Mohammad Aamir
-
ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్క రియల్ కింగ్.. కోహ్లి మాత్రమే: పాక్ మాజీ పేసర్
ఐపీఎల్-2023లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో సెంచరీ కోసం తన నాలుగేళ్ల నిరీక్షణకు కోహ్లి తెరదించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసాడు. కాగా కోహ్లికి ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమానర్హం. ఇక కీలక మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేరాడు. అమీర్ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. "వాట్ ఏ ఇన్నింగ్స్.. వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి. టేక్ ఎ బో" అంటూ అమీర్ ట్విటర్లో రాసుకొచ్చాడు. అదే విధంగా అమీర్ తన తన యూట్యూబ్ ఛానెల్, “ఇన్‌స్వింగ్ విత్ అమీర్”లో మాట్లాడుతూ.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి అంటే నాకు చాలా ఇష్టమైన ఆటగాడు. విరాట్ వంటి క్రికెటర్ ప్రస్తత తరంలో లేడు. కోహ్లి సాధించిన ఘనతల గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. ఈ రోజు మరో ఘనత సాధించాడు. ఈ సెంచరీ చాలా స్పెషల్. ఎందుకంటే ఆర్సీబీకి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాట్ నుంచి వచ్చిన ఇన్నింగ్స్ ఇది. ఈ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు అద్భుతం. విరాట్ నాలుగేళ్ల తర్వాత తొలి సెంచరీ సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో ఇది ఆరవది. అతడు ప్రపంచ క్రికెట్లో రియల్ కింగ్. విరాట్ ఇంకా ఐదేళ్లు పాటు ఆడితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో ఊహించలేను. ఆర్సీబీ కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ ఏడాది టైటిల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి:#Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్ what a inning by one and only the real king @imVkohli take a bow. pic.twitter.com/3wOA8hj0Ki — Mohammad Amir (@iamamirofficial) May 18, 2023 -
ఆమిర్‌కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు
కరాచీ : పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత షోయబ్ అక్తర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఆమిర్‌కు వస్తున్న మద్దతును తప్పుబడుతూ ట్విటర్లో కామెంట్ చేశాడు.(చదవండి : మెంటల్ టార్చర్.. అందుకే ఇలా) 'పీసీబీ మెంటల్ టార్చర్ భరించలేక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమిర్ ప్రకటించాడు. అది ఆమిర్ వ్యక్తిగత నిర్ణయం.. అతని నిర్ణయాన్ని నేను తప్పుబట్టను. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత దోషిగా తేలిన ఆమిర్ మళ్లీ పాక్‌కు క్రికెట్ ఆడాడు. అయితే పీసీబీ అదే ధోరణిలో అతను చూడడంతో ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఆమిర్ విషయంలో పీసీబీని తప్పుబడుతూ పలువురు మాజీ, స్టార్ క్రికెటర్లు మద్దతు పలికారు. గతంలో ఇదే పీసీబీ విషయంలో నాకు న్యాయం జరగాలని వారికి విజ్ఞప్తి చేశాను.. అప్పుడు నేను మతం కార్డును ఉపయోగించానన్న కారణంతో ఏ ఒక్క క్రికెటర్ మద్దతుగా నిలవలేదు. ఆమిర్‌కు ఇచ్చిన విలువలో కనీసం సగం ఇచ్చినా బాగుండు అనిపించిందంటూ' ట్వీట్ చేశాడు.(చదవండి : ఆ రికార్డుకు 51 ఏళ్లు పట్టింది) 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దానిష్ కనేరియా పాక్ తరపున అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. కనేరియా పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు.. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. దానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈసీబీ చర్యను సమర్థిస్తూ పీసీబీ కూడా కనేరియాపై నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారం రేపింది. కనేరియా వ్యాఖ్యలపై అప్పట్లో కొందరు పాక్ క్రికెటర్లు తప్పుబడుతూ విమర్శించారు. -
పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 29 ఏళ్ల బౌలర్ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పీసీబీ మేనేజ్మెంట్ వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేను. నేను తప్పు (స్పాట్ ఫిక్సింగ్) చేశాను. దానికి శిక్ష కూడా అనుభవించాను. అయినా సరే బోర్డు నన్ను గత అనుభవాలతోనే చిన్నచూపు చూస్తోంది. నిషేధం అనంతరం తిరిగి క్రికెట్ ఆడేందుకు మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మాజీ పీసీబీ చీఫ్ నజమ్ సేథీ నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ల అండదండలతోనే నేను మళ్లీ ఆడగలిగాను’ అని ఆ వీడియోలో వివరించాడు. అతని వీడియో సందేశం వైరల్ కావడంతో పీసీబీ స్పందించింది. ఆమిర్ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, అలాగే అతని ఆరోపణలపై తక్షణం స్పందించడం తగదని ఒక ప్రకటనలో తెలిపింది. ‘స్పాట్’ చిచ్చు నాణ్యమైన పేసర్‌గా కెరీర్ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్ ఫిక్సింగ్’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010–2015)కు గురయ్యాడు. అంతర్జాతీయ కెరీర్లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలిచింది. -
'అతన్ని తిట్టలేదు.. అడ్వైజ్ మాత్రమే ఇచ్చాను'
కొలంబొ : లంక ప్రీమియర్ లీగ్ 2020లో గాలే గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ హుల్ హక్‌ను బహిరంగంగా దూషించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆఫ్రిది మంగళవారం ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ' నేను నవీన్ హుల్ హక్‌ను తిట్టలేదు. షేక్ హ్యాండ్ సందర్భంగా నవీన్ దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్ అయిన మాట వాస్తవమే. మ్యాచ్‌లో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకోకూడదని సూచనలు మాత్రమే ఇచ్చాను. అంతేగాని అతనిపై ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు. నాకు ఆఫ్ఘన్ ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. మనం ఒక జట్టులో ఉన్నామంటే సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడమనేది ఆటలో కనీస ధర్మం. అంటూ వివరణ ఇచ్చాడు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం) కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కాండీ టస్కర్స్ బ్రెండన్ టేలర్, కుషాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆఫ్రిది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్పీఎల్లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. My advise to the young player was simple, play the game and don't indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ — Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020 -
షోయబ్ మాలిక్‌కు ఉద్వాసన
కరాచీ: న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌తోపాటు పేసర్ మొహమ్మద్ అమీర్‌కు చోటు దక్కలేదు. కేవలం టి20 క్రికెట్ మాత్రమే ఆడుతోన్న 38 ఏళ్ల మాలిక్‌ను తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. తాజా పరిణామంతో అతను వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్‌లు... మౌంట్ మాంగనీ (డిసెంబర్ 26–30), క్రైస్ట్‌చర్చ్ (జనవరి 3–7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి. -
అది మా అమ్మ కోరిక: పాక్ బౌలర్
