Mumbai Gang Rape
-
వారు నన్నూ రేప్ చేశారు
ముంబై: ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల నేరాల చిట్టా రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వారిలో కొందరు తనపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి(19) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫొటో జర్నలిస్ట్ రేప్ జరిగిన శక్తి మిల్స్ ప్రాంగణంలోనే తనపై వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. సోమవారం ఆమె ఈ మేరకు భాండప్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ వినాయక్ దేశ్‌ముఖ్ తెలిపారు. ‘జూలై 31న ఆమె తన స్నేహితుడితో ఓ పని మీద మహాలక్ష్మి ఏరియాకు వెళ్లింది. అక్కడ కొందరు ఫొటో జర్నలిస్ట్ కేసులో చేసినట్లుగానే వీరినీ మోసపుచ్చి.. భయపెట్టి.. శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితుడిని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు’ అని పోలీసులు చెప్పారు. ఫొటో జర్నలిస్ట్ కేసులో అరెస్టైన ఐదుగురిలో ఇద్దరు లేదా ముగ్గురు.. తన పై అత్యాచారం చేసిన వారిలో ఉన్నారని సదరు యువతి తెలిపినట్లు వివరించారు. ఇప్పటికే పలువురిని ప్రశ్నించామని.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఫొటో జర్నలిస్ట్ రేప్ కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు ప్రశ్నించినప్పుడు.. గతంలోనూ తాము పలువురిపై అత్యాచారం జరిపిన విషయాన్ని వారు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 31 రేప్ ఘటనపైనా వారిని ప్రశ్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. -
మా వాళ్లు కాదు
ముంబై: గత వారం 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం చేసిన నిందితుల్లో కొందరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందినవారని వచ్చిన ఆరోపణలని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ కొట్టిపారేశారు. తనతో నిందితులు ఉన్నట్టుగా చూపే ఫొటోని ప్రచురించిన హిందీ డైలీ దూపర్ కా సామ్నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల ఫొటోలను ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా విడుదల చేయలేదని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (క్రైమ్) హిమాన్షు రాయ్‌తో మాట్లాడానని అన్నారు. పత్రికలో ప్రచురించిన ఫొటోలో తనతో ఉన్న వారికి, నిందితుల ముఖాలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారన్నారు. ఏమీ చూసుకోకుండానే ఫొటోను సోమవారం సర్క్యూలేట్ చేసిన ఉపాధ్యాయ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘దూపర్ కా సామ్నా పత్రికలో ప్రచురితమైన ఓ ఫొటోలో ముగ్గురు వ్యక్తుల ముఖాలను సర్కిల్ చేసి వీరు గ్యాంగ్ రేప్ నిందితులని పేర్కొంది. వారు సచిన్ అహీర్‌తో కరచాలనం చేస్తున్నట్టుగా ఉంది. 2010 సంవత్సరంలో ఓ ఈద్ కార్యక్రమంలో ఈ ఫొటో తీసినట్టు సేన పబ్లికేషన్ పేర్కొంది. ఈ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తాన’ని తెలిపారు. కొంత మంది రేపిస్టులు తనకు దగ్గరివాళ్లని, తన పార్టీ నిరాధారమైందని చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనంతో వారి మానసిక స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఇంతటి హేయమైన చర్యకు బీజేపీ చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కొంత మంది బీజేపీ నాయకుల వ్యక్తిగత సహాయకులు పార్టీని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ్ వల్ల ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అయితే పార్టీ నాయకులతో మాట్లాడి ఉపాధ్యాయ్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అన్నారు. కఠిన చట్టాలు తీసుకురావాలి: నటి కాజోల్ ముంబై: అత్యాచారాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని బాలీవుడ్ నటి కాజోల్ మంగళవారం డిమాండ్ చేశారు. ‘మహిళా ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారాన్ని చెప్పేందుకు ఎలాంటి మాటలు రావడం లేదు. అదో భయంకర సంఘటన. ఇది హత్య కన్నా ఏ మాత్రం తక్కువ కాద’ని అన్నారు. దీని గురించి మనం ఎంతో కొంత చేయాల్సి అవసరముందని చెప్పారు. కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రజల్లో భయం కలిగించే రీతిలో శిక్షలో మార్పు తీసుకరావాలి. ఆ మేరకు చట్టాలకు రూపకల్పన చేయాలి. దీనిని సర్కార్‌ను పట్టించుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయ’ని ఆమె చెప్పారు. -
నిందితులను పట్టించిన సెల్ఫోన్లు
