్యక్రమంలో సాక్షి ఈ వెంట్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరిరావు, ఇందు కాలేజీ ఏఓ బాలకృష్ణారెడ్డి,సత్యనారాయణ, పీడీ నరసింహ పాల్గొన్నారు. -
హైటెక్... ట్రెడిషనల్ లుక్