MRPL
-
రైట్స్ బైబ్యాక్‌కు.. రైట్‌రైట్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రభుత్వ రంగ కంపెనీ.. రైట్స్(RITES) లిమిటెడ్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 265 ధర మించకుండా 9.69 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 257 కోట్లను వెచ్చించనున్నట్లు మినీరత్న కంపెనీ రైట్స్ తాజాగా వెల్లడించింది. 2018 జులైలో లిస్టయిన ఈ పీఎస్యూలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 72 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్నట్లు రైట్స్ చైర్మన్, ఎండీ రాజీవ్ మెహ్రోత్రా తెలియజేశారు. అంతేకాకుండా రుణరహిత కంపెనీ కావడంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు వివరించారు. ఇది కంపెనీ వృద్ధి అవకాశాలు, పటిష్టతపట్ల యాజమాన్యానికున్న నమ్మకానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో రైట్స్ షేరు 0.8 శాతం పుంజుకుని రూ. 255 వద్ద స్థిరపడింది. ఎంఆర్‌పీఎల్ వారాంతాన జరిగిన వార్షిక సమావేశంలో భాగంగా రూ. 5,000 కోట్లవరకూ నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్) తెలియజేసింది. ఇందుకు వీలుగా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు), బాండ్లు తదితరాల జారీని చేపట్టే వీలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్ షేరు ఎన్ఎస్ఈలో శుక్రవారం దాదాపు యథాతథంగా రూ. 29 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ చేతికి ఎమ్ఆర్పీఎల్ !
న్యూఢిల్లీ: మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎమ్ఆర్పీఎల్) కంపెనీని కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్ వెల్లడించింది. నగదు, షేర్ల మార్పిడి రూపేణా ఎమ్ఆర్పీఎల్ను కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా చెప్పారు. కాగా హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ టేకోవర్ తర్వాత ఓఎన్జీసీకి రెండు రిఫైనరీ అనుబంధ సంస్థలు– హెచ్‌పీసీఎల్, ఎమ్‌ఆర్‌పీఎల్‌లు ఉంటాయి. హెచ్‌పీసీఎల్‌ను స్వతంత్ర లిస్టెడ్ కంపెనీగా కొనసాగించాలని, డౌన్‌స్ట్రీమ్ విభాగాలన్నింటినీ హెచ్‌పీసీఎల్ నేతృత్వంలోకి తీసుకురావాలని కూడా ఓఎన్జీసీ యోచిస్తోంది. త్వరలో విలీన నిర్ణయం.. హెచ్పీసీఎల్లో ఎమ్ఆర్పీఎల్ విలీనాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవలే ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్ కూడా చెప్పారు. రెండు కంపెనీల బోర్డ్‌లు దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. ఎమ్ఆర్పీఎల్లో ఓఎన్జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. సోమవారం నాటి ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఓఎన్జీసీ వాటా షేర్లను హెచ్‌పీసీఎల్ రూ.16,000 కోట్లకు కొనుగోలు చేయవచ్చు. లేదా షేర్ల మార్పిడి రూపంలో అయినా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఎమ్ఆర్పీఎల్లో వాటాను వదులుకోవడం ద్వారా మరిన్ని హెచ్‌పీసీఎల్ షేర్లను ఓఎన్జీసీ పొందే అవకాశాలుంటాయి. ఇక మూడో ఆప్షన్.. ఈ రెండింటిని కలగలపడం.. ఇదే అత్యుత్తమమైన మార్గమని సురానా చెబుతున్నారు. మూడో రిఫైనరీ... హెచ్‌పీసీఎల్‌కు ఎమ్ఆర్పీఎల్ మూడో రిఫైనరీ అవుతుంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌కు ముంబై, విశాఖల్లో రెండు రిఫైనరీలున్నాయి. ఓఎన్జీసీలో హెచ్‌పీసీఎల్ విలీనం పూర్తయితే. హెచ్‌పీసీఎల్‌కు చెందిన 23.8 మిలియన్ టన్నుల వార్షిక రిఫైనరీ సామర్థ్యం ఓఎన్జీసీ పరమవుతుంది. 15 మిలియన్ టన్నుల ఎమ్ఆర్పీఎల్ రిఫైనరీ సామర్థ్యాన్ని కూడా కలుపుకుంటే, భారత్‌లో మూడో అతి పెద్ద ఆయిల్ రిఫైనరీగా (రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ) ఓఎన్జీసీ అవతరిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎమ్ఆర్పీఎల్ తమ చేతికి వస్తే, హెచ్‌పీసీఎల్ మరింత పటిష్టమవుతుందని ముకేశ్ కుమార్ సురానా చెప్పారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న దానికంటే అధికంగా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తోందని, ఎమ్ఆర్పీఎల్ తమ చేతికి వస్తే, ఈ లోటు భర్తీ అవుతుందని వివరించారు. ఎమ్ఆర్పీఎల్ తమకు తెలియని కంపెనీయేమీ కాదని సురానా చెప్పారు. -
ఎంఆర్పీఎల్లో వాటాల విక్రయం
న్యూఢిల్లీ: కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన మేరకు ఎంఆర్పీఎల్లో తమకున్న వాటాల్లో కొద్ది మేర ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ విక్రయించే అంశాన్ని పరిశీలించనున్నాయి. ప్రస్తుతం ఎంఆర్పీఎల్లో ప్రజల వాటా 11.42 శాతం మాత్రమే ఉంది. ఓఎన్జీసీకి 71.63 శాతం, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల మేరకు లిస్టెడ్ కంపెనీలో కనీస ప్రజల వాటా 25 శాతం ఉండాలి. వచ్చే ఏడాది ఆగస్ట్‌కి ఈ నిబంధనను అమలు పరచాలని సెబీ ప్రభుత్వ రంగ సంస్థలకు గడువు నిర్దేశించింది. దీంతో వచ్చే నెల 1న బోర్డు సమావేశమై పబ్లిక్ వాటా పెంచేందుకు అవకాశాలను పరిశీలించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ప్రమోటర్లు (ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్) తమ వాటాను కొద్దిగా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించడం లేదా పబ్లిక్ ఆఫర్ ద్వారా తాజా షేర్లను జారీ చేయడం కంపెనీ ముందున్న మార్గాలుగా వెల్లడించారు.