mourning the
-
ఉత్తేజ్ భార్య గురించి చెబుతూ ఏడ్చేసిన చిరంజీవి
-
ఉత్తేజ్ భార్య సంతాప సభ
-
వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ కన్నుమూత
హనొయి/న్యూఢిల్లీ: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ (61) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు వియత్నాం అధికారిక మీడియా తెలిపింది. క్వాంగ్ 2016 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు 4 దశాబ్దాల పాటు కీలకమైన ప్రజా భద్రత మంత్రిగా చేశారు. శక్తిమంతమైన నేతగా క్వాంగ్‌కు మంచి పేరుంది. దేశ అధ్యక్ష పదవితో పాటు మరో నాలుగు దేశ అత్యున్నత పదవుల బాధ్యతలను క్వాంగ్ నిర్వర్తిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న క్వాంగ్.. పార్టీ అంతర్గత వర్గాల్లో మంచి ప్రభావవంతమైన, గట్టి నేతగా పేరు సంపాదించుకున్నారు. వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
సెనెటర్ మెక్కెయిన్ కన్నుమూత
న్యూయార్క్: అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, ట్రంప్ బద్ద్ధ విరోధి, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరుపడ్డ సెనెటర్ జాన్ మెక్కెయిన్(81) అనారోగ్యంతో కన్నుమూశారు. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల మనసు గెలుచుకున్న ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం సాయంత్రం 4.28 గంటలకు(భారత కాలమానం ఆదివారం తెల్లవారుజామున) తుదిశ్వాస విడిచారు. మెక్కెయిన్ కోరిక మేరకు వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆయన కుటుంబం శుక్రవారమే ప్రకటించింది. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్ పనిచేసిన కెయిన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు 2017లో బయటపడింది. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్నా ఆరోగ్యం పూర్తి క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘నా హృదయం బద్ధలైంది. 38 సంవత్సరాలు ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. బతికున్నంత కాలం నచ్చినట్లుగానే జీవించారు. మరణం కూడా అంతే.. ఆయనను ప్రేమించినవారు చుట్టుఉండగా.. తాను ఎంతో ఇష్టపడిన చోటే ప్రాణాలు వదిలారు’ అని మెక్కెయిన్ భార్య సిండీ ట్విట్టర్లో తెలిపారు. వియత్నాం యుద్ధంలో నేవల్ అధికారిగా పనిచేసిన కెయిన్ దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించారు. అయినా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలతో బయటపడి అమెరికన్ల ప్రశంసలు అందుకున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్ చేతిలో ఓడిపోగా.. 2008 రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికైనా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు. అంత్యక్రియలకు ట్రంప్ రావద్దు రిపబ్లికన్ సెనేటర్‌గా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరంకుశ నిర్ణయాల్ని ఎండగట్టడంలో మెక్కెయిన్ ఎప్పుడూ ముందుండేవారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రకటనల్ని తీవ్రంగా విమర్శించారు. శరణార్థుల విషయంలో అమెరికా విధానాల్ని తూర్పారపడుతూ ట్రంప్‌కు పక్కలో బల్లెంలా మారారు. తన అంత్యక్రియలకు సైతం రావద్దని ట్రంప్‌కు తన వైఖరిని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు ట్రంప్‌ను ఆహ్వానించడం లేదని ఇప్పటికే కెయిన్ కుటుంబం ప్రకటించింది. మెక్కెయిన్ మృతి పట్ల పార్టీల కతీతంగా సంతాపం వెల్లువెత్తింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి బుష్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. మెక్కెయిన్ మృతికి భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌తో స్నేహానికి పెద్దపీట భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాంక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్ఎన్కు సంపాదకీయం రాస్తూ.. ‘ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా–భారత్ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవో కొన్ని దేశాలకు మాత్రమే ఇంత తక్కువ కాలంలో గొప్ప గౌరవం లభించింది. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని ప్రస్తుతించారు. అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. -
కార్టూనిస్ట్ శేఖర్ పేరిట ఏటా అవార్డులు : ఈటెల
శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: అనుకున్నది సాధించే వరకు ధైర్యంతో నిరంతరం పోరాడే వ్యక్తిత్వం శేఖర్‌దని మానవతావాదిగా, స్నేహశీలిగా సహోద్యోగులతో ఎంతో అన్యోన్యంగా మెలిగే శేఖర్ మన మధ్య లేకపోవడం విచారకరమని పలువురు ప్రముఖులు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ సంతాప సభ జరిగింది. కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సీనియర్ కార్టూనిస్ట్ మోహన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రజాశక్తి అసిస్టెంట్ ఎడిటర్ తులసీదాస్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏటా శేఖర్ పేరుపై ప్రముఖ కార్టూనిస్టులకు అవార్డులు అందేలా చూస్తామన్నారు. ఇదే విషయాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్. రామచందర్ రావు తన సందేశంలో చెప్పారు. ఎంతో ధైర్యంతో, పట్టుదలతో తాను అనుకున్నది సాధించే స్వభావం శేఖర్‌దని కార్టూనిస్టు సుభాని చెప్పారు. కార్టూన్లలో సృజనాత్మకతను, భావాలను వ్యక్త పరచడం, ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలను గీయడం శేఖర్ వద్దే నేర్చుకున్నానని మరో కార్టూనిస్టు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖలు శేఖర్‌తో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి ప్రతినిధి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, దేశపతి శ్రీనివాస్, శేఖర్ సతీమణి చంద్రకళ, కుమార్తె చేతన తదితరులు పాల్గొన్నారు.