mukkoti ekadasi
-
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. అశేష భక్త జనం నడుమ స్వర్ణరథంపై తిరుమలేశుడు (ఫొటోలు)
-
స్వామి వారి ఉత్తరద్వారం దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
-
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి
-
ముక్కోటి శోభ
-
వైకుంఠ ద్వార దర్శనం.. ముక్తికి మార్గం
వెదురుపాక(రాయవరం) : వైకుంఠ ద్వార దర్శనం ముక్తి కి మార్గమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తులనుద్దేశించి గాడ్ మాట్లాడుతూ శ్రీవైష్ణవ క్షేత్రాల్లో దేవతల కాల ప్రమాణాలను బట్టి ఏడాదిలో రెండు భాగాలైన దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయనం పగలుగా ఉంటాయన్నారు. ఈ మకర సంక్రమణ ఉత్తరాయన ప్రవేశానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారన్నారు. ముక్కోటి ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజున లభించేలా చేసేదే ముక్కోటి ఏకాదశిగా అన్నారు. ఈ పర్వదినాన వైష్ణవాలయాల్లో శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి వారికి పీఠబ్రహ్మ కోట వీరవెంకటసత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. -
నృసింహాలయంలో ‘ముక్కోటి’ శోభ
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ‘ముక్కోటి ఏకాదశి’ శోభ సంతరించుకుంది. రెండు రోజులుగా ఆలయంలో ‘ముక్కోటి’ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు పేర్కొన్నారు. ఈ రోజున వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమన్నారు. వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని సుమారు లక్ష మందికి పైగా భక్తులు లక్ష్మీ నారసింహుని వైకుంఠ ద్వారం(ఉత్తర గోపురం) గుండా ఆదివారం దర్శించుకుంటారని ఆలయ, పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానికులే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులతో హాజరైతే మరింత శుభదాయకమని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి సూచించారు. భక్తుల కోసం ఆలయంలోనే కాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. -
భద్రాద్రిలో కన్నుల పండులగా తెప్పోత్సవం
-
భద్రాద్రిలో వైభవంగా ముక్కోటివైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
-
ముస్తాబైన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాలకు శ్రీరామ దివ్య క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. శనివారం తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో స్వామివారు దర్శనమిస్తారు. భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో ఉత్తరద్వారంలో దర్శనమిచ్చే శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తులు ప్రగాఢవిశ్వాసం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెప్పోత్సవం జరిగే గోదావరి స్నానఘట్టాల రేవు పరిసరాలను శుభ్రం చేశారు. ఉత్సవాన్ని తిలకించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోదావరి ఘాట్‌లో సెక్టార్లను ఏర్పాటు చేసి బారీకేడ్లను అమర్చారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు స్వామివారు ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదావరి తీరానికి బయలుదేరుతారు. హంసవాహనం మాదిరి తయారు చేసిన లాంచీపై స్వామివారు కొలువుదీరి నదిలో విహరిస్తారు. రేపు వైకుంఠ ద్వార దర్శనం.. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున శ్రీ సీతారామచంద్రస్వామివారు ఉత్తరద్వారంలో దర్శనమిస్తారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారు ఇలా ఉత్తరద్వారానికి వేంచేస్తారు. వైకుంఠద్వారంగా పిలిచే ఈ ఉత్తరద్వారంలో స్వామివారిని తిలకిస్తే మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఉత్తరద్వారంలో స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం వారు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఉత్తర ద్వారం ముందు భాగాన్ని వీవీఐపీ, వీఐపీ, ఇతర సెక్టార్లుగా విభజించి టిక్కెట్లు విక్రయిస్తున్నారు. వీవీఐపీ టిక్కెట్లు కేవలం ఆర్డీవో ద్వారానే విక్రయిస్తున్నారు. మిగతా టిక్కెట్లను బ్యాంకులతో పాటు దేవస్థానంలోని ప్రత్యేక కౌంటర్లలోనూ ఇస్తున్నారు. ముక్కోటి విశిష్టత ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణుని పూజించే రోజే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఆశాఢ శుద్ధ ఏకాదశి నుంచి జగద్రక్షణ చింతనయను యోగ నిద్ర లో ఉన్న శ్రీ మహావిష్ణువు మరలా కార్తీకశుద్ధ ఏకాదశి నాడు మేల్కొని బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చే రోజే ముక్కోటి ఏకాదశి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి మోక్షం ప్రసాదించుట చేత ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని కూడా పేరు. ఎంతో పవిత్రమైన ఈ రోజున (శనివారం) ఉత్తరద్వారంలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణువును ఎవరైతే సేవిస్తారో వారికి భగవాదానుగ్రహం, మోక్షం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. -
