Muhurtham finalized
-
మోగనున్న పెళ్లి బాజాలు
పామర్రు/వత్సవాయి: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలూ గుర్తుండిపోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. మూఢం, ఆషాఢం ముగియడంతో మళ్లీ ముహూర్తాల సందడి మొదలైంది. మార్చి నెల వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగ ఉండటంతో ఆ నెలలో ముహూర్తాలు ఉండవు. మళ్లీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు శుభకార్యాలకు మహూర్తాలు ఉన్నాయి. దీపావళి తర్వాత వద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలతో ఊరూవాడా కళకళలాడనున్నాయి.షాపింగ్ సందడిపట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్‌లు ప్రారంభించారు. పెళ్లి దుస్తుల కొనుగోలుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. బంగారు ఆభరణాలను తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభ లేఖల ప్రింటింగ్, ప్లెక్సీ ఫ్రింటర్స్, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్, వంట మేస్త్రిలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, భజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడి పడిన ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరుకుతోంది. ఆర్థికంగా స్తోమతు ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తర గతి వారు కూడా తమస్థాయికి తగ్గట్లు పెళ్లి వేడు కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.రాజీ లేకుండా..ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, రిసెన్షన్, పోస్టు వెడ్డింగ్ ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకలను శ్రీమంతులు రాజీ పడకుండా నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. కల్యాణ మండపాలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇటీవల పామర్రులో నిర్మించిన ఓ కళ్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకను సుమారు రూ.25 లక్షలు వెచ్చించి నిర్వహించారు.ఆధునిక సెట్టింగ్లుకల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సెట్టింగ్‌లు ఏర్పా టుచేస్తున్నారు. కల్యాణ మండపాల్లో రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా అక్కడయితే ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా, ఎవరి స్థాయిలో వారికి రంగుల హరివిల్లులా మండపాలు తీర్చి దిద్దుతున్నారు. వీటికి డిమాండ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు.ఫొటోగ్రఫీలో కొత్త పుంతలుముఖ్యంగా పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి నేడు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫొటోలు, వీడియో షూటింగ్‌లకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇటీవలన పెళ్లిళ్లలో డ్రోన్ కెమెరాలు విరివిగా వాడుతు న్నారు. ఎంత ఎత్తు నుంచి, ఎంత దూరం నుంచి అయినా క్వాలిటీ ఫొటోలు, వీడియో వస్తుండ టంతో డ్రోన్‌కు మరింత డిమాండ్ ఏర్పడింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ ఘాట్ అని రకరకాలుగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.మంగళవాయిద్యాలకు మంచి గిరాకీహిందూ సంప్రదాయంలో మంగవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పని సరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా ఖర్చుచేస్తున్నారు. పెళ్లిళ్లో భోజనాల సంగతి సరేసరి. కొత్త కొత్త వైరెటీలకు ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. రకరకాల బిరియానీలు, స్వీట్లు, కారా, కూరలు ఉంటాయి. ఎంచుకున్న మెనూ బట్టి ప్లేట్‌కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వంటలు వడ్డిచ్చే వారికి కూడా డిమాండ్ ఉంది. పెళ్లిళ్లు చేయించే పురోహితులకు డిమాండ్ బాగా ఉంది.శుభ ముహూర్తాలు ఇవీ..అక్టోబర్ (ఆశ్వయుజ మాసం) : 26, 27నవంబర్ (కార్తిక మాసం) : 3, 7, 8, 10, 14, 16, 17, 20, 22, 27, 28డిసెంబర్ (మార్గశిర మాసం) : 4, 5, 6, 7, 8, 11, 12, 14, 15, 19, 20, 21, 26, 27, 28జనవరి (మాఘ మాసం) : 31ఫిబ్రవరి (మాఘ మాసం) : 2, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 26మార్చి (ఫాల్గుణ మాసం) : 2, 6, 9, 12, 15, 16 -
Ayodhya: శోభాయమానం.. రామమయం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్‌స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది... దర్శనాలకు బ్రేక్ తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. విమానాల వరద... అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్‌కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్‌నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు. 2 నెలలు..2 కోట్ల మంది! రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్‌సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్‌సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఫొటోలు లీకయ్యాయి: పూజారి ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. యజమానులుగా 14 మంది దంపతులు ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు. జైషే బెదిరింపులు ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి. ‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రసాదాలు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. -
16న రాహుల్‌కు పగ్గాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47)పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయింది. తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి ఈ నెల 16వ తేదీన అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియామక ఉత్తర్వులు అందుకుంటారని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ సహా అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు రాహుల్‌కు అనుకూలంగా వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 10వ తేదీతో ముగిసింది. దీంతో రాహుల్ నామినేషన్ మాత్రమే ఉండటంతో ఆయన్ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజులు ముందుగా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఈ ఎన్నికల్లో గనుక విజయం సాధిస్తే రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు. క్లిష్ట సమయంలో రాహుల్ రాక.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్ధ శతాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ప్రాభవం మసకబారిన క్లిష్ట సమయంలో రాహుల్ బాధ్యతలు చేపడుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ పార్టీని పునర్వ్యవస్థీకరించటం రాహుల్ ముందున్న సవాల్ అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాసేన్ తెలిపారు. ఆ వారసత్వంలోనే.. నెహ్రూ–గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. అభివృద్ధి ఎజెండాను మోదీ విస్మరించారు డకోర్: ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను పక్కనపెట్టారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ శనివారం చేసిన ప్రసంగంలో 90 శాతం సమయం తన గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నోటి నుంచి నోట్ల రద్దు, జీఎస్టీపై ఒక్కమాట కూడా రాలేదన్నారు. గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రన్ఛోడ్ రాయ్‌జీ శ్రీకృష్ణ మందిరాన్ని రాహుల్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మోదీ తన ప్రచార ఎజెండాను తరచుగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. తొలుత నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి ప్రచారం చేయాలనుకున్నారనీ.. కానీ నీటి సరఫరా ఆగిపోవడంతో ఓబీసీల రిజర్వేషన్ అంశంపై ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని రాహుల్ తెలిపారు. బీజేపీ తమకు చేసిందేమీ లేదని ఓబీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో మళ్లీ అభివృద్ధి ఎజెండాను ఎత్తుకుందన్నారు. -
వచ్చే ఏడాది వారసుడొస్తాడు!
నందమూరి అభిమానులకు శుభవార్త. వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నాడు. తనయుడి ఎంట్రీకి బాలకృష్ణ ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే... ఆ సినిమాకు దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? అనే వివరాలను చెప్పలేదు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది వారసుడి తొలి సినిమా ప్రారంభమవుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.