
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఫైలుపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సంతకం చేశారని, ఫైలును బుధవారం విద్యాశాఖకు పంపుతారని తర్వాత విద్యాశాఖ కార్యదర్శి మోడల్ స్కూల్‌కు సంబంధించిన పీఆర్సీ జీవో ఇస్తారని తెలిపింది.
ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌లకు మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా నూతన వేతన సవరణను వర్తింప చేస్తూ మంగళవారం ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment