Mukkoti Ekadasi Festival
-
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. అశేష భక్త జనం నడుమ స్వర్ణరథంపై తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్త జనసందోహం (ఫొటోలు)
-
Tirumala Vaikunta Ekadasi Pics: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి దర్శనం కోసం భక్త జనసందోహం (ఫొటోలు)
-
వాడపల్లి వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి
-
తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
-
సింహాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
-
నామాలగుండు వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
-
స్వామి వారి ఉత్తరద్వారం దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
-
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో.. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ. గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. అదనంగా.. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది. ఇక తిరుమల వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వై..వి. సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. ముందుగా నిర్ణయించిన మేరకే ఉదయం 6 గంటలకు సర్వ దర్శనం ప్రారంభించాం. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుమల రావాలి. ఆన్ లైన్ లో రోజుకు 20 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేశాం. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వ దర్శన టోకెన్లు నాలుగున్నర లక్షలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో స్వర్ణ రథంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రిలో తొలిసారి.. యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మానం తర్వాత తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నార లక్ష్మీనరసింహ స్వామి. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసానుంది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు జిల్లా చిన్నతిరుపతి ద్వారకా తిరుమల ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్నారు భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఇరుముడి సమర్పిస్తున్నారు గోవింద స్వాములు. భద్రాచలం రాములోరి చెంత.. భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేదఘోష నడుమ తెరుచుకుంది వైకుంఠ ద్వారం. ఉదయం 5.01 గంటల నుంచి 5.11 గంటల వరకు వినతాసుత వాహన కీర్తన నాదస్వరం నిర్వహించారు. ఉదయం 5.11 గంటల నుంచి 5.21 గంటల వరకు ఆరాధన, శ్రీరామ షడ క్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. 5.30 గంటల నుంచి 5.40 గంటల వరకు స్థానాచార్యులచే ద్వార దర్శన ప్రాశస్తం చెప్పబడింది.ఆ తర్వాత 108 ఒత్తులతో హార తినిస్తూ శరణాగతి గద్యవిన్నపం చేశారు. ఉదయం 6 గంటలకు అదిగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి శ్రీ స్వామి వారి ఉత్థాపన జరిగింది. ఆపై భక్తులకు స్వామి మూలవరుల దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలో భక్తుల కిటకట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు. రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు హరి హరులు. స్వామి వార్లను దర్శించుకున్నారు భక్తులు. ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కొలువు దీరాడు జగదభి రాముడు. తెల్లవారు జామున 5 గంటల నుండి సీతానాయకుని దర్శనం కోసం పోటెత్తింది భక్తజనం. గోవింద నామ స్మరణతో మార్మోగుతోంది కోదండ రామాలయం. ఇక.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలి గడప దేవుని కడపలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు ఓరుగల్లు ఆలయాలకు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వార ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బట్టలబజార్ లోని బాలానగర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు. హన్మకొండ ఎక్సైజ్ కానీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారా ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. -
రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
వైకుంఠ ఏకాదశినాడు తిరువీధిలో ఉత్సవం
-
ఏపీలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
-
ముక్కోటి నిరాడంబరమే