మాంచెస్టర్ : భారత్‌పై ఐదు వికెట్లు పడగొట్టడం తన తల్లి కోరికని పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ తెలిపాడు. భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఈ పాక్ పేసర్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయగానే తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయన్నాడు. ‘నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి నా తల్లి తప్పకుండా ప్రార్థిస్తుంది. మ్యాచ్ జరిగేటప్పుడు ప్రతిసారీ ఆమె టీవీ ముందు కూర్చొని నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇక నేను ఐదు వికెట్లు తీయడమే మా అమ్మ కోరిక. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఎప్పుడూ ధీటుగా నిలబడాలని సూచించేంది. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన వెంటనే కన్నీళ్లొచ్చాయి. ఆ సమయంలో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి’ అని ఆమిర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమిర్ తల్లి నసీం అక్తర్ ఈ ఏడాది మార్చిలో చనిపోయారు. ఆమె చెప్పినట్లు భారత్‌పై ఆమిర్ చెలరేగడం అంత సులువేమి కాదు. ఇక ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమిర్ చెప్పుకొచ్చాడు. ‘సరైన సమయంలో 5 వికెట్లు పడగొట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన అనంతరం నేను ఉప్పొంగిపోయాను. అయితే నేను బౌలింగ్ బాగా చేసినా చేయకపోయినా మా జట్టు నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది’ అని తెలిపాడు. చివరి నిమిషంలో పాక్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆమిర్.. ఆస్ట్రేలియా మ్యాచ్ ద్వారా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైన్ల్లో ఆమిర్ భారత్ టాపర్డర్‌ను కూల్చి కోహ్లిసేన పతనాన్ని శాసించాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఒకే మ్యాచ్ గెలిచి 8వ స్థానంలో ఉన్న పాక్‌కు మరో మ్యాచ్ ఓటమి సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో భారత్‌పై గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో పాటు ఆత్మవిశ్వాసం లభిస్తోందని ఆ జట్టు భావిస్తోంది. -
ఏడాదికి రూ.70 లక్షల వేతనం
ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్ కొడుకు... అప్పటికే మూడు సార్లు అనుకున్న లక్ష్యం విఫలమైంది. అయినప్పటికీ ఎక్కడా కూడా పట్టు వదలలేదు. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిరంతరం శ్రమించాడు. ఎట్టకేలకు ఆ విద్యార్థి చెంతకే ఓ అమెరికన్ కంపెనీ వచ్చి వాలింది. ఆ విద్యార్థిని వదులుకోలేక భారీ ప్యాకేజీతో తన కంపెనీలోకి నియమించుకుంది. ఆ విద్యార్థే జామియా మిల్లియా ఇస్లామియా(జేఎంఐ)కు చెందిన మహమ్మద్ ఆమీర్ అలీ. అతడి స్టోరీ యువతరానికి స్ఫూర్తిదాయకం. జేఎంఐ స్కూల్ బోర్డు పరీక్షల్లో అలీ మంచి మార్కులు సంపాదించాడు. కానీ మూడేళ్ల పాటు బీటెక్ కోర్స్‌లో సీటే దొరకలేదు. తొలి ప్రయత్నంలో నిరాశ. ఆ తర్వాత రెండు సార్లు విఫలమే. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టువిడవలేదు. మూడు సార్లు విఫలమనంతరం అలీ ఆశలకు కాస్త ఊరటనిస్తూ.. జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత లభించింది. అప్పటికే పలుమార్లు విఫలమైన అనంతరం జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రాజెక్ట్ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సరియైన ఛార్జింగ్ సదుపాయాలు లేవు. వీటిపై ఎక్కువగా దృష్టిసారించాడు అలీ. ఒకవేళ అలీ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్ మోటార్ వ్రెక్స్ గుర్తించింది. జేఎంఐ వెబ్సైట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్‌ను చూసిన ఫ్రిసన్ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. స్కైప్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా నెల పాటు అలీతో నిరంతరం కమ్యూనికేషన్ జరిపిన ఫ్రిసన్.. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా తన కంపెనీలోకి నియమించుకుంది. వేతనం ఎంత అనుకుంటున్నారు? వింటే మీరే ఆశ్చర్యపోతారు. 1,00,008 డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలన్నమాట. ఒక జామియా విద్యార్థికి ఈ మేర వేతనంతో ఉద్యోగం దొరకడం ఇదే తొలిసారి. జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అలీ తండ్రి శంషాద్ అలీ జేఎంఐలోనే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయని తనను చాలాసార్లు అలీ అడుగుతుండే వాడని శంషాద్ చెప్పారు. -
కెరీర్ ‘స్వింగ్’ అయింది!
