mother and daughters
-
కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: ముక్కు పచ్చలారని ముగ్గురు కుమార్తెలతో కలిసి ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసిన ఈ ఘటన ఆదివారం కలబురిగి జిల్లాలో జరిగింది. ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. ఆళంద తాలూకా మాదిహాళలో లక్ష్మీ (28) అనే మహిళ గౌరమ్మ(6), ఈశ్వరి (3), సావిత్రి(1) అనే ముగ్గురు కుమార్తెలతో కలిసి బావిలోకి దూకింది. వీరిలో ఈశ్వరి అనే బాలిక ప్రాణాలతో బయట పడింది. ముగ్గురు కూతుళ్లే పుట్టారని భర్త ఇంటివారు వేధిస్తుండడంతో లక్ష్మీ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ముంబర్గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం బాలుణ్ని లాక్కెళ్లిన మొసలి సాక్షి బెంగళూరు: చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లిన బాలుడు మొసలి వాతపడ్డాడు. ఈ ఘటన కారవార జిల్లా దాండేలి నగర సమీపంలో ఆదివారం జరిగింది. దాండేలి సమీపంలోని ప్రవహిస్తున్న కాళీ నది గట్టున మహమ్మద్ గుల్బర్గా (15) అనే బాలుడు గాలంతో చేపలు పడుతుండగా ఒక మొసలి అతడిని పట్టుకుని నీళ్లలోకి లాక్కెళ్లింది. పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి స్థానికులు బాలుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చదవండి: సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్ దొరికాడు..! -
సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య
సత్తెనపల్లి: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను అతి దారుణంగా నరికి చంపిన ఉదంతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో శనివారం రాత్రి కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది. శివప్రసాద్ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్ పేరుతో ఉంది. అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను అతికిరాతకంగా నరికి చంపాడు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్, రూరల్ సీఐలు యూ. శోభన్‌బాబు, బి. నరసింహారావు, ఎస్ఐ రఘుపతి పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. -
కాపురంలో ఫోన్‌కాల్ చిచ్చు: వయసైన కూతుళ్లతో తల్లి అదృశ్యం
బహదూర్‌పురా (హైదరాబాద్): ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కామాటిపురా మురళీ గుమ్మాస్ ప్రాంతానికి చెందిన కిషన్ శర్మ, పూజ ఆలియాస్ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్‌పేట్‌లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ఈ విషయమై భర్త కిషన్ శర్మ పవన్‌ను మందలించి, 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్‌కు మకాం మార్చారు. అయితే పవన్ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్‌కు మార్చాడు. తరచు ఫోన్లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి, మోహిని ఆలియాస్ మీనా (14), గోపి (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇప్పటవరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కిషన్ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 9490616495లో సంప్రదించాలన్నారు. -
ఇంటిపై తెగిపడ్డ హైటెన్షన్ వైరు, ముగ్గురి మృతి
విజయవాడ: నగరంలోని బంటుమిల్లి మండలం ముంజులూరులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుద్ఘాతంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. మంజులూరులో భారీగా వీసిన ఈదురుగాలులకు హైటెన్షన్ వైరు ఇంటిపై తెగిపడింది. హైటెన్షన్ వైరు నుంచి ఇంటికి విద్యుత్ ప్రవహించడంతో ఇంట్లో వారంతా విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
నెల్లూరు : నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మృతులు తల్లి సుజాత, చిన్నారులు సాత్విక్, జోషికగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు కిందపడి తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య
వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఖమ్మంకు చెందిన శ్రావణి (35), అమూల్య (12), జీవని (6)గా గుర్తించారు. శ్రావణి తన ఇద్దరు కూతుళ్లతో సహా శుక్రవారం అర్థరాత్రి మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.