mohanarao
-
వర్మ.. వస్తున్నాం కాసుకో!
పిఠాపురం : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు మీరు సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ తరుఫున ప్రజల్లోకి వస్తున్నాం కాసుకో.. అంటు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నేత కొప్పన మోహనరావు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీలో చేరి తొలిసారిగా పిఠాపురం విచ్చేసిన సందర్భంగా ఆయన స్వగృహంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వర్మపై నిప్పులు చెరిగారు. వర్మ అరాచక పాలనపై ఒంటరి పోరాటం చేసిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబుకు కొండంత అండగా ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి నేటి నుంచి కంకణం కట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు. వితంతవుల పింఛన్లు సైతం కాజేయడానికి కార్యకర్తలను, నాయకులను బతికుండగానే చంపుకుంటూ నీచాతినీచంగా దిగజారిపోయిన వర్మకు పిఠాపురం నియోజకవర్గంలో పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరాచకపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, ఆయన చేయించుకున్న సర్వేలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజలనేత వైఎస్ జగన్ తండ్రి ఆశయ సాధనకు ప్రజల పక్షాన అవిరళ కృషి చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం తనను పార్టీ వైపు వచ్చేలా చేసిందని కొప్పన మోహనరావు తెలిపారు. జగన్ నేతృత్వంలో పెండెం దొరబాబుకు అండగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని తిరుగులేని పార్టీగా నిలబెట్టడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. కొప్పన రాకతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందని ఆయన సహకారంతో జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేసి పార్టీ తరుఫున ప్రజలకు అండగా ఉంటామని పెండెం దొరబాబు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు. కొప్పనకు ఘన స్వాగతం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చిన కొప్పనకు పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్పులతో భారీ ర్యాలీగా ఆయనను పిఠాపురం మండలం జల్లురు నుంచి తీసుకువచ్చారు. -
జనయోధుడికి ఘన నివాళి
జిల్లావ్యాప్తంగా జక్కంపూడి వర్ధంతి విస్తృతంగా సేవా కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఐదో వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి జక్కంపూడి నిరంతర పోరాటం చేశారని, తుది శ్వాస వరకూ పేదల కోసమే పని చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. జక్కంపూడి అనుచరుడు నరవ గోపాలకృష్ణ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను, సంస్థ వ్యా¯Œæను అంబటి ప్రారంభించారు. కంబాలచెరువు సెంటర్లో ఉన్న జక్కంపూడి విగ్రహానికి ఆయన, సినీ నటుడు సుమన్, పార్టీ సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి అంబటి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వెఎస్ రాజశేఖరరెడ్డికి అంత్యంత సన్నిహితుడుగా రామ్మోహనరావు నిలిచారని అన్నారు. వైఎస్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పడు అనారోగ్యానికి గురైతే వెన్నంటే ఉన్నారని గుర్తు చేశారు. జక్కంపూడి అనారోగ్యానికి గురైనా మంత్రివర్గంలో వైఎస్ కొనసాగించారని, ఇది వారి స్నేహాన్ని స్పష్టం చేస్తుం దన్నారు. వైఎస్ కుటుంబానికి జక్కంపూడి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తని అన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తనను నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండే గొప్ప వ్యక్తి జక్కంపూడి అని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి పోరాట పటిమే స్ఫూర్తిగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. నమ్మకానికి మారుపేరు జక్కంపూడని ఆకుల వీర్రాజు కొనియాడారు. పార్టీ నేతలు మిండగుదిటి మోహన్, రావూరి వెంకటేశ్వరరావు, మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, దంగేటి వీరబాబు, ఆర్వీవీ సత్యనారాయణ, జక్కంపూడి గణేష్, గుర్రం గౌతం పాల్గొన్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు వైఎస్సార్ సీపీ కడియం మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను అంబటి రాంబాబు, సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. రాజానగరంలో వృద్ధులకు అంబటి దుప్పట్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యాన జక్కంపూడి వర్ధంతి నిర్వహించారు. మలికిపురంలో జక్కంపూడి చిత్రపటానికి వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యాన అమలాపురం ఎన్టీఆర్ మార్‌్గలో జక్కంపూడి రామ్మోహనరావు వర్థంతి సభ నిర్వహించారు. -
బాలికపై అకృత్యం
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : కంచే చేను మేసింది. ఏలూరు నడిబొడ్డున మరో మృగాడి అకృత్యం వెలుగుచూసింది. ముందూవెనుకా ఎవరూ లేకపోవడంతో హాస్టల్లో తలదాచుకుంటున్న ఓ అనాథ బాలికపై గేట్మెన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి ఇలాంటి దురాగతానికి పాల్పడ్డాడని తెలిసి జనం నివ్వెరపోయూరు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థినులకూ భద్రత లేదనే విషయూన్ని ఈ వ్యవహారం మరోసారి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు సత్రంపాడుకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే వుృతిచెందారు. అనాథగా మారిన ఆ బాలికను స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. అనంతరం ఆమె గుండుగొలనులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివింది. చదువులో రాణిస్తుండడంతో సెరుుంట్ థెరిస్సా వుహిళా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలోని ‘ఆశాకిరణం’లో బాలికను చేర్చుకున్నారు. అనంతరం ఏలూరు అమీనాపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేరిన ఆమె స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్టోబర్‌లో దసరా సెలవులు ఇవ్వటంతో విద్యార్థినులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అనాథ కావటంతో ఆ విద్యార్థిని వూత్రం హాస్టల్లోనే ఉండిపోయింది. ఇదిలావుండగా, గణపవరానికి చెందిన వుందలంక మోహనరావు ఏడాది క్రితం ఔట్‌సోర్సింగ్‌లో అదే హాస్టల్లో గేట్మెన్గా చేరాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాస్టల్లో ఒంటరిగా ఉంటున్న విద్యార్థినిపై కన్నేసిన మోహనరావు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయుం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారం జరిపాడు. వారం రోజుల క్రితం ఆ విద్యార్థినికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ జయంతితో కలిసి బాధితురాలు సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ కె.విజయుపాల్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మోహనరావు అప్పటికే పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనధికారికంగా విధులు? మోహనరావు వివరాల కోసం ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా... అతడిని రెండు నెలల కిందటే విధుల నుంచి తొలగించామని హాస్టల్ అధికారులు చెబుతున్నారు. అతడు మాత్రం అనధికారికంగా హాస్టల్లోనే పనిచేస్తున్నట్టు సహచర సిబ్బంది తెలిపారు. విధుల నుంచి తొలగించిన గేట్‌మెన్‌ను హాస్టల్లోకి మళ్లీ ఎలా రానిస్తున్నారే ప్రశ్నకు సమాధానం కరువైంది. గేట్మెన్ ఎవరి ప్రమేయంతో హాస్టల్ వద్ద ఉంటున్నాడో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.