మళ్లీ దూసుకొచ్చిన ఆమిర్ చెలరేగుతున్న పాక్ పేసర్ భారత్‌పై సంచలన ప్రదర్శన భవిష్యత్‌పై భరోసా టీనేజ్ వయసులో పిల్లలు చేసే తప్పులను పెద్దలు క్షమించడం సహజం, ఇదీ అలాంటిదే. కాబట్టి అతనికి మరో అవకాశం ఇవ్వడం సరైనదే... ఆమిర్ పునరాగమనం చేసే అంశంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారి వ్యాఖ్య. క్రికెట్ పెద్దల ఆలోచన ఇలా ఉంది...అతను దేశాన్ని మోసం చేశాడు. అతడితో కలిసి ఆడటం మాకిష్టం లేదు. ఆమిర్ తప్పుకునే వరకు శిక్షణ శిబిరానికి మేం హాజరు కాలేం... సహచర ఆటగాళ్ల ఆగ్రహం. అతడు తమవాడు కాదని దూరంగా పెట్టే ప్రయత్నమిది... ఆమిర్ అద్భుతమైన బౌలర్. నిషేధం లేకపోతే ప్రపంచ టాప్-3 బౌలర్లలో ఒకడిగా ఉండేవాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడే అతడిని అభినందించేశాను... విరాట్ కోహ్లి స్వయంగా చేసిన ప్రశంస. ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ గుర్తించిన ప్రతిభ ఇది... మొహమ్మద్ ఆమిర్ గురించి ప్రపంచం దృష్టిలో అందరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్ చూస్తే మద్దతుదారులు, విమర్శకులు, ప్రత్యర్థులు ముక్తకంఠంతో ఆహా అన్నారు. సూపర్ స్పెల్‌తో ఆమిర్ అందరికీ తన గతం గురించి కాకుండా ఆట మాత్రమే గుర్తుకు వచ్చేలా చేయడంలో సఫలమయ్యాడు. నిషేధం ముగిసిన తర్వాత ఇలాంటి పునరాగమనం నిజంగా అపూర్వం. సాక్షి క్రీడా విభాగం మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లు ఆటకు దూరమయ్యారు. శిక్షకు గురైన వారిలో కొందరు మరో వేదిక మీద కనిపించకుండా మాయం కాగా... మరి కొందరు ఆ మచ్చను తొలగించుకోకుండానే పబ్లిక్ ఫిగర్లుగా బయటి ప్రపంచంలో చాలా మామూలుగా కలిసిపోయారు. ప్రపంచం మొత్తం దృష్టిలో దోషిగా కనిపిస్తున్నా... ఫిక్సింగ్ చేశానని ఒప్పుకోకుండా తాము అమాయకులమేనని చెబుతూ వచ్చారు. కానీ మొహమ్మద్ ఆమిర్ విషయం అందరికంటే భిన్నం. ఫిక్సింగ్‌కు పాల్పడటం, దానిని ఒప్పుకుంటూ తప్పయిందని క్షమించమనడం, నిషేధంతో పాటు జైలు శిక్షాకాలం కూడా పూర్తి చేసుకొని బయటికి రావడం... ఆ వెంటనే క్రికెట్ ఆడి జాతీయ జట్టులోకి ఎంపిక కావడం నిజంగా అనూహ్యం. అన్నింటికి మించి ఏదో ఉన్నానంటే ఉన్నాను అనిపించుకోకుండా తనదైన ముద్ర వేయడం మరో విశేషం. ఒక్కో బంతి బుల్లెట్లా... భారత్‌తో మ్యాచ్‌లో ఆమిర్ ఆట చూస్తే ఐదేళ్ల తర్వాత కూడా అతని బౌలింగ్‌లో పదును తగ్గలేదని అర్థమవుతుంది. నాలుగు ఓవర్లలో దాదాపు అన్ని బంతులు గంటకు 140 కిలో మీటర్ల వేగానికి తగ్గకుండా దూసుకుపోయాయి. తొలి బంతికి అదృష్టవశాత్తూ రోహిత్ శర్మ బతికిపోయినా ఆ యార్కర్ అతని బొటన వేలును చిదిమేసింది. అయితే లోపలికి దూసుకొచ్చిన రెండో బంతికి రోహిత్ వద్ద సమాధానం లేకపోయింది. తర్వాత ఇన్‌స్వింగర్‌కు అజింక్య రహానే బలి కాగా... ఆమిర్‌ను ఎదుర్కోవడం సురేశ్ రైనా వల్ల కాలేదు. మరికొద్ది సేపటికి అద్భుతమైన స్వింగ్‌కు కోహ్లి దాదాపుగా అవుటైనంత పనైంది. చివరి ఓవర్లో కోహ్లి రెండు ఫోర్లు