Mudapaka lands
-
MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.కేబినెట్ అత్యవసర భేటీ..మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి -
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
ఆ రికార్డులెక్కడ?
⇒ముదపాక భూముల్లో మరో కోణం ⇒రెవెన్యూ అధికారుల పనేనని అనుమానం ⇒మలుపులు తిరుగుతున్న కుంభకోణం ⇒భూములను పరిశీలించిన కలెక్టర్, జేసీ విశాఖపట్నం/పెందుర్తి : పెను సంచలనం రేపిన పెందుర్తి మండలం ముదపాక భూముల వ్యవహారంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. దళితులకు చెందిన వందల ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేయడానికి కొంతమంది అధికార పార్టీ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, సాక్షిలో పలు కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చ జరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో వెంకటేశ్వరరావు, వుడా అధికారులు ముదపాక వెళ్లి వివాదాస్పద అసైన్డ్ భూములను సందర్శించారు. రెవెన్యూ, వుడా అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. అధికారిక రికార్డులెక్కడ ఈ అసైన్డ్ భూములకు చెందిన అధికారిక రికార్డులు లేవని సాక్షాత్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. దీంతో వందల కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి వేసిన స్కెచ్‌లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిం చారన్న ఆరోపణలు ఆది నుంచీ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన కొంతమంది పెద్దలు ఎకరం రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ భూములను విక్రయించకపోతే ప్రభుత్వమే స్వాధీనం చేసేసుకుంటుందని, అప్పుడు ఈ సొమ్ము కూడా దక్కకుండా పోతుందని భయపెట్టారు. బెదిరించి అక్రమంగా కొందరు భూముల్లోంచి రోడ్డు కూడా వేసేశారు. అది నిజమేనేమోనని నమ్మిన రైతులు తమ భూములు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలా 236 మంది రైతుల నుంచి 280 ఎకరాల భూమిని కొనుగోలుకు ‘పెద్దలు’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున అడ్వాన్సుగా చెల్లించి వారి నుంచి ముందస్తుగా తెల్లకాగితాలు, ప్రాంసరీనోట్లపై సంతకాలు చేయించుకున్నారు. వుడా ఎంట్రీతో ఉలిక్కపడ్డ రైతులు చివరకు తమ నుంచి కొనుగోలు చేస్తున్న భూములను వుడా భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) కు ఎకరం కోటి రూపాయలకు ఇస్తున్నారన్న సంగతి తెలుసుకుని సదరు రైతులు షాక్ తిన్నారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, రైతులు ఏకమై పత్రికలు, బీజేపీ శాసనసభా పక్షనేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజును ఆశ్రయించారు. దీనిపై సాక్షిలో ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీ ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ బాగోతంలో అధికార పార్టీ పెద్దలు, రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జేసీ, ఆర్డీవో, తహసీల్దార్లను వెంటబెట్టుకుని ముదపాక భూములను పరిశీలించారు. అనంతరం ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన అధికారిక రికార్డులు లేవని, ఎంజా య్మెంట్ సర్వేకు ఆదేశించామని కుండబద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డులు మాయం వెనక రెవెన్యూ అధికారులున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.