Model school teachers
-
ఆంధ్రప్రదేశ్: ‘మోడల్’ టీచర్లకు శుభవార్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 165 ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, టి.కల్పలతారెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ వర్తింపు
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఫైలుపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సంతకం చేశారని, ఫైలును బుధవారం విద్యాశాఖకు పంపుతారని తర్వాత విద్యాశాఖ కార్యదర్శి మోడల్ స్కూల్‌కు సంబంధించిన పీఆర్సీ జీవో ఇస్తారని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్లకు మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా నూతన వేతన సవరణను వర్తింప చేస్తూ మంగళవారం ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. -
50 శాతం పోస్టుల్లోనే పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూల్ టీచర్ల నియామకాల్లో రెండేళ్ల ప్రొబేషన్ విధానం అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపాల్ పోస్టుల్లో 30 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేలా, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల్లో 50 శాతం పోస్టులను ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (టీజీటీ) పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ టీచర్ల సర్వీసు రూల్స్‌లో పేర్కొంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి శుక్రవారం సర్వీసు రూల్స్ ఉత్తర్వులు (జీవో 25) జారీ చేశారు. 2013లో మోడల్ స్కూల్స్ ప్రారంభమైనప్పటి నుంచి సర్వీసు రూల్స్ రూపొందించి అమల్లోకి తేవాలని టీచర్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం రూల్స్ జారీ అయ్యాయి. దీంతో మోడల్ స్కూళ్లలో బదిలీలకు, పదోన్నతులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న 104 మంది ప్రిన్సిపాళ్లు, 1,989 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 764 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లతోపాటు (టీజీటీ) భవిష్యత్తులో నియమితులయ్యే వారికి ఈ రూల్స్ వర్తిస్తాయి. తెలంగాణ మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ సర్వీసు రూల్స్ 2019గా పిలుస్తారు. ఇవీ ప్రధాన నిబంధనలు.. ► పాఠశాలలో పని భారాన్ని బట్టి ప్రిన్సిపాల్, ఇతర టీచర్ పోస్టులను సృష్టించడం, మార్పు చేయడం, రద్దు చేయడం వంటి అధికారాలు మోడల్ స్కూల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది. ► ఉపాధ్యాయుల జీత భత్యాలను నిర్ణయించే, సవరించే అధికారం కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే చేయాలి. ► ప్రిన్సిపాల్ పోస్టుల్లో 30 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా, 70 శాతం పీజీటీలకు పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. ► పాఠశాల విద్యా కమిషనర్ నియామకపు అధికారిగా ఉంటారు. ► పీజీటీ పోస్టుల్లో 50% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, మరో 50% పోస్టులను సంబంధిత సబ్జెక్టుతో అర్హత కలిగిన టీజీటీలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ► ఇంగ్లిష్, తెలుగు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, అర్థశాస్త్రం, పౌర శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులు పీజీటీలో ఉంటా యి. వీటికి మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ నియామకపు అధికారిగా ఉంటారు. ► టీజీటీ పోస్టులు 100% డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు ఉంటాయి. మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ నియామకపు అధికారిగా ఉంటారు. ► ప్రిన్సిపాల్ పోస్టు కోసం పీజీటీలకు పదోన్నతి కల్పించేందుకు కేడర్ స్ట్రెంత్‌ను బట్టి 10 సబ్జెక్టుల పీజీటీలకు 13 పాయింట్ల రోస్టర్‌ను నిర్ణయించారు. ఇంగ్లిష్, తెలుగు, గణితం పోస్టులు 388 మిగతా సబ్జెక్టుల కంటే రెట్టింపు ఉండగా, మిగతా పోస్టులు 194 చొప్పున ఉన్నాయి. దీంతో 13 పాయింట్ల రోస్టర్‌ను నిర్ణయించారు. దీని ప్రకారం పదోన్నతులు కల్పించేటప్పుడు 1, 9వ పాయింట్లో ఇంగ్లిష్ వారికి, 2, 10వ పాయింట్లో గణితం వారికి, 3, 12వ పాయింట్లో తెలుగు సబ్జెక్టు వారికి పదోన్నతి కల్పిస్తారు. అలాగే 4వ పాయింట్లో బోటనీ వారికి, 5వ పాయింట్లో కెమిస్ట్రీ వారికి, 6వ పాయింట్లో సివిక్స్ వారికి, 7వ పాయింట్లో కామర్స్ వారికి, 8వ పాయింట్లో ఎకనామిక్స్ వారికి, 11వ పాయింట్లో ఫిజిక్స్ వారికి, 13వ పాయింట్లో జువాలజీ వారికి అవకాశం కల్పిస్తారు. ► సామాజిక, మహిళల రిజర్వేషన్లలో సాధారణ నిబంధనలే వర్తిస్తాయి. ► బదిలీలు, నియామకాల్లో ప్రిన్సిపాల్ పోస్టును రాష్ట్ర కేడర్‌గా, పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. ► పీజీటీ, టీజీటీ డైరెక్టు రిక్రూట్మెంట్లో రెండేళ్ల ప్రొబేషన్ విధానం ఉంటుంది. ప్రిన్సిపాల్ పదోన్నతులకు డీపీసీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య కాలాన్ని ప్యానల్ సంవత్సరంగా పరిగణించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. ► యాన్యువల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌కు వేరుగా మార్గదర్శకాలు జారీ చేస్తారు. ► ఉద్యోగ విరమణ, రాజీనామా, సెలవులు, కండక్ట్ రూల్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉంటాయి. -
విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. సక్రమంగా మార్గంలో పిల్లలను నడిపించాల్సిన ఉపాధ్యాయుడు తానే వక్రమార్గం ఎంచుకున్నాడు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ మోడల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అదే స్కూల్‌కు చెందిన సైన్స్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సాగుతోంది. సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని ఏపీ మోడల్ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకొచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సామాన్య శాస్త్ర అధ్యాపకుడు గేరా క్రాంతికిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. యడ్లపాడు మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గదిలోకి రావాలంటూ ఉపాధ్యాయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. పోలీసులు విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. నాలుగేళ్లుగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న క్రాంతికిరణ్‌పై సాతులూరు, నాదెండ్ల, చిలకలూరిపేట తదితర గ్రామాలకు చెందిన విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ వద్ద వివరాలు తీసుకున్నారు. క్రాంతికిరణ్ వికృత చేష్టలపై ఏడాది క్రితమే ప్రిన్సిపాల్‌కు పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అతను తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదైంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన గెస్ట్ టీచర్లు
-
జగన్‌ను కలిసిన మోడల్ స్కూల్ టీచర్లు
-
ఆదర్శ పాఠశాలల టీచర్లకు సర్వీసు రూల్స్
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలను సిద్ధం చేశామని త్వరలోనే వాటిని అమల్లోకి తేనున్నామని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి వివరించారు.పదో ఆర్థిక సంఘం సిఫార్సులను మోడల్ స్కూల్ టీచర్లకు వర్తింపచేస్తామని, సీఎం ఆమోదముద్ర పడగానే దీన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దీనిపై సీఎం నిర్వహించిన సమావేశాల్లో చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర మోడల్ స్కూళ్ల టీచర్ల సంఘం అధ్యక్షుడు కర్నాటి రాజశేఖరరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌రావు, ప్రధానకార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు మంగళవారం కమిషనర్‌ను కలసి ఆదర్శ పాఠశాలల టీచర్ల సమస్యలపై విన్నవించారు. వీటిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఎంఎస్‌టీఏ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి వివరించారు. మోడల్ స్కూళ్ల టీచర్ల ఆర్జిత సెలవులపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామని కమిషనర్ చెప్పారన్నారు. టీఎన్‌యూఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, ఆర్జేయూపీ సలహాదారు వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ టీచర్లకు అండగా ఉంటా!
అనంతపురం ఎడ్యుకేషన్: మోడల్ స్కూల్ టీచర్లకు అండగా ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ (ఎంఎస్‌పీటీఏ) ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. సీపీఎస్ పథకం, పీఆర్సీ వర్తింపు, సర్వీస్ రూల్స్విడుదల, హెల్త్‌కార్డ్స్, బాలికల వసతి గృహాల వార్డన్ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.