కొట్టినా... ఆమిర్ నుంచి వచ్చిన మిగతా 13 బంతుల్లో 11 డాట్ బాల్స్ ఉండటం కోహ్లి ఎంత జాగ్రత్తగా ఆడాడో అర్థమవుతుంది. బహుశా ఈ కారణంగానే ఇలాంటి బౌలింగ్‌ను ఎదుర్కోవడం అద్భుతంగా ఉందంటూ కోహ్లి ప్రశంసించినట్లున్నాడు. భారత్‌తో తొలిసారి ఆడిన టి20 మ్యాచ్‌లోనే తన సత్తా చాటిన ఆమిర్‌లో ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ఆకాశం నుంచి పాతాళానికి... చాలా మంది పాకిస్తాన్ బౌలర్లలాగా ఆమిర్‌ది కూడా సాధారణ నేపథ్యమే. ఏడుగురు సంతానంలో ఒకడు. తండ్రి చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేస్తూ అన్నీ తానై తల్లే పెంచింది. క్రికెట్లో ఎలాంటి ప్రాథమిక శిక్షణ లేదు. వేరేవాళ్లని చూసి నేర్చుకున్న బౌలింగే. లాహోర్‌లో ఒక పేస్ క్యాంప్‌లో స్వయంగా వసీం అక్రం అతని ప్రతిభను గుర్తించడంతో ఆమిర్ దశ మారింది. అండర్-19లో ఆకట్టుకొని ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. 14 టెస్టుల్లోనే 50 వికెట్లతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. గంటకు 90 మైళ్ల వేగం, స్వింగ్, కచ్చితత్వంతో వన్డేలు, టి20ల్లోనూ పాక్ బౌలింగ్‌కు కొత్త ఆయుధంగా మారాడు. అయితే 2010 లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి దొరికిపోవడంతో అతని ప్రపంచం కుప్పకూలిపోయింది. విచారణ అనంతరం ఐసీసీ ఐదేళ్ల నిషేధం ప్రకటించగా, కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. క్షమించండి... ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించడమే ఆమిర్‌కు మేలు చేసింది. పేదరిక నేపథ్యం, నిరక్షరాస్యతతో పాటు చిన్న వయసులోనే ప్రలోభం కారణంగా తాను తప్పు చేశానని, క్షమించాలని తన దేశ ప్రజలకు, అభిమానులకు పదే పదే విజ్ఞప్తి చేశాడు. అతని విషయంలో జాలి, సానుభూతి ఒకింత గట్టిగానే పని చేశాయి. జైలు నుంచి మూడు నెలలకే విడుదలయ్యాడు. నిషేధం గత ఏడాది సెప్టెంబర్ 1తో ముగిసింది. అయితే అప్పటికే ఆమిర్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు పెరిగింది. రమీజ్ రాజాలాంటి మాజీలు కొందరు వ్యతిరేకించినా ఎక్కువ మంది టీనేజర్‌గా చేసిన తప్పుకు మరో అవకాశం ఇవ్వాలనే కోరారు. లాబీయింగ్ సామర్థ్యం లేకపోయినా... ఆమిర్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు గట్టిగానే అండగా నిలిచింది. దాంతో పాక్ దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను, ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు వన్డేలలో 5 వికెట్లు తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ సిరీస్‌కు ముందు తనతో కలిసి ఆడేందుకు మొహమ్మద్ హఫీజ్, అజహర్ అలీ నిరాకరించగా... వద్దంటే వెళ్లిపోతానని, అయితే సానుభూతితో క్షమించాలని వ్యక్తిగతంగా కలిసి వేడుకోవడంతో అతని గతానికి ఫుల్స్టాప్ పడింది. ఇక ముందు ఆమిర్ ‘ఫిక్సింగ్’ వ్యవహారం అంతా చరిత్ర. మున్ముందు అతని ఆట మాత్రమే అందరికీ కనిపిస్తుంది. ఇంకా 24 ఏళ్ల వయసే ఉన్న ఆమిర్ ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో మరో అగ్రశ్రేణి బౌలర్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం సృష్టించుకోగలడు. నా జీవితంలో రెండో అవకాశం దక్కడం నిజంగా చాలా అదృష్టం. ఇది నాకు పునర్జన్మలాంటిది. ఇక క్రికెట్లోకి తిరిగి రాలేనని భావించి ఆటను దాదాపుగా వదిలేశాను. అయితే సన్నిహితులు నాలో నమ్మకం పెంచారు. ఐదేళ్ల తర్వాత కూడా రాగలిగానంటే ఎంతో మంది సహకారం ఉంది. నా చర్యలతో ఎంతో మందిని మోసం చేశాను. అయితే అందరికీ క్షమాపణ చెప్పా. ఇక ముందు వారి నమ్మకాన్ని నిలబెడతా. జీవితంలో చాలా నేర్చుకున్నాను. నా దృక్పథం మారింది. డబ్బే ముఖ్యం కాదని తెలిసింది. ఒక మంచి బౌలర్‌గా మిగిలిపోవాలనేదే నా కోరిక. -మొహమ్మద్ ఆమిర్, పాక్ పేస్ బౌలర్ -
మరో అవకాశం ఇవ్వడం మంచిదే!
ఆమిర్‌కు ఆఫ్రిది మద్దతు కరాచీ: పాకిస్తాన్ జట్టులోకి మొహమ్మద్ ఆమిర్‌ను మళ్లీ ఎంపిక చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని ఆ జట్టు టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. ఆమిర్ నిజాయితీ వల్లే మరో అవకాశం దక్కిందని, దానికి అతను అర్హుడని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ‘గతాన్ని మనం మరచిపోతే మంచిది. ఆమిర్‌కు నేను పూర్తి మద్దతు పలుకుతున్నా. అతను తిరిగి రావడం పట్ల సంతోషంగా ఉన్నా. పట్టుదల, అంకితభావంతో ఆమిర్ ఈసారి పాక్ క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నా. ఇతర ఆటగాళ్లలాగా అబద్ధాలు చెప్పకుండా తన తప్పును అతను కోర్టు, ప్రజల ముందు ఒప్పుకున్నాడు కాబట్టే మరో అవకాశం లభించింది’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. పాక్ దేశవాళీలో పింక్ బాల్... పాకిస్తాన్ తమ ఫస్ట్‌క్లాస్ టోర్నీ ఖైద్-ఎ-ఆజమ్ ట్రోఫీ నాలుగు రోజుల ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా గులాబీ బంతిని ఉపయోగించాలని నిర్ణయించింది. ఎస్ఎన్ గ్యాస్ పైప్‌లైన్స్, యునెటైడ్ బ్యాంక్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టులో తలపడనున్న పాకిస్తాన్ అందుకు సన్నాహకంగా పింక్ బంతిని వాడుతోంది. -
పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ
లాహోర్: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతోంది. ఆమిర్‌ను జాతీయ శిక్షణ శిబిరంలో చేర్చడాన్ని నిరసిస్తూ తాజాగా వన్డే కెప్టెన్ అజహర్ అలీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బుజ్జగింపులతో అతను తన రాజీమానాను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ శిబిరంలో ఆమిర్ ఉంటే తాము హాజరుకామని గత గురువారం అజహర్, హఫీజ్‌లు నిరసన ప్రకటించారు. అయితే పాక్ బోర్డు జోక్యంతోనే ఇది సద్దుమణిగింది. న్యూజిలాండ్ పర్యటన కోసం సిద్ధమవుతున్న 26 మంది సభ్యుల పాక్ బృందంలో ఆమిర్‌ను ఎంపిక చేశారు. తన తప్పును క్షమించాలని, నిజంగా తన వల్ల సమస్య ఉంటే తానే వెళ్లిపోతానని కూడా ఆమిర్ నేరుగా అజహర్, హఫీజ్‌లకు క్షమాపణ కూడా చెప్పాడు.