PRC Fitment
-
పీఆర్సీ ప్రకటనపై మహిళా ఉద్యోగుల రియాక్షన్
-
ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్ తుది నిర్ణయం..
-
ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్ తుది నిర్ణయం..
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం పీర్సీని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, అంతకు ముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, నిన్న(గురువారం) కూడా చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఈ రోజు సీఎం జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం పీఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్తితుల్లో సీఎం ది బెస్ట్ ఇస్తారని తెలిపారు. చదవండి: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మరోసారి భేటీ -
మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ వర్తింపు
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఫైలుపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సంతకం చేశారని, ఫైలును బుధవారం విద్యాశాఖకు పంపుతారని తర్వాత విద్యాశాఖ కార్యదర్శి మోడల్ స్కూల్‌కు సంబంధించిన పీఆర్సీ జీవో ఇస్తారని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్లకు మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా నూతన వేతన సవరణను వర్తింప చేస్తూ మంగళవారం ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. -
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 30 శాతం ఫిట్మెంట్తో పెరిగిన జీతాలు ఈ నెల నుంచే ఉద్యోగులు, పెన్షనర్ల చేతికి అందనున్నాయి. ప్రస్తుత జూన్‌కు సంబంధించిన పెరిగిన వేతనాలు, పెన్షన్లు జూలైలో జమకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు కలిపి మొత్తం 9,21,037 మందికి పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మూడు విధాలుగా.. పీఆర్సీ బకాయిలకు సంబంధించి నోషనల్ బెనిఫిట్‌ను 2018 జూలై 1 నుంచి.. 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్స్‌గా, 2021 ఏప్రిల్ 1 నుంచి నేరుగా నగదు రూపంలో అందజేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. పెన్షనర్లకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను (ఎరియర్స్).. 36 వాయిదాల్లో అందజేస్తామని ప్రకటించింది. ఇక కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని, హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.1,000 కోట్లు భారం పీఆర్సీని 30 శాతం ఫిట్మెంట్తో అమలుచేస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.1,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం గతంలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దీనిపై కసరత్తు చేసింది. పీఆర్సీలో ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి రూ.300 కోట్లు అదనంగా అవసరమని గుర్తించింది. అంటే 30 శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.9,000 కోట్లు కావాలని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు కలిపి.. మొత్తం 5.29 లక్షల మందికి పీఆర్సీ ప్రయోజనాలు అందనున్నాయి. వీరికి ప్రతినెలా రూ.750 కోట్లు అదనంగా చెల్లించాల్సి రానుంది. దీనికితోడు గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, సుమారు 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ప్రతి నెలా మరో రూ.250 కోట్ల వరకు భారం పడనుందని అంచనా. అంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అదనంగా రూ.1,000 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉండనుంది. బకాయిలు, నగదు చెల్లింపులు ఎలా? ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా పెంచిన వేతనాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అందనున్నాయి. అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు ఇవ్వాల్సిన వేతన పెంపు బకాయిలను వివిధ రూపాల్లో చెల్లించే అవకాశం ఉంది. ►పాత పెన్షన్ విధానంలోని ఉద్యోగులకు బకాయిల మొత్తంలో కొంత జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్)లో కలిపి, మరికొంత నగదుగా ఇస్తారు. ►సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం) ఉద్యోగులకు మొత్తం బకాయిలను నగదు రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనిని వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారన్నది జీవోలో వెల్లడిస్తారు. ►ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని నిర్ణయించడంతో.. జూన్‌లో పెంచిన జీతం, ఏప్రిల్, మే నెలల పెంపు బకాయిలు కలిపి జూలైలో ఉద్యోగుల చేతికి అందే అవకాశం ఉంది. ►పెన్షనర్లకు బాకీలను 36 వాయిదాల్లో అందజేయనున్నారు. ►పీఆర్సీకి సంబంధించిన జీవో, పూర్తి మార్గదర్శకాలు వెలువడితే.. జీతాలు, బకాయిల చెల్లింపులపై పూర్తి స్పష్టత రానుంది. -
Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ యథాతథం రాష్ట్ర సరిహద్దుల్లోని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుతమున్న తరహాలోనే.. మిగతా పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించిన వైద్యాధికారుల బృందం కరోనా ఇంకా అదుపులోకి రాలేదని నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నియోజకవర్గాల్లో రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. 15 రోజుల్లోగా 4.46 లక్షల రేషన్‌కార్డులు రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, నిరీక్షణలో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, పీడీఎస్లోని ఇబ్బందుల పరిష్కారం కోసం.. గంగుల కమలాకర్ అధ్యక్షతన హరీశ్, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశానికి హాజరవుతున్న మంత్రులు తలసాని, కేటీఆర్, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ 9 ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ఎఫ్íపీజెడ్) ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతించింది. ఒక్కొక్కటీ 250 ఎకరాలకు తగ్గకుండా రైస్‌మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ సర్వే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములపై డిజిటల్ సర్వే చేపట్టి.. అక్షాంశ, రేఖాంశాల (కోఆర్డినేట్స్) ను నిర్ధారించాలని.. ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి యాసంగిలో ఇప్పటికే 84 లక్షల టన్నుల వరి ధా న్యం సేకరణ జరిగిందని.. మిగిలిన కొద్దిపాటి ధా న్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం ఆదేశించారు. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక భవనాలు రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించి వైద్యసేవలను మరింతగా పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీబిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించాలని.. ఈ మేరకు ప్రధాన ఆస్పత్రి భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని, తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఆ ప్రత్యేక భవనంలోనే హైరిస్క్ ప్రసవాలకు అవసరమైన వైద్యసేవల కోసం ప్రత్యేక ‘మెటర్నల్ ఐసీయూ’లను, నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక గర్భిణులకు మూడో నెల నుంచే సమతుల పౌష్టికాహార కిట్లను అందించాలని నిర్ణయించింది. కరోనా మూడోవేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, సిబ్బందిని, మందులను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించింది. రూ.10 వేల కోట్లతో ఆస్పత్రుల మెరుగు ఇరిగేషన్ రంగాన్ని పటిష్టం చేసి వ్యవసాయంలో గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే రాష్ట్రంలోని ప్రజారోగ్య రంగంపై పూర్తి దృష్టి సారించాలని కేబినెట్ తీర్మానించింది. రానున్న రెండేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రంలోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు శ్రీలంకకు వెళ్లి అధ్యయనం చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు రాష్ట్రంలో బుధవారం 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ త్వరలో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్–రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకోతోపాటుగా ‘మామ్మోగ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వైద్యారోగ్య శాఖకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ►సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆస్పత్రులను నిర్మించాలి. ప్రస్తుతమున్న ఆస్పత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలి. ►సూర్యాపేటలో ప్రస్తుతమున్న 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలి. ►రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయకులుగా వచ్చేవారికి వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసి ల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. ►ఎలర్జీ సమస్యల పరీక్షలు, చికిత్సకు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని యంత్రాలు, కొత్తగా మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. ►కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ, రేడియోథెరపీ అందించేలా.. అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి అవసరమైన మేరకు కొత్త బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి. ►వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరా లజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టాలని వైద్యశాఖకు ఆదేశం. ►వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో ఎయిమ్స్ తరహాలో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలి. ►రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులను నియమించుకుని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలి. ►నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులు, ల్యాబ్, రేడియాలజీ, డయాలసిస్ టెక్నీషియన్లు వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశం. -
