ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బళ్లారి: ముక్కు పచ్చలారని ముగ్గురు కుమార్తెలతో కలిసి ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసిన ఈ ఘటన ఆదివారం కలబురిగి జిల్లాలో జరిగింది. ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. ఆళంద తాలూకా మాదిహాళలో లక్ష్మీ (28) అనే మహిళ గౌరమ్మ(6), ఈశ్వరి (3), సావిత్రి(1) అనే ముగ్గురు కుమార్తెలతో కలిసి బావిలోకి దూకింది. వీరిలో ఈశ్వరి అనే బాలిక ప్రాణాలతో బయట పడింది. ముగ్గురు కూతుళ్లే పుట్టారని భర్త ఇంటివారు వేధిస్తుండడంతో లక్ష్మీ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ముంబర్గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
బాలుణ్ని లాక్కెళ్లిన మొసలి
సాక్షి బెంగళూరు: చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లిన బాలుడు మొసలి వాతపడ్డాడు. ఈ ఘటన కారవార జిల్లా దాండేలి నగర సమీపంలో ఆదివారం జరిగింది. దాండేలి సమీపంలోని ప్రవహిస్తున్న కాళీ నది గట్టున మహమ్మద్ గుల్బర్గా (15) అనే బాలుడు గాలంతో చేపలు పడుతుండగా ఒక మొసలి అతడిని పట్టుకుని నీళ్లలోకి లాక్కెళ్లింది. పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి స్థానికులు బాలుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్ దొరికాడు..!
Comments
Please login to add a commentAdd a comment