సాక్షి, హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి.. ఈ రోజున వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంటాయి. ఆయా దేవాలయాలు ప్రత్యేక అలంక రణలతో అలరిస్తాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో ఈసారి దేవాలయాల్లో ఆడంబరాలు లేకుండా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వ బోతున్నారు. చిన్న చిన్న దేవాలయాల్లో భక్తులకు ప్రవేశం ఉన్నా, పెద్ద దేవాలయాల్లో ఆంతరంగిక వేడుకగానే నిర్వహించనున్నారు. తెలంగాణలో వైకుంఠ ఏకాదశికి పరవశించే భద్రాద్రిలో ఈ వేడుకను పూర్తిగా ఆంతరంగికంగా నిర్వహిస్తున్నారు. సాధారణ భక్తులకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వట్లేదు. చదవండి: (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అర్చకస్వాములు, వేదపండితుల సమక్షంలో ఉదయం 4 గంటలకే ఉత్తర ద్వారం వద్ద ఎప్పటిలాగానే వేడుకలు నిర్వహించనున్నారు. పూజాధికాల తర్వాత ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు. అక్కడ సాధారణ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉత్సవాల చివరి రోజైన గురువారం నిర్వహించిన తెప్పోత్సవాన్ని గోదావరిలో కాకుండా దేవాలయం వద్దే చిన్న నీటి గుండాన్ని నిర్మించి నిర్వహించారు. ఇక, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా కోవిడ్ నిబంధనలకు లోబడే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఉదయం 6–43 గంటలకు తూర్పుద్వారం గుండా స్వామి వారి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. కాగా, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఆరు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయం, శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, జియాగూడ రంగనాథ స్వామి దేవాలయాలతో పాటు అన్ని వైష్ణవాలయాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లా కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించనున్నారు. ప్రధాన దేవాలయాల్లో పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడ్డ భక్తులను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ స్థానిక సిబ్బందిని ఆదేశించారు. భద్రాచల అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. స్నానఘట్టాలను పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం రామాలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రామాలయంలో అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. రామయ్యను దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్నారు. అదేవిధంగా బాపు ఏర్పాటు చేసిన కుటీరం, విగ్రహాల వద్ద ‘ఇందిరమ్మ పచ్చ తోరణం’ పథకం ద్వారా మొక్కలను పెంచాలని సూచించారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాని ఐటీడీఏ పీఓ వీరపాండియన్‌కు సూచించారు. హైడల్ ప్రాజెక్టు పరిశీలన: దుమ్ముగూడెం గోదావరి నదీ బ్రాంచ్ ఆనకట్ట వద్ద నిర్మించిన విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మేనేజర్ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు అన్నీ పూర్తి అయ్యాయని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జేసీ సురేంద్రమోహన్, జెడ్పీసీఈఓ జయప్రకాష్, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహశీల్దార్ జి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఎస్సై సత్యనారాయణ, ఈఓఆర్డీ నాగేశ్వరరావు, కార్యదర్శి బొగ్గా నారాయణ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఫల్యాలు అధిగమించేనా...!
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 10, 11 తేదీల్లో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలు సాఫీగా సాగేనా...? గత వైఫల్యాలను ఈసారయినా అధికారులు అధిగమిస్తారా...? భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి. ఈ వేడుకలకు దాదాపు 50వేల మందికి పైగా భక్తులు రావచ్చని అంచనా. వీరందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ అధికారులు గుప్పిస్తున్న ప్రకటనలను.. గతానుభవాల దృష్ట్యా భక్తులు నమ్మడం లేదు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, ఉత్సవాలపై రెవెన్యూ పెత్తనం కారణంగా భక్తులు ఇబ్బందులపాలవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ గురువారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో.. గతంలో జరిగిన లోపాలను ఓసారి పరిశీలిద్దాం. ఉత్సవాలకు ఏర్పాట్లు చేయటంలో ప్రతిసారి ఆలస్యమవుతూనే ఉంది. తెప్పోత్సవం వరకు కూడా సౌకర్యాల పేరిట పనులు చేస్తుండటంతో నిధులు ఖర్చవుతున్నాయి తప్పితే భక్తులకు ఇబ్బందులు తొలగటం లేదు. ఉత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు టిక్కెట్లు దొరకటం లేదు. దీని కోసం ఉత్సవం రోజు సాయంత్రం వరకు కూడా సబ్ కలెక్టరేట్లో భక్తులు పడిగాపులు కాస్తుండటం పరిపాటిగా మారింది. గత ఏడాది సబ్ కలెక్టర్ భరత్ గుప్తా మూడు రోజుల ముందే వీటి విక్రయాలను ముగిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో విఫలమయ్యారు. ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లను సామాన్యులకు అందుబాటులో ఉంచటం లేదు. టిక్కెట్లను వీఐపీల పేరుతో ప్రజాప్రతినిధులు, వారి సిఫార్సులతో వచ్చే రాజకీయ పార్టీల నాయకులు తీసుకుంటున్నారు. గత ఏడాది వీఐపీ టిక్కెట్లు 600కుగాను ఎంపీ పేరిట 41, మంత్రి రాంరెడ్డి పేరిట 40, ఎమ్మెల్యే సత్యవతి పేరిట 29, ఇతర ప్రజాప్రతినిధులు, ట్రస్టు బోర్డ్ సభ్యులకు దాదాపు టిక్కెట్లన్నీ అప్పగించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రాచలంలో వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దేవస్థానం ఆధీనంలోని గదులతోపాటు పట్టణంలోని ప్రైవేటు లాడ్జీలన్నిటిని రెవెన్యూ అధికారులు స్వాధీనపర్చుకుని వీఐపీలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా సామాన్య భక్తులకు గదులు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దేవస్థానం ఆధ్వర్యంలో 356 గదులు ఉన్నాయి. వీటిలో గత ఏడాది.. పోలీసులకు-87, డీపీఆర్ఓ పేరిట-36, స్థానిక ఎమ్మెల్యే పేరిట-10, ఎంపీ పేరిట బోగాల శ్రీనివాసరెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడికి-4 కే టాయించారు. ముక్కోటి ఉత్సవాలను కవరేజీకిగాను మీడియా పాసులు జారీ చేస్తున్నప్పటికీ వారికి కేటాయించిన గ్యాలరీలో ఇతరులు కూర్చుంటున్నారు. మీడియా పాసులు కూడా పబ్లిసిటీ విభాగం అధికారులు ఇస్టానుసారంగా కేటాయిస్తున్నారు. ఏడాదికోమారు జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకిచేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అధికారులు మాత్రం హడావిడిగా.. మొక్కుబడి తంతుగా ముగించేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం అదే ద్వారం గుండా స్వామి వారి మూలవరుల దర్శనం కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ లైన్లలో పోలీసులు, వారి కుటుంబాలే ముందు వరుసలో కనిపిస్తున్నారు. స్వామి వారి ప్రసాదాల కోసం ప్రతిసారీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిని భక్తులు తెలుసుకునేలా తగిన ప్రచారం చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఉత్సవాల పేరిట ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను సరిగా పరిశీలించకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. -
ముక్కోటి ఏర్పాట్లు షురూ
భద్రాచలం, న్యూస్‌లైన్ : భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలంలో జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలకు పనులను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తర ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదే విధంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ల నిర్మాణపు పనులు ప్రారంభించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. వేడుకల్లో భాగంగా జనవరి 10న గోదావరి నదిలో స్వామి వారికి తెప్పోత్సవ ం జరుగుతుంది. ఆ మరుసటి రోజు(జనవరి 11) తెల్లవారుజామున స్వామి వారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తారు. ఇలా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా వీక్షిస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇందుకోసం తెప్పోత్సవం రోజునే దూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకొని ఇక్కడ బస చేస్తారు. ఈసంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న దేవస్థానం అధికారులు ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.35 లక్షలతో ఏర్పాట్లు : అంగరంగ వైభవంగా ముక్కోటి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిలో ఇంజినీరింగ్ పనులకు సుమారు రూ. 20 లక్షల వరకూ వెచ్చించనున్నారు. భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్ల నిర్మాణం, రామాలయం, ముక్కోటి ద్వారానికి రంగులు వేయటం, సెల్లార్ల నిర్మాణం, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులను ఇంజనీరింగ్ అధికారులు పర్యవే క్షించనున్నారు. మిగతా ఏర్పాట్లు ఆర్డీవో పర్యవేక్షణలో జరుగనున్నాయి. లాంచీపైనే తెప్పోత్సవం : ఈసారి గోదావరి నదిలో నిర్వహించే స్వామి తెప్పోత్సవం లాంచీపైనే జరుగనుంది. గోదావరి నదిలో లాంచీ తిరగేందుకు నీరు లేని పక్షంలో బల్లకట్ట వాహనంపై తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ప్రకారం లాంచీ తిరిగేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పటంతో ఇందుకనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై నేడు సమీక్ష : వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల నిర్వహణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో రఘునాథ్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో తలెత్తిన లోపాలను బేరీజు వేసుకొని ఈ ఏడాది చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ ఏటా ముక్కోటి ఏర్పాట్లల్లో లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఉత్సవాల రోజు వరకూ పనులు జరుగుతుండటం పెద్ద సమస్యగా మారుతోంది. అదేవిధంగా టిక్కెట్ల విక్రయాల్లో కూడా స్పష్టత లేకండా పోతోంది. ఉత్సవం జరిగే రోజు వ రకూ కూడా టిక్కెట్ల విక్రయాలు చేపట్టకపోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా టిక్కెట్లును సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచకుండా ఇక్కడి అధికారులు వీవీఐపీల సేవలోనే తరిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది టిక్కెట్లు మిగిలిపోవటం జరిగింది. దేవస్థానానికి పాలక మండలి కూడా లేకపోవటంతో సమస్యలపై ప్రశించే వారు కరువయ్యారు. దీంతో ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా తగిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ముందుగానే మేల్కొనాల్సిన అవసరం ఉంది.