మధ్యంతర భృతి వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై ఉద్యోగులకు నిరాశ మిగిలింది. మే 16న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అనంతరం దీన్ని వాయిదా వేసింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటించడం సరికాదనే దీనిపై ప్రకటన చేయలేదు. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో ఆగస్టు 15న ఐఆర్‌పై ప్రభుత్వ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఐఆర్‌పై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రి య ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ (2013) గడువు ఈ ఏడాది జూన్ ఆఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్సీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. పీఆర్సీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఎలాంటి మధ్యంతర నివేదికను సమర్పించలేదు. దీంతో ఐఆర్‌పై ప్రకటన ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచిన కారణంగా ఐఆర్ ఖర్చు అదేస్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఐఆర్ ఒక శాతం ఇస్తే ఏటా రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి వివరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పదో పీఆర్సీ సందర్భంగా 27% ఐఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పదో పీఆర్సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించారు. తెలంగాణలో తొలి పీఆర్సీ కావడంతో ప్రస్తుతం ఐఆర్ ఎంత ఉంటుందనేది ఉద్యోగులలో ఆసక్తికరంగా మారింది. -
60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 39 నుంచి 60% వరకు ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వేతన సవరణ సంప్రదింపుల సంఘం చైర్మన్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ బుధవారం విద్యుత్ సౌధలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ సంఘాలతో సమావే శమై సంప్రదింపులు జరిపింది. 19 విద్యుత్ ఉద్యోగుల సంఘాలతోపాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులతో ఈ కమిటీ వేర్వేరుగా సమావేశమై వారి వాదనలు విన్నది. అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఉద్యోగ సంఘం టీఆర్వీకేఎస్ 39% ఫిట్మెంట్తో పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేయగా, మిగిలిన సంఘాలన్నీ 50 శాతానికి పైనే ఫిట్మెంట్ కోరాయి. 1104, 327 యూనియన్లు 60% ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేయగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ 51% ఫిట్‌మెంట్‌ను అడిగింది. ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ సైతం సత్వరంగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా యూని యన్లు విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు జీత, భత్యాలు, సదుపాయాలు వర్తింపజేయాలని, అపరిమిత వైద్య చికిత్సల సదుపాయం కల్పించాలని కోరాయి. ఈ డిమాండ్లు ఎలా న్యాయబద్ధమో వివరించాలని యూనియన్లను పీఆర్సీ కమిటీ అడిగి తెలుసు కుంది. ఈ సమావేశంలో పీఆర్సీ కమిటీ ఎలాంటి అభిప్రాయాలుకానీ, హామీలుకానీ వ్యక్తం చేయ లేదని యూనియన్ల నేతలు తెలిపారు. యూనియన్లతో తదుపరి సంప్రదింపుల తేదీని త్వరలో తెలియజేస్తామని కమిటీ తెలిపింది. ఈ చర్చల్లో పీఆర్సీ కమిటీ సభ్యులు లీత్ కుమార్, అశోక్ కుమార్, టి.శ్రీనివాస్, బీవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐఆర్ ప్రకటన వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన వాయిదా పడింది. తొలుత భావించిన విధంగా రాష్ట్రావతరణ దినం రోజున దీనిపై ప్రకటన చేయడం లేదని.. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. వేతన సవరణ సంఘం నివేదిక రాకముందే ఐఆర్ ప్రకటిస్తే.. పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి ప్రకటన అంశంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమావేశం జరిగింది. ఇందులో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఐఆర్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘వేతన సవరణ కమిషన్ వేసి కొద్దిరోజులే అయింది. నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ నివేదిక రాకుండా ఐఆర్ ప్రకటిస్తే కమిషన్‌ను అగౌరవపర్చినట్టే అవుతుంది. పీఆర్సీ వేసిన తర్వాత నివేదిక రాకుండా ఐఆర్ ప్రకటిస్తే కాగ్ సైతం అభ్యంతర పెట్టవచ్చు. అందువల్ల నివేదిక వచ్చేదాకా ఆగితే మంచిది..’’అని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం పీఆర్సీ మధ్యంతర నివేదిక అందేవరకైనా వేచిచూడడం మంచిదని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఐఆర్ ప్రకటన వాయిదాకే మొగ్గుచూపారు. భారంపైనా సమీక్ష.. ఐఆర్ ప్రకటన, చెల్లింపు అంశాలు, పడే భారం తదిత ర అంశాలను అధికారులు సీఎంకి వివరించారు. గతంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచిన కారణంగా ఇప్పుడు ఐఆర్ భారం కూడా భారీగానే ఉంటుందని పేర్కొన్నారు. ఒక శాతం ఐఆర్ ప్రకటిస్తే.. ఏడాదికి రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ.3 వేల కోట్లు, 20 శాతం ఇస్తే రూ.6 వేల కోట్లు అదనపు భారం పడుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ప్రభుత్వం ఇప్పటిదాకా చక్కటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వస్తోంది. తద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇలాంటి సమయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయకుండా ఐఆర్ ప్రకటిస్తే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది..’’ అని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. అధికారుల సూచనతో ఏకీభవించిన సీఎం.. ఐఆర్ ప్రకటనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీ చైర్మన్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్లకు చెప్పారు. అయితే పీఆర్సీ మరో సభ్యుడు ఉమామహేశ్వరరావు ఇంకా బాధ్యతలు చేపట్టలేదని, ఆయన చేరాక ప్రక్రియ మొదలవుతుందని బిస్వాల్ వివరించారు. -
ఎక్కడి బస్సులక్కడే..
