More rains
-
దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం : .పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంఓ దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించింది. -
24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు
విశాఖపట్నం : 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. రుతుపవనాల వల్ల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.