
PC: IPL.com
ఐపీఎల్-2023లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సెంచరీ కోసం తన నాలుగేళ్ల నిరీక్షణకు కోహ్లి తెరదించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసాడు. కాగా కోహ్లికి ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమానర్హం.
ఇక కీలక మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేరాడు. అమీర్ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. "వాట్ ఏ ఇన్నింగ్స్.. వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి. టేక్ ఎ బో" అంటూ అమీర్ ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
అదే విధంగా అమీర్ తన తన యూట్యూబ్ ఛానెల్, “ఇన్‌స్వింగ్ విత్ అమీర్”లో మాట్లాడుతూ.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి అంటే నాకు చాలా ఇష్టమైన ఆటగాడు. విరాట్ వంటి క్రికెటర్ ప్రస్తత తరంలో లేడు. కోహ్లి సాధించిన ఘనతల గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. ఈ రోజు మరో ఘనత సాధించాడు. ఈ సెంచరీ చాలా స్పెషల్. ఎందుకంటే ఆర్సీబీకి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాట్ నుంచి వచ్చిన ఇన్నింగ్స్ ఇది.
ఈ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు అద్భుతం. విరాట్ నాలుగేళ్ల తర్వాత తొలి సెంచరీ సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో ఇది ఆరవది. అతడు ప్రపంచ క్రికెట్‌లో రియల్ కింగ్. విరాట్ ఇంకా ఐదేళ్లు పాటు ఆడితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో ఊహించలేను. ఆర్సీబీ కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ ఏడాది టైటిల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
చదవండి:#Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్
what a inning by one and only the real king @imVkohli take a bow. pic.twitter.com/3wOA8hj0Ki
— Mohammad Amir (@iamamirofficial) May 18, 2023