సాక్షి, ముంబై: నగరంలోని శక్తిమిల్లు ప్రాంగణంలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సెల్ఫోన్ల ఆధారంగానే పోలీసులు పట్టుకోగలిగారు. అత్యాచారం తర్వాత ఐదుగురు నిందితులూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీ మరీన్ లైన్స్ పరిసరాలకు వెళ్లాడు. అప్పటికే అత్యాచారం సంఘటనపై వార్త దావానలంగా వ్యాపించిన విషయాన్ని తెలుసుకుని, అప్రమత్తమయ్యాడు. తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి రెండురోజులు దాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అతడు సెల్‌ఫోన్‌ను ఆన్ చేయడంతో సిగ్నల్స్ ద్వారా పోలీసులు అతడు ఇంకా నాగ్పాడా ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించగలిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు చేరుకునే లోగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని వెంటాడిన పోలీసులు ఆదివారం అతడిని పట్టుకోగలిగారు. జైభవానీనగర్ మురికివాడలో నివసించే మరో నిందితుడు చాంద్‌బాబు సత్తార్ షేక్‌ను సంఘటన జరిగిన 8 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ విషయం తెలియగానే అతడి సహచరుడు సలీం అన్సారీ గోవండిలోని మిత్రుని వద్దకు పారిపోయాడు. అతడి వద్ద కొంత డబ్బు తీసుకుని, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రైల్లో ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకున్నాక అతడు తన మిత్రుడికి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఢిల్లీకి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇదిలాఉండగా, జరిగిన ఘాతుకాన్ని చిత్రించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు నిందితులు చెబుతున్నారని, అది కూడా మొబైల్లో ప్రస్తుతం లేదని, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే ముంబై చేరుకుందని, గుజరాత్ ఫోరెన్సిక్ నిపుణులు త్వరలోనే రానున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్తులేనని చెప్పారు. చాంద్‌బాబు సత్తార్ షేక్, విజయ్ జాధవ్, మహమ్మద్ కాసింలపై చోరీ, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, బాధితురాలు మెల్లగా కోలుకుంటోందని, మానసిక వైద్యనిపుణులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని జస్లోక్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ చెప్పారు. దేశ ప్రజలకు బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు అత్యాచారం సంఘటన తర్వాత తమ కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులతో పాటు దేశప్రజలందరికీ, మీడియాకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు లేఖ రాశారు. అందరి అండ లభించడంతో తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామన్నారు. -
ముంబై గ్యాంగ్ రేప్ పై సోనమ్ కపూర్ నిరసన
-
నగరంలో నిరసన ప్రదర్శన
సాక్షి, ముంబై: ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబుల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ, ముంబై టీజేఏసీలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. దాదర్‌లోని ప్లాజా సినిమా సమీపంలో శనివారం ఈ రెండు సంస్థలు నిరసన సభను నిర్వహించాయి. నిందితులను అరెస్టు చేసి, వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. నిందితులకు కఠిన శిక్ష విధించాల న్నారు. అంతేకాకుండా బాధితురాలికయ్యే మొత్తం వైద్యఖర్చులను రాష్ట్రం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెండు సంఘాల కార్యకర్తలు నినాదాలు దేశారు. ఈ సభలో సొసైటీ అధ్యక్షురాలు బింగి అనూరాధ, మూల్నివాసి మాల, కె.నర్సింహగౌడ్, నాగ్‌సేన్‌మాల, కృష్ణ ఉదరి, వినాయక్ పద్మశాలి పాల్గొన్నారు. అమితాబ్ దిగ్భాంతి నగరంలో గురువారం సాయంత్రం ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి లోనుచేసిందని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ముంబై నగర పేరుప్రతిష్టలకు మచ్చగా నిలిచే ఇటువంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూడాలన్నారు. వెంటనే నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రంగంలోకి ప్రెస్ కౌన్సిల్ బృందం ఫొటో జర్నలిస్టు అత్యాచార ఘటనపై విచారణకోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నియమించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. తొలుత హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్‌లతో సమావేశమై సంప్రదింపులు జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు పీసీఐ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ... రాజీవ్ సబడే నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జర్నలిస్టుల వివరణ తీసుకుని వీలైనంత త్వరగా తమకు నివేదించాలని ఆదేశించారు. ఈ మేరకు ముంబై మరాఠీపత్రకార్ సంఘ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మళ్లీ విధులకు హాజరవుతా ‘అత్యాచారం జీవితానికి ముగింపు కాదని, నిందితులందరికీ కఠినశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు ముంబై నిర్భయ తెలిపిందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభవాల్కర్ పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు కోలుకుంటోందని తెలిపారు. -
ముంబై గ్యాంగ్ రేప్: ఏపీ ఫోటో జర్నలిస్టుల నిరసన
ఫోటోగ్రాఫర్ : అనిల్ కుమార్