Mother and son suicide
-
కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన
సాక్షి, కామారెడ్డి: అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఓ పోలీసు అధికారి కలిసి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఏడాదిన్నరగా వారు పెడుతున్న టార్చర్‌తో మనశ్శాంతి కరువైందని పేర్కొంటూ ఓ తల్లి, ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి వేధింపులపై ఎందరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. కనీసం తమ చావుతోనైనా వారికి శిక్ష పడుతుందనే ఆశతో లోకం విడిచిపోతున్నామంటూ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు ఫేస్బుక్లో పోస్టు చేశారు. తర్వాత నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు, సూసైడ్ నోట్ వైరల్ కావడంతో కలకలం చెలరేగింది. మొదట ప్రమాదమనుకుని.. శనివారం తెల్లవారుజామున పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న మహారాజ లాడ్జి 203 నంబర్ గది నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీనిపై లాడ్జి నిర్వాహకులను అప్రమత్తం చేయడంతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పింది. అప్పటికే గదిలో ఇద్దరు వ్యక్తులు మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తోనో, మరేదైనా కారణంతోనో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు తొలుత భావించారు. మృతులను మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన గంగం సంతోష్ (35), ఆయన తల్లి పద్మ (65)గా గుర్తించారు. అయితే అది ప్రమాదం కాదని, తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో సంతోష్ చేసిన పోస్టులతో బయటపడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సోమనాథం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కామారెడ్డి పట్టణ సీఐ నరేశ్ నిందితులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులను రప్పించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. మాంసపు ముద్దలుగా మారిన ఇద్దరి మృతదేహాలను అంబులెన్స్ ద్వారా రామాయంపేటకు తరలించారు. ఆందోళనకు దిగిన స్థానికులు.. శనివారం సాయంత్రం సంతోష్, పద్మల మృతదేహాలను రామాయంపేటలోని స్వగృహానికి తరలించారు. అప్పటికే వందలాది మంది స్థానికులు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహాలను వాహనంలో పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఇంటివైపు బయల్దేరారు. పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో.. పద్మ మృతదేహాన్ని చేతులమీద మోసుకుంటూ వెళ్లి చైర్మన్ ఇంటిని ముట్టడించారు. అప్పటికే చైర్మన్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో.. బయట ఉన్న సీసీ కెమెరాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెదక్ ఎస్పీ, తూప్రాన్ డీఎస్పీ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనివెనుక ఎవరున్నా సరే వదలిపెట్టం. – బి.శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ తండ్రి వైద్యం కోసం వచ్చి.. సంతోష్‌తోపాటు ఆయన తల్లి పద్మ, తండ్రి అంజయ్య ముగ్గురూ ఈ నెల 11న రామాయంపేట నుంచి కామారెడ్డికి వచ్చారు. తండ్రికి వైద్య పరీక్షలు చేయించాక మహారాజ లాడ్జిలో దిగారు. తాము రామారెడ్డి, బాసర ఆలయాలకు వెళ్లొస్తామని సంతోష్, పద్మ చెప్పడంతో.. తండ్రి అంజయ్య అదేరోజు రామాయంపేటకు తిరిగి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచీ లాడ్జిలోనే ఉన్న తల్లికొడుకు.. మానసిక ప్రశాంతత కోసం రామారెడ్డిలోని ఆలయం ఉంటున్నామని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి లాడ్జి గదిలోనే సంతోష్, పద్మ సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఆ వెంటనే కొందరు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ పంపినట్టు తెలుస్తోంది. సంతోష్ శనివారం తెల్లవారుజామున వీడియోలను, సూసైడ్ నోట్‌ను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్లోని ఆరు పేజీలపైనా తల్లికొడుకు ఇద్దరూ సంతకాలు చేశారు. ఆ ఏడుగురి వేధింపుల వల్లే.. గంగం సంతోష్, ఆయన తల్లి పద్మ ఆత్మహత్యకు ముందు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్లో తమ మరణానికి ఏడుగురు కారణమంటూ స్పష్టంగా పేర్కొన్నారు. వారి పేరు, హోదా, ఫోన్ నంబర్లనూ రాశారు. సూసైడ్‌నోట్‌లో సంతోష్, పద్మ పేర్కొన్న వివరాలివీ.. ‘‘మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, అతడి కొడుకు సరాఫ్ స్వరాజ్, ఐరేని పృథ్వీరాజ్, తోట కిరణ్, కన్నాపురం కిష్టాగౌడ్తోపాటు రామాయంపేటలో సీఐగా పనిచేసి బదిలీ అయిన నాగార్జునగౌడ్ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ)ల వేధింపులే మా చావుకు కారణం. ఈ ఏడుగురి మూలంగా మనశ్శాంతితోపాటు సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యాను. అయినా వదలకుండా వే«ధిస్తూనే ఉన్నారు. నేను, నా కుటుంబం మానసిక ప్రశాంతతను కోల్పోయాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, న్యాయం చేయాలంటూ ప్రజాప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగలేదు. – మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సరాఫ్ స్వరాజ్‌లు చేసే అక్రమాలు, అన్యాయాలు సహించలేక 2020 నవంబర్‌లో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. కానీ దానికి నన్ను బాధ్యుడిని చేసి.. పథకం ప్రకారం 2020 నవంబర్ 24న అప్పటి సీఐ నాగార్జునగౌడ్ దగ్గరికి పిలిపించారు. ఆ పోస్టుతో నాకు సంబంధం లేదని చెప్పినా సీఐ వినలేదు. నా మొబైల్ తీసేసుకుని పంపించారు. దీనిపై మెదక్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో.. డిసెంబర్ 3న మొబైల్ తిరిగి ఇచ్చారు. కానీ సీఐ ఈ పది రోజుల్లో నా మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా, వ్యాపార సమాచారాన్ని తీసుకుని మున్సిపల్ చైర్మన్‌కు ఇచ్చారు. తర్వాత నా పర్సనల్ డేటాను బయటపెడతానంటూ జితేందర్‌గౌడ్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీనిపై డీఎస్పీ, ఎస్పీ, డీఐజీలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లతోపాటు సీఎంవోకు ఫిర్యాదులు చేశాను. అయినా ఫలితం లేదు. నా పర్సనల్ డేటాను అడ్డుపెట్టుకుని అనేక రకాలుగా ఇబ్బందిపెట్టారు. డబ్బులు డిమాండ్ చేశారు. ఈ వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌తో ఆస్తులు నష్టపోయాను. చివరికి అప్పులు చేయాల్సి వచ్చింది. కుటుంబంలో మనశ్శాంతి కరువైంది. ఏడాదిన్నరగా మానసిక క్షోభ అనుభవించాం. విధిలేని పరిస్థితుల్లో మా అమ్మ, నేను చనిపోతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి మాకు అన్యాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఎవరిదీ పాపం? సంతోష్, పద్మల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ ఘటనలో పాపం ఎవరిదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. సంతోష్‌కు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్లతో ఏడాదిన్నరగా గొడవలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్‌లోని పోస్టు వ్యవహారంలో వారు సంతోష్‌పై ఫిర్యాదు చేశారు. సంతోష్‌ను పిలిపించిన సీఐ నాగార్జునగౌడ్.. అతడి సెల్‌ఫోన్ తీసుకోవడం, అందులోని డేటాను అధికార పార్టీ నాయకులకు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సంతోష్ ఎస్పీ మొదలు ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం కార్యాలయం దాకా