నిందితులను కఠినంగా శిక్షించాలి
మొగల్తూరు : గోవును చంపారనే నెపంతో దళితులపై దాడి చేసిన నింది తులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అమలాపురం మండలం సవరపుపాలెంలో దళితులపై దాడికి నిరసనగా మంగళవారం మొగల్తూరు గాంధీ బొమ్మల సెంటర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ సందర్బంగా కులవ్యతిరేక పోరాట సంఘం నాయకుడు యడ్ల చిట్టిబాబు మాట్లాడుతూ.. చనిపోయిన ఆవుల కళేబరాలను తొలగిస్తుండగా కొంత మంది అకారణంగా దాడి చే సి దళితులను తీవ్రంగా గాయపర్చారని, అటువంటి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో బాలం సుందరావు, మోటూరి ఫణి, సోల్మన్, వంగా కమలాకర్, సురేష్, అశోక్, కొత్తపల్లి నాగరాజు, పుచ్చకాయల ముత్తేశ్వరరావు, సయ్యద్ అబ్దుల్, చదలవాడ ఫ్రాన్సిష్, కొడెల్లి సంజీవరావు, బెండులంక నాగరాజు పాల్గొన్నారు.