Monda market
-
అమ్మవారి విగ్రహం చోరీ.. కుమ్మరి గూడ లో ఉద్రిక్తత..
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
Live Updates.. ►తెలంగాణ శాసన సభ సమావేశాలు ముగిశాయి. సీఎం ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. ►ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సభ ఆమోదం తెలిపింది. ►మొత్తం 192 దేశాల్లో మన దేశం ర్యాంక్ 139 అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని.. మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని తెలిపారు. పార్లమెంట్లో ప్రధాని స్పీచ్ అధ్వానంగా ఉందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అదానీపై మోదీ ఒక్కమాట మాట్లాడలేదని, దీనిపై పార్లమెంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్లాడిందని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంటని ప్రశ్నించారు. ► అసెంబ్లీలో అక్బరుద్దీన్ కాగ్ నివేదికను ఎందుకు సభలో ప్రవేశపెట్టలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను అరికట్టడంలో నార్కోటిక్స్ విఫలమైందని అన్నారు. ► శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్‌కు బండా ప్రకాష్ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, బండా ప్రకాష్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ► ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బండా ప్రకాష్ డిప్యూటీ ఛైర్మన్ కావడం అందరికీ గర్వకారణం. సామాన్య జీవితం నుంచి బండా ప్రకాష్ ఎదిగారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారు. ► ఇక, బండా ప్రకాష్.. 1981లో మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్ఎస్కు ప్రధాన కార్యదర్శిగా నియామకం. ► శాసనమండలిలో కేటీఆర్ మాట్లాడుతూ.. 21 రోజుల్లో బిల్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నాము. టీఎస్ బీపాస్ వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. అనుమతులు లేని లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత చిన్న భూమిని కూడా మ్యాప్ చేశాము. ఉస్మాన్సాగర్ను ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వం. ► హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మేర ఉంది. రహేజా ఐటీ పార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంది. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. తర్వలో లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో మూడో దశ ప్రాజెక్ట్. పాతబస్తీ మెట్రోకు బడ్జెట్లో నిధులు కేటాయించాం. తెలంగాణపై కేంద్రం కనీస కనికరం చూపించడం లేదు. ముంబై, తమిళనాడు, గుజరాత్ మెట్రోలకు కేంద్రం నిధులు ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోకు పైసా కూడా ఇవ్వలేదు. మెట్రో ఛార్జీల పెంపు ఉండదు. ఆర్టీసీ తరహాలోనే ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పాం. ► అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రులకు బస్తీ దవాఖానాల వద్ద తాకిడి తగ్గింది. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖానాల సేవలు పొందారు. త్వరలో బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్ సేవలు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈనెలలో 1500 ఆశా పోస్టులు. ఏప్రిల్‌లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తాము. మేడ్చల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ► హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ► కేసీఆర్ మాట్లాడుతూ.. మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతీ నియోజకవర్గంలో అధునాతన కూరగాయాల మార్కెట్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు తీసుకుంటాము. గతంలో మోండా మార్కెట్‌ను సైంటిఫిక్‌గా కట్టారు. కలెక్టర్లందరికీ మోండా మార్కెట్‌ను చూపించాము. కల్తీ విత్తనాల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాము. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెడతాం. ► తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించాము. ► ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తొమ్మిదో రోజు బడ్జెట్ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హారీష్ రావు కీలక ప్రకటనలు చేశారు. -