ఫిర్యాదులు చేసినా.. ఎక్కడా స్పందన రాకపోవడం ఏమిటన్న సందేహాలూ వస్తున్నాయి. సంతోష్ తనను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని, తాను చనిపోతే వారే కారకులని పేర్కొంటూ ఈ ఏడాది జనవరి 13న రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందినట్టుగా దాని కాపీపై పోలీస్‌స్టేషన్ స్టాంప్ కూడా వేయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు సంతోష్ ఫిర్యాదు చేసినప్పుడు స్పందించినా ఫలితం ఉండేదని బంధువులు వాపోతున్నారు. పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కవడం వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గంగం సంతోష్, మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ గతంలో స్నేహితులేనని.. సంతోష్ మరికొందరితో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సంతోష్‌ను టార్గెట్ చేసి ఇబ్బందిపెట్టారని అంటున్నారు. చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?) -
కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య
మనస్తాపం.. ఒక్క నిమిషం తమాయించుకుంటే.. ఎంతటి సమస్యకైనా కాలమే సమాధానమిస్తుంది. అలా నిగ్రహించుకోలేకపోతే.. వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటోయో.. ఈ తల్లి, కొడుకు ఆత్మహత్య ఉదంతం.. సాక్ష్యంగా నిలుస్తుంది. కాపురంలో చిన్నపాటి వివాదాలు. గతంలో అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసిన ఆమె.. ఈసారి మాత్రం మనస్థాపంతో నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈసారీ అలాగే వస్తుందనుకున్న భర్త, బంధువులు.. వారిద్దరి మృతదేహాలు కంటపడేసరికి తల్లడిల్లిపోయారు. పల్లం గ్రామం బోరున విలపించింది. ఇదేమీ తెలియని మృతురాలి చిన్నారి.. అందరి వైపు చూస్తుంటే.. అతడిని చూసిన అందరు.. ఉబికివస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయారు. సాక్షి, కాట్రేనికోన (తూర్పు గోదావరి): పల్లం గ్రామానికి చెందిన సంగాని రామలక్ష్మి (22) కుమారుడు గీతాకృష్ణ (4)తో పాటు గోదావరి పాయలో పడి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ గ్రామానికి చెందిన సంగాని నరసింహరాజు (చిన నరసింహులు)తో ఆరేళ్ల క్రితం రామలక్ష్మికి వివాహమైంది. వీరికి వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు గీతాకృష్ణ (4) ఏడాది లోపు పాప ఉన్నారు. మృతురాలు రామలక్ష్మి సోదరుడు శేషాద్రి, ఆమె భర్త నరసింహరాజు మధ్య బుధవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య కూడా గొడవ తలెత్తడంతో విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోతానని, రాత్రి 12 గంటల సమయంలో కుమార్డు గీతా కృష్ణను తీసుకుని వెళ్లిపోయింది. గతంలో గొడవ పడి వెళ్లిపోయిన ఆమె బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత తిరిగి ఇంటి వెళ్లింది. అలాగే తిరిగి అవుతుందని అనుకున్నా.. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆమె లేకపోవడంతో పరిసరాల్లో వెతికారు. గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి బాలుడి మృతదేహం గోదావరి పాయలో కనబడింది. వినాయక నిమజ్ఙనంలో ఎవరో బాలుడు మృతి చెంది ఉంటాడనుకున్నారు. భార్య, కొడుకు కోసం వెతుకు తున్న భర్త, వారి బంధువులకు గోదావరి పాయలో బాలుడి మృతదేహం ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి చూసి గీతకృష్ణ మృతదేహంగా గుర్తించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానించి.. గాలించడంతో భార్య రామలక్ష్మి మృతదేహం కూడా బయటపడింది. వృత్తి రీత్యా మృతురాలి భర్త చేపల వేట చేస్తుంటాడు. చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్నావని రోజూ కొట్టేవాడని, అతని వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. కంట తడిపెట్టిన గ్రామస్తులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏడాది పాపను ఇంటి వద్దనే వదిలి కొడుకు గీతాకృష్ణతో పాటు రామలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో పల్లం గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి మృతదేహంపై పడి బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలసి వేసింది. రోజూ అందరితో ఆడుకొనే బాలుడు మృతి చెందడంతో అతడితో ఆడుకొనే చిన్నారులు బిక్కముఖాలతో కూర్చున్నారు. ఏమి జరిగిందో తెలియని మృతురాలి ఏడాది లోపు చిన్నారి.. అక్కడి అందరినీ చూస్తూ కూర్చోవడం.. చూపరులకు దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనపై కాట్రేనికోన ఏఎస్సై వి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతులెలా వచ్చాయమ్మా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు గీతాబాయి, ఆమె కొడుకు వరుణ్. చీటీల్లో నష్టాలు వచ్చాయని ఆమె కన్నకొడుకుని ఉరివేసి చంపి, తరువాత తానూ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం బెంగళూరులో చోటుచేసుకుంది. బనశంకరి: చీటీ వ్యవహారాల్లో తీవ్ర నష్టాలు రావడంతో మనస్థాపం చెందిన మహిళ తన 12 ఏళ్లు కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన శనివారం రాత్రి హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.... విభూతిపుర ఎస్ఎల్ఎన్ స్కూల్ వద్ద సురేశ్‌బాబు, గీతాభాయి (45) దంపతులు నివాసముంటున్నారు. వీరికి వరుణ్ (12) అనే కుమారుడు ఉన్నారు. సురేశ్‌బాబు ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తుండగా గీతాబాయి ఇంటి వద్ద కిరాణాదుకాణం నిర్వహించడంతో పాటు చీటీల నడిపేది. ఇటీవల చీటీల లావాదేవీలలో నష్టాలు రావడంతో చీటీలు వేసిన వ్యక్తులు డబ్బుకోసం గీతాబాయిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి భర్త విధులకు వెళ్లిన సమయంలో కుమారుడుని ఫ్యాన్‌కు ఉరి వేసి అనంతరం మరో గదిలో తాను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సురేశ్ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెచ్ఏఎల్ పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని మృతదేహాలకు శవపరీక్షల నిమిత్తం బౌరింగ్ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కొడుకు చదవడం లేదని..
ఆలేరు : కుమారుడు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ తల్లి కలత చెందింది.. పలుమార్లు మందలించినా పద్ధతి మార్చుకోలేదు సరికదా.. చదువును మధ్యలోనే ఆపేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు.. దీంతో విసిగివేసారిన ఆ తల్లి చనిపోవాలని నిర్ణయించుకుని టాయిలెట్లు క్లీన్ చేసే ద్రావణాన్ని తాగింది.. అది చూసిన కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలేరు మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మందనపల్లి గ్రామానికి చెందిన నర్మెట్ట వెంకటేశ్ –చంద్రకళ దంపతుల కుమారుడు బాలు ఇటీవల పాల్టెక్నిక్ డిప్లమా చదువు మధ్యలో మానేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. వెంకటేశ్ ఆటోడ్రైవర్, చంద్రకళ ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. వెంకటేశ్ ఉదయం బయటకు వెళ్లగా, చంద్రకళ కొడుకును మందలించింది. కుమారుడి విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రకళ టాయిలెట్లు క్లీన్ చేసే ఫినాయిల్ తాగింది. భయాందోళనకు గురైన బాలు కూడా చంద్రకళ వదిలేసిన మిగతా ఫినాయిల్‌ను తాగాడు. ఇరుగుపొరుగు వారు గమనించి 108 ద్వారా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని తెలిసింది. -
మూడు రోజులు.. ఇంకా కోమాలోనే మాధవీలత !
