- లక్షలు చేతులు మారాయనడంలో వాస్తవం లేదు
- కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం
- ఆర్‌డీ షాలినీదేవి
ఎంపీహెచ్‌ఎస్ పదోన్నతులకు బ్రేక్
Published Mon, Jan 16 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) :
వైద్య ఆరోగ్య శాఖ జో¯ŒS–2 పరిధిలో జరగాల్సిన ఎంపీహెచ్‌ఎస్ పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘పదోన్నతుల్లో మాయాజాలం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన పదోన్నతుల పక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పదోన్నతులు నిర్వహిస్తామని ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ షాలినీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్‌ఎస్ పదోన్నతులకు సంబంధించి లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. పదోన్నతులకు సంబం«ధించి ఎవరు చెప్పినా ఏ ఒక్కరికీ డబ్బులు ఇవ్వవద్దని ఉద్యోగులందరికీ పదేపదే చెప్పామన్నారు. ఆయా జో¯ŒSల పరిధుల్లోని యూనియన్ల నుంచి ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలూ కూడా రాలేదని తెలిపారు. పదోన్నతులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జీవో నంబర్–68 ప్రకారం కులధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉందన్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఉద్యోగులను మూడుసార్లు అడిగామని వివరించారు. వారు దాఖలు చేయకపోవడంతో పదోన్నతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో మిగిలినచోట్ల భర్తీపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే పదోన్నతుల ప్యానల్ ఆమోదం మేరకు ఎంపీహెచ్‌ఎస్ పదోన్నతులను చేపట్టామని తెలిపారు. పీహెచ్‌సీల్లో సమర్థవంతమైన సేవలందించే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పదోన్నతులు చేపట్టామని వివరణ ఇచ్చారు. పదోన్నతులకు సంబంధించి ఏ దశలోనూ ఎవ్వరికీ సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్‌డీ షాలినీదేవి పేర్కొన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలు సృష్టిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
Advertisement