కూరగాయలు అమ్ముడవక పారబోస్తున్నారు..!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు లేక వ్యాపారులు గొల్లుమంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలతో కిటకిటలాడే మోండా మార్కెట్ వెలవెలపోతోంది. లాక్డౌన్ నిబంధనల మేరకు ఉదయం వేళ మాత్రమే తెరిచి ఉంటుంది. కరోనా భయంతో జనం అంతగా రాకపోవడంతో వ్యాపారాలు సాగకపోవడంతో ఎలా బతకాలంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టుక నుంచి చావు వరకు, శుభకార్యాలు, ఇతరత్రా ఫంక్షన్లకు అన్ని రకాల వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా మోండా మార్కెట్ విరాజిల్లుతున్నది. సికింద్రాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది కొనుగోళ్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. తాజా కూరగాయలతో పాటు అనేక రకాల నిత్యవసర సరుకులు, పండ్లు హోల్‌సేల్ ధరల్లో ఇక్కడ లభిస్తాయి. దీంతో ప్రజలు పెద్దెత్తున మోండా మార్కెట్‌కు తరలి వస్తుంటారు. కళ తప్పిన మార్కెట్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 శాతం కూడా ఇక్కడ వ్యాపారం సాగడం లేదు. కరోనా భయంతో అనేకమంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. దీంతో మోండా మార్కెట్ చాలా వరకు కళతప్పినట్లయింది. చిరు వ్యాపారులు ప్రతి రోజు వ్యాపార నిర్వహణకు ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకుంటారు. సాయంత్రం అమ్మకాలు అయిపోగానే తిరిగి చెల్లిస్తారు. కరోనా పుణ్యమా అని అమ్మకాలు లేక తీసుకున్న ఫైనాన్స్ తిరిగి చెల్లించలేక అనేక మంది అప్పులపాలవుతున్నారు. మోండాలో గంపల్లో కూరగాయలు పెట్టుకొని అమ్మకాలు సాగించే చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొనేవారు లేక కూరగాయలను సాయంత్రం చెత్తకుండీల్లో పోస్తున్నారు. ఇక మార్కెట్లో కూరగాయల గంపలు మోసే కూలీలు ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం వరకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరి పాట్లు అన్నీ ఇన్నీ కావు. అదే విధంగా పండ్ల వ్యాపారుల పరిస్ధితి దయనీయంగా ఉంది. తెచ్చిన పండ్లు అమ్ముడుపోక పాడైపోయి నష్టపోతున్నారు. గ్రైన్ మర్చెంట్ పరిస్థితి అధ్వానంగా ఉంది. వ్యాపారాలు లేకపోవడంతో వర్తకులు తమ షాపుల్లో పని చేసే కూలీలను తొలగిస్తున్నారు. మీకు జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో అనేక మంది రోడ్డున పడ్డారు. మార్కెట్లో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో అధికారులు మార్కెట్లో రసాయనాలు కూడా పిచికారీ చేయించడం లేదని పలువురు వాపోతున్నారు. పరిస్థితి దయనీయంగా ఉంది కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్ధితి దారుణంగా ఉంది. గంపల్లో కూరగాయలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మేము గిరాకీలు లేక తెచి్చన వస్తువులు అమ్మకాలు కాక ఫైనాన్స్ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాము. –రాజు, కూరగాయల వ్యాపారి అమ్మకాలు బాగా తగ్గాయి ఆకుకూరల అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రజలు బయటకు రావడం లేదు. కరోనా వల్ల 30 శాతం కూడా వ్యాపారాలు సాగడం లేదు. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. –లక్ష్మణ్,ఆకుకూరల వ్యాపారి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు కరోనా నేపధ్యంలో ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోవాలి. వ్యాపారాలు లేని పరిస్ధితి ఎన్నడూ చూడలేదు. గతంలో ఉల్లిగడ్డల కోసం జనం ఎగబడేవారు. కరోనా పుణ్యమా అని అసలు గిరాకీ లేకుండా పొయింది. –ధన్‌రాజ్, ఉల్లిగడ్డల వ్యాపారి -
మోండా మార్కెట్ అగ్నిప్రమాదానికి 'ఆ ఇద్దరే' కారణం
హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణమైన నిందితులు చిరంజీవి, నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తాగిన మైకంలోనే మోండా మార్కెట్ వద్ద షాపులకు నిప్పు పెట్టినట్లు వారు అంగీకరించారు. అయితే మాదాపూర్‌లోని 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హన్మంతరావు కుమారుడు చిరంజీవి అని పోలీసులు చెప్పారు. మోండా మార్కెట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో షాపులు దగ్ధమైనాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించారు. ఆ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు నేరం ఒప్పుకున్నారు. -
సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ అయింది. గోల్డ్ వ్యాపారం చేసే వ్యక్తి అసిస్టెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం చోరీ చేశారు. ఈ సంఘటన మోండా మార్కెట్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వరగంల్‌కు చెందిన గోల్డ్ బిజినెస్ మెన్ అసిస్టెంట్‌తో మాట కలిపిన దొంగలు అతని దృష్టిమరల్చి 2.5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతో బంగారం యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోండా మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మార్కెట్ దగ్గరుండే సబ్‌స్టేషన్ దగ్గర వ్యక్తిని దుండగులు రాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. మృతుడు బాచుపల్లికి చెందిన చందూ(30)గా గుర్తించారు. ఇతడు బాచుపల్లిలో ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి అని సమాచారం. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (రామ్‌గోపాల్‌పేట) -
‘మోండా’ను ఆధునీకరిస్తాం
వారసత్వ నిర్మాణాలకు ముప్పు లేకుండా అభివృద్ధి చేస్తాం: కేసీఆర్ అరగంటకుపైగా మార్కెట్లోని గల్లీ గల్లీలో తిరిగిన ముఖ్యమంత్రికూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటూ విక్రయదారులతో ఆరా మార్కెట్‌ను కూలగొడితే తమ బతుకులేం కావాలని పలువురి ఆవేదన కూలగొట్టబోమని, ఇంకా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్‌ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ మార్కెట్ మొత్తాన్ని పరిశీలించారు. కూరగాయలు అమ్మే చోటు నుంచి కిరాణా దుకాణాలు, చేపలు, మాంసం విక్రయించే ప్రాంతాలు, కుండలు, పూజాసామగ్రి తదితర వ్యాపారాలు జరిగే అన్ని గల్లీల్లోనూ సీఎం తిరిగారు. అక్కడక్కడా కాసేపు ఆగి వ్యాపారులతో మాట్లాడారు. వారి వ్యాపారం గురించి, ధరల గురించి వారికెదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు, రవాణా, దిగుమతి తదితర విషయాలను వ్యాపారులతో మాట్లాడి తెలుసుకున్నారు. 1872 నుంచి మాంసం విక్రయాలు జరుగుతున్న మీట్ మార్కెట్ (భవనం) ఎంతో పురాతనమైనదని... దానిని కూల్చివేయకుండానే మార్కెట్‌ను ఆధునీకరించి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం... వారసత్వ కట్టడాలకు ఎలాంటి ముప్పులేకుండా మార్కెట్‌ను సర్వహంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తాగునీటి సదుపాయం కల్పిస్తామని, మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించి అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఒక వృద్ధురాలు తనకు ఇల్లు లేదని, మార్కెట్లో దుకాణం కావాలని సీఎంతో తన గోడు వెళ్లబోసుకోవడంతో.. ‘నీకేం బెంగ వద్దు. ఇల్లు, దుకాణం, పెన్షన్ అన్నీ సమకూరుస్తా’’ అని సీఎం హామీ ఇచ్చారు. కాగా.. వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న మోండా మార్కెట్‌ను కూలగొడతారని ప్రచారం జరుగుతోందని.. కూలగొడితే తమ బ్రతుకులేం కావాలంటూ కూరగాయలు విక్రయించే పలువురు సీఎంను ప్రశ్నించగా... ‘‘మార్కెట్‌ను కూలగొట్టం. ఇంకా బాగా చేస్తాం.. ఇలా మురికి మురికి ఉంటే ఎవరు కొంటారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నరకంలా నగరం మోండా సందర్శన అనంతరం ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష జరిపారు. ‘‘నగరానికి అందాన్ని ఇచ్చే హుస్సేన్‌సాగర్ మురికి కూపంగా ఉంది. అటవీ భూములున్నా ఎక్కడా చెట్లు కన్పించడం లేదు. మురుగునీటి కాల్వల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు అధ్వానం. నిత్యం ట్రాఫిక్ జాంలే! కూరగాయల మార్కెట్లలో కనీస వసతులు లేవు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ వేసవిలో హుసేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తొలిసారిగా ఒక సీఎం.. దాదాపు వందేళ్ల కిందట నిజాం కాలంలో ఏర్పాటైన మోండా మార్కెట్‌ను సీఎం సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి మోండా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్... మార్కెట్ మొత్తం కలియదిరిగారు. అక్కడ అల్లం, వెల్లుల్లి విక్రయించే మధుసూదన్‌రావుతో ఒక నిమిషం పాటు మాట్లాడారు. ‘అల్లమెల్లిగడ్డ ఎక్కడి నుంచి తెస్తావ్, ఎంతకు తెచ్చి, ఎంతకు అమ్ముతావు’ అని అడిగారు. క్యాప్సికం అమ్మే ఓ దుకాణం వద్ద ఆగి.. ‘ధర ఎలా ఉంది..?’ అంటూ కేసీఆర్ ఆరా తీశారు. కిలో రూ.30 వరకు అమ్ముతున్నట్లు ఆ వ్యాపారి చెప్పడంతో.. ‘అట్లనా..’ అంటూ సీఎం ముందుకు కదిలారు. గిరాకీ ఎలా ఉందంటూ పలువురు దుకాణదారులతో మాట్లాడారు. -
మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం
-
మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ప్లాస్టిక్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, నాలుగు ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.