ఒంగోలు /చీమకుర్తి: మండల పరిధిలో మూడురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిడసల మాధవీలత, కుమారుడు జనార్దన్‌లు ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం రిమ్స్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 8న పేర్నమిట్ట శాంతినగర్‌కు చెందిన మాధవీలత, కొడుకు, కూతురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కూతురు విజయలక్ష్మి అప్పుడే మృతిచెందగా మాధవీలత, జనార్దన్ మృత్యువుతో పోరాడుతున్నారు. శరీరంలో పురుగుల మందు ప్రభావం కనీసం వారం రోజుల వరకు ఉంటుందని వైద్యం చేస్తున్న డాక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని వారం రోజులు గడిస్తేగాని వారి ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తాలూకా సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను నిపుణులచే పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మాధవీలత ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొంతమందికి ఇవ్వాల్సిన చిన్న అప్పులను కూడా పిలిచి ఇచ్చినట్లు, అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ముందే అనుకుని ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు సీఎంను, కలెక్టర్‌ను అడ్రెస్ చేస్తూ తన భర్త చనిపోవడానికి గల కారకుల పేర్లను సూసైడ్‌నోట్‌లో రాసి ఉంచటమే కాకుండా మాధవీలత చేతుల మీదకూడా వారి పేర్లు రాసినట్లు చెప్పుకుంటున్నారు. -
చంటి బిడ్డతో బావిలోకి దూకిన తల్లి
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని అత్తేల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి చంటి బిడ్డతో పాటు బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలివి.. మృతురాలి పేరు వరాలు. ఆమె స్వగ్రామం ఏక్మామిడి గ్రామం. మూడేళ్ల క్రితం అత్తేల్లి గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం అయింది. వీరికి 10 నెలల బాబు ఉన్నాడు. భర్త వేధింపులే ఆమె మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. కోపంతో ఆమె చంటి బిడ్డతోపాటు బావిలోకి దూకేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి మృతదేహాలను తీసి పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పల్లె.. కన్నీరు పెట్టింది!
కోరుట్ల/కోరుట్లరూరల్: పల్లె కన్నీరుమున్నీరైంది...మానవత్వంతో కదిలింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆ తల్లీ కొడుకుల కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో గురువారం సాయంత్రం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఒకే చితిపై తల్లీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించగా ఆడకూతుళ్లు చితికి నిప్పంటించిన వైనం అందరినీ కలచివేసింది. నష్టాల సాగు.. వెక్కిరించిన గల్ఫ్ వ్యవసాయంలో నష్టాలు.. వెక్కిరించిన గల్ఫ్ వలస ఫలితంగా పెరిగిన అప్పులు మారం శ్రీనివాస్‌ను ఆత్మహత్యకు పురిగోల్పాయి. 40 ఏళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా టేకుమల్ల మండలం అసిరెడ్డి పల్లె నుంచి మారం శ్రీనివాస్ కుటుంబం గుమ్లాపూర్‌కు వలస వచ్చింది. తం డ్రి వెంకట్రామ్రెడ్డి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో కుటుంబ భారం ఒక్కగానొక్క కొడుకు మా రం శ్రీనివాస్‌పై పడ్డాయి. అంతకు ముందే 14 ఏళ్లు గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ అక్కడ పనులు సరిగా లేక తిరిగివచ్చాడు. ఆ తరువాత తల్లి నీలమ్మ, భార్య తిరుమలతో కలిసి వరంగల్ జిల్లా చిట్యాల మండలం కొత్తపేటలో రెండు ట్రాక్టర్లు కొనుక్కుని భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయం అంతంతగానే ఉండగా ట్రాక్టర్ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ సమయంలో దాదాపు రూ.8 లక్షల పరిహారం చెల్లించాడు. గల్ఫ్..వ్యవసాయం..ట్రాక్టర్ యాక్సిడెంట్ ఇలా ఎటు నుంచి చూసినా శ్రీనివాస్‌ను నష్టాలే వెక్కిరించాయి. