monitiring
-
సహాయక చర్యల పర్యవేక్షిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి
-
సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్‌కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్ పేరిట భారత్, యూఎస్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్‌కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్‌షిప్పులు, ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది. -
స.హ.చట్టంపై కొరవడిన పర్యవేక్షణ
స.హ.చట్టం కమిషనర్ తాంతియాకుమారి ఉయ్యూరు : సమాచార హక్కు చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజలకు పూర్తి న్యాయం జరగడంలేదని రాష్ట్ర కమిషనర్ లాం తాంతియకుమారి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ బంగళాలో బుధవారం ఆమె సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో సమీక్ష, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ కొందరు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని శత్రువుగా చూస్తూ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమ నైతికతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఆశాజనక పరిస్థితులు లేవన్నారు. ఈ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. సామాజిక కార్యకర్తలను బ్లాక్‌మెయిల్‌ర్లుగా చూపుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒకరిద్దరు చేసే తప్పులను పెద్దగా చూపి, చట్టం మొత్తాన్ని అపహాస్యం చేయడం తగదన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించేలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాస్ గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, అలమూడి చంద్రమోహన్, వల్లే శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తాంతియాకుమారిని సన్మానించారు.