సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కేసును పోలీసులు బుధవారం ఛేదించారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణమైన నిందితులు చిరంజీవి, నిఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
దీంతో తాగిన మైకంలోనే మోండా మార్కెట్ వద్ద షాపులకు నిప్పు పెట్టినట్లు వారు అంగీకరించారు. అయితే మాదాపూర్లోని 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హన్మంతరావు కుమారుడు చిరంజీవి అని పోలీసులు చెప్పారు. మోండా మార్కెట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో షాపులు దగ్ధమైనాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అందులోభాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించారు. ఆ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు నేరం ఒప్పుకున్నారు.