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి గుమ్లాపూర్తోపాటు కొత్తపేటలోనూ అప్పులు చేశాడు. అవి దాదాపు రూ.25 లక్షలకు చేరుకున్నాయి. పెరిగిన ఒత్తిడి.. నాలుగు నెలల క్రితం వరకు టేకుమల్ల మండలం కొత్తపేటలో ఉన్న మారం శ్రీనివాస్ కుటుంబం అక్కడ అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిపోవడంతో కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో సొంతింటిలో ఉంటున్న తల్లి నీలమ్మ వద్దకు వచ్చి ఉంటున్నాడు. కొత్తపేట నుంచి వచ్చినప్పటికీ గుమ్లాపూర్‌లో అప్పులు ఉండటంతో శ్రీనివాస్ సతమతమయ్యాడు. స్థానికంగా అప్పుల ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని అప్పుల కింద రూ.17 లక్షలకు అప్పగించాడు. ఈ క్రమంలో తల్లి నీలమ్మతో గొడవలు జరిగినట్లు సమాచారం. గుమ్లాపూర్‌లో ఇల్లు అమ్మి అప్పులు కడుతున్నాడన్న విషయం తెలుసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తులు తమ బాకీ వసూలుకు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మరోమార్గం లేక శ్రీనివాస్ ఆత్మహత్యకు నిర్ణయించుకున్నాడు. ఇంటిపై మమకారం.. 40 ఏళ్లుగా నీడనిచ్చిన ఇంటిని అమ్మే విషయంలో మారం శ్రీనివాస్‌కు, తల్లి నీలమ్మకు కొంత మేర విభేదాలు వచ్చినప్పటికీ కొడుకు పరిస్థితిని చూసి చివరికి ఇల్లు అమ్మేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అప్పుల బాధతో వేగలేక చావడానికి నిశ్చయించుకున్న శ్రీనివాస్ తను లేకుంటే అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరని తీవ్రవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తల్లితోపాటు తాను విషం తీసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. గురువారం భార్య తిరుమల బట్టల షాపులో పనికి కోరుట్లకు వెళ్లిపోగానే పురుగుల మందును అందుబాటులో ఉంచుకున్న శ్రీనివాస్ సాయంత్రం తన కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు ఇంటికి రాగానే వారిని ఏమైనా కొనుక్కొమని చెప్పి షాప్‌కు పంపినట్లు తెలిసింది. పిల్లలు బయటకు వెళ్లగానే తల్లి నీలమ్మకు విషం ఇచ్చి తాను తాగి దూలానికి ఉరి వేసుకున్నాడు. గ్రామస్తుల మానవత్వం.. అప్పుల బాధతో తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గుమ్లాపూర్‌లో విషాదం నెలకొంది. భార్య తిరుమల, కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా గ్రామస్తులు అంత్యక్రియల కోసం రూ.38 వేలు చందాలు వేసుకున్నారు. టేకుమల్ల మం డలం అసిరెడ్డిపల్లి నుంచి మారం శ్రీనివాస్ అత్తగారి తరçపున బంధువులు రాగానే గ్రామస్తులు అంతా కలిసి శ్రీనివాస్, నీలమ్మ మృతదేహాలను ట్రాక్టర్లో ఎక్కించి శ్మశానానికి తరలించారు. ఒకే చితిపై తల్లీకొడుకుల మృతదేహలను ఉంచగా శ్రీనివాస్ భార్య తిరుమల, కూ తురు కీర్తన చితికి నిప్పు పెట్టారు. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కన్నీరుపెట్టించింది. -
తల్లి, కొడుకు ఆత్మహత్య : ప్రమాద స్థితిలో మరో బిడ్డ
అనంతపురం: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తల్లికొడుకు మృతి చెందారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడిందంటే ఎంత కష్టం వచ్చిందో అని అనుకుంటున్నారు. ఆర్థిక కారణాల వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
తల్లీకొడుకు ఆత్మహత్య: మరో కొడుకు పరిస్థితి విషమం
మహబూబ్‌నగర్: దామరగిద్ద మండలం వత్తుగుల్లలో ఓ తల్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటనలో తల్లి, ఒక కొడుకు మృతి చెందారు. మరో కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కుమారులు సహా తల్లి గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి స్థానికులు వారిని నారాయణపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతి చెందారు. మరో కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కొడుకు కూడా చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.