రాజమండ్రి :జిల్లాలో బుధవారం ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వోద్యోగులకు ఇచ్చినట్టు పీఆర్సీ ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పాలన్న యాజమాన్యం యత్నాలను కార్మికులు విజయవంతంగా అడ్డుకున్నారు. జిల్లాలో తొమ్మిది బస్సు డిపోల్లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి ప్రధాన డిపోలతోపాటు మిగిలిన చోట్ల కూడా ఒకటి రెండు సర్వీసులు మాత్రమే తిరిగాయి. ఒక్క గోకవరం డిపోలో మాత్రమే అత్యధికంగా 22 సర్వీసులు కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం తిరిగాయి. జిల్లాలో 841 బస్సులు రోజుకు వెయ్యికి పైగా సర్వీసులు నడవాల్సి ఉండగా కేవలం 80 బస్సులు మాత్రమే తిరిగాయి. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పేందుకు యత్నించినా కార్మికులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. ధర్నాలు చేయడంతోజిల్లాలో బస్సులు ఎక్కడికక్కడకు నిలిచిపోయాయి. పాటు టైర్లలో గాలి తీసి ఆందోళనకు దిగారు. వారి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో డిపోలు హోరెత్తాయి. రాజమండ్రి డిపో పరిధిలో మొత్తం 132 సర్వీసులకు 10, కాకినాడ డిపోలో 153 సర్వీసులకు కేవలం రెండు, అమలాపురం డిపోలో 136 సర్వీసులకు రెండు సర్వీసులు తిరిగాయి. ఆర్టీసీ రూ.70 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. తుని డిపోలో కార్మికులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంపూర్ణ మద్దతు తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు. కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. కిటకిటలాడిన లాంచీలు.. బస్సులు తిరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రైళ్లు, లారీలు, ఆటోలను ఆశ్రయించారు. తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రైళ్లు కిక్కిరిశాయి. రిజర్వేషన్ బోగీల్లోకి సైతం మామూలు ప్రయూణికులు చొరబడడంతో రిజర్వేషన్ చేరుుంచుకున్న వారు ఇబ్బంది పడ్డారు. కొవ్వూరు - రాజమండ్రి మధ్య నడుస్తున్న లాంచిలు సైతం కిటకిటలాడాయి. లారీలు, ఆటోలలో సైతం సామర్థ్యానికి మించి ప్రయాణించారు. హైవేలపై ప్రయాణికులు గంటల పాటు మండుటెండల్లో వాహనాల కోసం ఎదురు తెన్నులు చూడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ సమ్మెతో నిలిచిన బస్సు సర్వీసులను గురువారం నుంచి పునరుద్ధరించాలని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయయత్నాల్లో తలమునకలయ్యారు. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించాలని భావిస్తున్నారు. రోజుకు డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇస్తామన్న ఆర్టీసీ ప్రకటనకు స్పందన బాగానే ఉంది. రాజమండ్రి డిపోలో తాత్కాలిక పద్ధతిలో కండక్టర్ల నియూమకానికి సుమారు 100 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 500 మందిని తాత్కాలికంగా నియమించినట్టు తెలిసింది. వారితో రేపు పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతామని యాజమాన్యం ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకుంటే తొలగిస్తామనడంతో వారంతా వస్తారని యాజమాన్యం భావిస్తోంది. దీనికితోడు ‘ఏదో విధంగా బస్సులు తిప్పండి.. వచ్చినంత ఇవ్వండి’అని అధికారులే అనధికారికంగా చెబుతుండడంతో సర్వీసులు తిప్పేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అద్దె బస్సులు తిప్పకుంటే పర్మిట్ రద్దు అద్దె బస్సులు తిరగకుంటే పర్మిట్ రద్దు చేస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. బస్సు సర్వీసులు తిప్పాల్సిందిగా ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డిపో మేనేజర్లతో కలిసి అద్దె బస్సులను ఏ రూట్లో అయినా తిప్పుకునేలా నిబంధనలు సడలించారు. పర్మిట్‌తో సంబంధం లేకుండా సొంతంగా డ్రైవర్లను, కండక్టర్లును ఏర్పాటు చేసుకుని బస్సు యాజమాన్యం తిప్పుకునేందుకు సైతం సిద్ధమవుతోంది.