ముక్కోటికి 470 ప్రత్యేక బస్సులు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవం సందర్భంగా భద్రాచలానికి 470 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు భద్రాచలం ఆర్టీసీ డిపో జనరల్ మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు తెలిపారు. భద్రాచలంలో 10, 11వ తేదీలలో జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తరద్వార దర్శన వేడుకల కోసం ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. తన చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ముక్కోటితో పాటు సంక్రాంతి పర్వదినం సెలవులు కూడా వస్తుండటంతో భక్తులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో భద్రాచలం వచ్చే అవకాశం ఉండటంతో పెద్దమొత్తంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. భద్రాచలం డిపో నుంచి 50 బస్సులు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలకు, ఇల్లెందు నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలానికి 70 బస్సులు, ఖమ్మం నుంచి కొణిజర్ల, వైరాల మీదుగా 40 బస్సులు, మణుగూరు నుంచి 15, మధిర నుంచి వైరా మీదుగా 16, సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట మీదుగా 14 బస్సులను నడుపుతామన్నారు. కృష్ణాజిల్లా నుంచి 75, గుంటూరు నుంచి 10, ఉభయగోదావరి జిల్లాల నుంచి 78, నల్లగొండ నుంచి ఐదు, వరంగల్ నుంచి 15 సర్వీసులను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తంగా జిల్లాలో 215, ఇతర జిల్లాల నుంచి 255 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశామన్నారు. గతేడాది ముక్కోటికి ఆర్టీసీకి జిల్లా నుంచి రూ.24.75 లక్షలు వచ్చిందన్నారు. ఈ ఏడాది రూ.30 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాదికంటే టికెట్ల ధరలు పెరగడం, సంక్రాంతి సెలువులు కూడా కలిసి వస్తుండటంతో లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చని భావిస్తున్నామన్నారు. భద్రాచలం బస్టాండ్ నుంచి పావుగంటకో సర్వీస్ చొప్పున దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు బయలుదేరి వెళ్తుందని డీఎం చెప్పారు. డిపోలో ప్రత్యేక టెంట్ వేసి ప్రయాణికులకు బస్సులు-వేళలకు సంబంధించిన సమాచారం తెలిసేలా ప్రకటన చేయిస్తామన్నారు. ఇదే ఏర్పాటు పర్ణశాలలోనూ ఉంటుందన్నారు. ముక్కోటికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులతో మాట్లాడి భద్రాచలం బస్టాండ్‌లో ప్రత్యేక లడ్డూ కౌంటర్‌ను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఆరోగ్యకేంద్రం, ఆర్టీసీ విచారణ కేంద్రం, ప్రత్యేక వాటర్‌ట్యాంక్‌ను సిద్ధం చేశామన్నారు. ప్రయాణికుల కోసం 40 తాత్కాలిక మరుగుదొడ్లను సిద్ధంచేశామన్నారు. ముక్కోటి సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక విధులను అప్పగిస్తున్నట్లు చెప్పారు. డీఎంతో పాటు సీఐ దేవరాజ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తులందరికీ ప్రశాంత దర్శనం
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జనవరి 11న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులు సైతం ప్రశాంతంగా, నయనానందకరంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం.రఘునాథ్ తెలిపారు. సోమవారం ఆయన ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి రోజు న వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధ్యయనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూల అలంకరణకు, వైదిక పనుల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం దేవస్థానం నుంచి రూ.32 లక్షలు కెటాయిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గ్రామపంచాయతీ తరఫున మరో రూ.10 లక్షలు విడుదల చేయనున్నారని వివరించారు. తెప్పోత్సవం, ముక్కో టి ఏకాదశికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకు తగ్గట్టుగా 3 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. భక్తులు లడ్డూల కోసం ఇబ్బంది పడకుండా ఆలయ ప్రాకారం ఎదురుగా క్యూలైన్ల వద్ద 5 లడ్డూలు రూ.50కి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవానికి వినియోగించే లాంచీ హంసాలంకరణను జనవరి 5, 6 నాటికి సిద్ధం చేసి ట్రయల్ రన్ చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారన్నారు. గతేడాది జరిగిన లోటుపాట్లను సరిచేసుకొని ఈ ఏడాది ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని, అందుకు కావల్సిన సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. అధ్యయనోత్సవాలకు ‘సురభి’ శోభ... అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగల్‌పత్తు ఉత్సవాలలో సురభి కంపెనీ వారిచే ప్రఖ్యాత నాటకాల ప్రదర్శనకు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. మిథిలా స్టేడియం వద్ద జనవరి 1, 10 తేదీలలో మాయాబజార్, 2న శ్రీవీరబ్రహ్మంగారి చరిత్ర, 3న సతీ అనసూయ, 4న భక్తప్రహ్లాద, 5, 8 తేదీలలో జైపాతాళ భైరవి, 6న బాలనాగమ్మ, 7న లవకుశ, 9న శ్రీకృష్ణలీలలు నాటకాలు ఉంటాయని వివరించారు. వీటితో పాటు స్థానిక కళాకారులచే సాంసృ్కతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. జనవరి 5 నుంచి రూ.500 టికెట్ల విక్రయం... వైకుంఠ ద్వార దర్శనానికి రూ.800 విలువ గల వీఐపీ టికెట్లు 600, రూ.500 టిక్కెట్లు 2580, రూ250.టికెట్లు 650 సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో వీఐపి టిక్కెట్లను ఆర్డీవో ఆధ్వర్యంలో అమ్మనున్నారని, రూ 500, 250 విలువైన టికెట్లు జనవరి 5న దేవస్థాన కార్యాలయంలో అమ్మకానికి పెట్టనున్నట్లు చెప్పారు. 7 నుంచి కల్యాణ మండపం, ఇతర ప్రదేశాలలో టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టిక్కెట్ల ఆన్లైన్ విక్రయానికి నిక్ సంస్థ ఆధ్వర్యంలో ఎండోమెంట్ శాఖ చేపట్టిన టెక్నికల్ సేవలు వచ్చే శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఏఈ రవీందర్, అర్చకులు విజయ రాఘవన్, శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు.