షూటింగ్లో భారత్‌కు మరో పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు పతకాలు సాధించారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకోగా, పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో మహమ్మద్ అసబ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు.
కాంస్య పతకం కోసం అసబ్తో మాల్టాకు చెందిన నాథన్ ఝూరెబ్ పోటీ పడ్డాడు. అసబ్ 26 పాయింట్లు నమోదు చేయగా, ఝూరెబ్ 24 పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ ఇప్పటి దాకా 9 పతకాలు సాధించడం విశేషం.