డీజీపీ జేవీ రాముడికి మాతృవియోగం
తాడిమర్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ (70) అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్పల్లి గ్రామం. గోవిందమ్మ అనారోగ్యంతో రెండు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా గోవిందమ్మ భౌతికగాయాన్ని నార్సింగ్ పల్లికి తరలించనున్నారు. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.