Mobile Manufacturing Hub
-
వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు‘పీఎల్ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు. -
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..
♦ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయనున్న మోదీ ♦ అనంతరం తిరుపతిలో విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభం ♦ సాయంత్రం శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధానమంత్రి సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9.25 గంటలకు భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి, 11.50 గంటలకు విజయవాడకు సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన అనంతరం తిరుపతికి వెళతారు. కొత్తగా నిర్మించిన తిరుపతి విమానాశ్రయం గరుడ టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. తిరుపతిలో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రం)కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇదీ ప్రధాని పర్యటన షెడ్యూల్.. ► ఉదయం 9.25 గంటలు: ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. ► 11.50 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 11.55 గంటలు: గన్నవరం విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో అమరావతికి పయనం ► మధ్యాహ్నం 12.20 గంటలు: అమరావతి హెలీప్యాడ్‌ను చేరుకుంటారు. ► 12.25 గంటలు: హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో రాజధాని శంకుస్థాపన వేదిక వద్దకు బయలుదేరుతారు ► 12.30 గంటలు: శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు. ► 12.30 నుంచి 1.45 గంటలు: నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. ► 2.00 గంటలు: అమరావతి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరతారు. ► 2.25 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 2.30 గంటలు: గన్నవరం విమానాశ్రయం విమానంలో తిరుపతి పయనం (విమానంలోనే భోజనం చేస్తారు) ► సాయంత్రం 3.25 గంటలు: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 3.30 నుంచి 3.45 గంటలు: తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన గరుడ టర్మినల్‌ను ప్రారంభిస్తారు. ► 3.50 గంటలు: తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. ► 3.55 గంటలు: మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు. ► 3.55 నుంచి 4.15 గంటలు: మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. ► 4.20 గంటలు: రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరతారు. ► 5.00 గంటలు: తిరుమలలో పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ► 5.00 నుంచి 5.10 గంటలు: విశ్రాంతి తీసుకుంటారు. ► 5.15 నుంచి 6.15 గంటలు: శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ► 6.15 గంటలు: పద్మావతి అతిథి గృహం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ► 6.55 గంటలు: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ► రాత్రి 7.00 గంటలు: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. ► 9.35 గంటలు: ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. -
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..