mphs
-
మా మంచి సారు.. నరేంద్ర..!
సాక్షి, విజయనగరం: మనిషి జీవితంలో తల్లితండ్రి తర్వాతి స్థానం గురువకే దక్కింది. అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు జ్ఞానబోధ చేసి.. పుట్టుకకు సార్థకత చేకూర్చుకునేందుకు మార్గం చూపిస్తాడు. అలాంటి గురువు పట్ల ఎల్లప్పుడు భక్తిశ్రద్ధలు కనబర్చాలి. ప్రస్తుత కాలంలో గురువులను వేధించే పిల్లలు.. విద్యార్థుల పట్ల కీచకులుగా మారిన కొందరు గురువులను చూడాల్సి రావడం నిజంగా దురదృష్టం. అయితే మంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంత బాగా గౌరవిస్తారో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నరేంద్రకు వేరే ఊరికి బదిలి అయ్యింది. మల్లుగూడ మండల ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి బదిలీపై వెళ్లిన నరేంద్రకు ఆ గ్రామ గిరిజనులు పెద్ద ఎత్తున వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడిని తమ భుజాలపై ఎత్తుకుని ఆనందోత్సాహాల నడుమ ఊరేగించారు. గతంలో ఇటువంటి సంఘటన ఈ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో జరగలేదని అతడి తోటి ఉపాధ్యాయులు, మండల ప్రజలు అభినందించారు. (చదవండి: స్కూల్ టీచర్.. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా) నరేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ పదేళ్ళకాలంలో క్రమశిక్షణతో మెలిగి రోజువారీ విధులకు హాజరై విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రజల ఆదరణ పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఊరేగింపుగా తీసుకు వెళుతూ ఆనందోత్సవాల మధ్య వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
క్లర్క్ ఔదార్యం.. 45 మంది జీవితాల్లో వెలుగు
బెంగళూరు : ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పద’ని నానుడి. కానీ నేటి కాలంలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పూట భోజనం పెట్టి కడుపు నింపే కన్నా జీవితాంతం కడుపు నింపుకునేందుకు కావాల్సిన ఉపాధిని చూపే, విద్యను దానం చేస్తే వారికి మాత్రమే కాక మరో పది మందికి కూడా సాయం చేసిన వారు అవుతారు. కానీ ఇందుకోసం ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కోట్ల కొద్ది సంపద ఉన్న వారు కూడా ఇలాంటి సాయం చేయడానికి ముందుకు రారు. కానీ కర్ణాటక కలబుర్గి పట్టణానికి చెందిన ఒక గుమస్తా ఇలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే జీతం కొంచమే అయినా దానితోనే 45 మంది పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. వివరాల ప్రకారం.. కలబుర్గి, మక్తాంపురాకు చెందిన బసవరాజ్ స్థానిక మండల్ పరిషత్ హై స్కూల్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. బసవరాజ్ కుమార్తె ధనేశ్వరి అనారోగ్య కారణాల వల్ల ఏడాది క్రితం మరణించింది. దాంతో కూతురు జ్ఞాపకార్థం ఓ 45 మంది ఆడపిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు బసవరాజ్. ఈ విషయం గురించి ఫాతిమా అనే విద్యార్ధి చెబుతూ ‘మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్లం. పాఠశాల ఫీజు చెల్లించడం మాకు చాలా కష్టం. కానీ బసవరాజ్ సార్ మా కష్టాన్ని తొలగించారు. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సార్ చేస్తున్న సాయం చూసి ఆయన కూతురు ఆత్మ ఎంతో సంతోషిస్తుంటుంది’ అని తెలిపారు. -
ఎంపీహెచ్ఎస్ పదోన్నతులకు బ్రేక్
లక్షలు చేతులు మారాయనడంలో వాస్తవం లేదు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం ఆర్డీ షాలినీదేవి కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : వైద్య ఆరోగ్య శాఖ జో¯ŒS–2 పరిధిలో జరగాల్సిన ఎంపీహెచ్ఎస్ పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘పదోన్నతుల్లో మాయాజాలం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన పదోన్నతుల పక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పదోన్నతులు నిర్వహిస్తామని ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ షాలినీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్ఎస్ పదోన్నతులకు సంబంధించి లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. పదోన్నతులకు సంబం«ధించి ఎవరు చెప్పినా ఏ ఒక్కరికీ డబ్బులు ఇవ్వవద్దని ఉద్యోగులందరికీ పదేపదే చెప్పామన్నారు. ఆయా జో¯ŒSల పరిధుల్లోని యూనియన్ల నుంచి ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలూ కూడా రాలేదని తెలిపారు. పదోన్నతులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జీవో నంబర్–68 ప్రకారం కులధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉందన్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఉద్యోగులను మూడుసార్లు అడిగామని వివరించారు. వారు దాఖలు చేయకపోవడంతో పదోన్నతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో మిగిలినచోట్ల భర్తీపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే పదోన్నతుల ప్యానల్ ఆమోదం మేరకు ఎంపీహెచ్ఎస్ పదోన్నతులను చేపట్టామని తెలిపారు. పీహెచ్సీల్లో సమర్థవంతమైన సేవలందించే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పదోన్నతులు చేపట్టామని వివరణ ఇచ్చారు. పదోన్నతులకు సంబంధించి ఏ దశలోనూ ఎవ్వరికీ సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్డీ షాలినీదేవి పేర్కొన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలు సృష్టిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.