mohini avatar
-
మోహిని అవతారంలో ఊరేగిన శ్రీవారు
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ కోసం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్రగా బయలుదేరి వెంకన్నకు లక్ష్మీహారం సమర్పించనున్నారు. కాగా, భక్తుల గోవింద నామ స్మరణ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
-
శ్రీవారి గర్భాలయంలో రామచిలుక
తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు ఈ రోజు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బంగారువాకిలిలో నుంచి శ్రీవారి గర్భాలయంలోకి రామ చిలుక ప్రవేశించింది. మోహినీ అవతారంలో అలంకరించిన రామచిలుక వలే ఈ రామచిలుక ఉండటంతో టీటీడీ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది శ్రీవారి లీలలే అని టీటీడీ అధికారులు అంటున్నారు. తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది.18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయింది.సర్వదర్శనానికి 9 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది. సాయంత్రం 4.00 గంటలకు స్వామి వారికి ఊంజల్ సేవ.. రాత్రి 8 గంటలకు మలయ్యప్ప స్వామికి గరుడ సేవ నిర్వహించనున్నారు.