Mukul Rohtagi
-
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న రోహత్గీ
-
ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వాడీవేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. తొలుత.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదు అయిన అంశాలపైనే హరీష్ సాల్వే వాదనలు(వర్చువల్)గా వినిపించారు. ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ సాల్వే. ఈ సెక్షన్ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. ఇక.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్ కస్టడీ అడుగుతున్నందునా.. ముందే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్‌కు తెలిపారు. మరో న్యాయవాది మను సింఘ్వీ.. యశ్వంత్ సిన్హా కేసు తీర్పును ఉదాహరించారు. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడే కేసు మెరిట్‌లోకి వెళ్లదల్చుకోలేదని బెంచ్ తెలిపింది. ఏకంగా క్వాష్ అడుగుతున్నారు ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జీఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్ అడుగుతున్నారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ధర్మాసనం వ్యాఖ్యలు చంద్రబాబు లాయర్లకు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించింది. 2015-16లో నేరం జరిగింది కదా ? . ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా?. మరోవైపు.. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటి ?. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్ ఇవ్వలేమని.. తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. రెండు వైపులా అఫిడవిట్ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి(9వ తేదీకి) వాయిదా వేసింది. -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్‌పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
అనూహ్యం.. అటార్నీ జనరల్‌గా మళ్లీ ఆయనే!
ఢిల్లీ: సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలోనూ అటార్నీ జనరల్‌గా సేవలందించిన ఆయన.. 2017లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహత్గి తదనంతరం కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే.. వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో.. తర్వాతి అటార్నీ జనరల్‌గా మళ్లీ ముకుల్ రోహత్గినే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. వాజ్‌పేయి టైంలోనూ అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేసిన రోహత్గిని.. తిరిగి అటార్నీ జనరల్‌గా నియమించడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వేణుగోపాల్(91) 2020లోనే బాధ్యతలు నుంచి తప్పుకోవాలనుకున్నారు. వయోభారం రిత్యా తనను తప్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం మాత్రం ఆయన్నే మరో దఫా కొనసాగాలని కోరింది. అయితే.. ఆ సమయంలోనే ఆయన రెండేళ్లపాటు మాత్రం ఉంటానని స్పష్టం చేశారు. ఇక గతంలో.. గుజరాత్ అల్లర్ల కేసుతో పాటు ప్రముఖ కేసులకు ప్రభుత్వాల తరపున వాదించారు ముకుల్ రోహత్గి. 2014లో అధికారంలోకి రాగానే ఏరికోరి బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం, అటార్నీ జనరల్‌గా రోహత్గిని నియమించుకుంది. 2017లో అటార్నీ జనరల్ పదవి నుంచి ఆయన్ని తప్పించి.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు పరిశీలన కోసం, ఇంకా కొన్ని సున్నితమైన అంశాల కోసం ఆయన సేవల్ని వినియోగించుకుంది. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారం కేసులో వాదించిన డిఫెన్స్ టీం బృందానికి నేతృత్వం వహించింది కూడా ఈయనే. ఇదీ చదవండి: హింసాద్వేషాలు దేశ సమస్యలకు పరిష్కారం కాదు -
'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడం పట్ల సమాజంలోగానీ, పార్లమెంటులోగానీ భారీ స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గత వారం మొత్తం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత రాగా కొంతమేరకు నిషేధం ఎత్తివేశారు. అయితే, పోర్న్ సైట్లను నిషేధించడం పట్ల కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపధ్యంలో ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. -
అటార్నీ, సొలిసిటర్ జనరళ్ల రాజీనామా
** నూతన ఏజీ, ఎస్జీలుగా హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీ? న్యూఢిల్లీ: కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో అటార్నీ జనరల్ గులామ్ ఎస్సాజీ వాహనవతి, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌లు రాజీనామా సమర్పించారు. కోర్టులలో ప్రభుత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, క్లిష్టమైన అంశాలపై న్యాయ సలహాలు ఇచ్చేందుకుగాను ఏజీ, ఎస్జీలను ప్రభుత్వం నియమించుకుంటుంది కాబట్టి.. ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి రాజీనామా ప్రక్రియ పూర్తి అయిందని, నూతన ప్రభుత్వం కొత్త ఏజీ, ఎస్జీలను నియమించుకుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త ఏజీ, ఎస్‌జీల నియామకం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా.. అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీలు, నూతన ఎస్జీగా రంజిత్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యూపీఏ-1లో ఐదేళ్లపాటు ఎస్జీగా వాహనవతి పనిచేశారు. ఏజీగా నియమితులైన తొలి ముస్లిం కూడా వాహనవతియే కావడం గమనార్హం. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యావాది అయిన మోహన్ పరాశరన్‌ను యూపీఏ సర్కారు 2004లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా, గతేడాది ఫిబ్రవరిలో ఎస్జీగా నియమించుకుంది.